సామాజికసారథి, నాగర్‌కర్నూల్ బ్యూరో: బీఎస్పీ నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా మాజీఎంపీ మందా జగన్నాథంకు దాదాపు టికెట్ ఖరారైంది. ఈనెల 18న ఆయన బీఎస్పీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. మందా జగన్నాథం మహబూబ్ నగర్ జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేత. అలంపూర్ కు చెందిన ఆయన స్వయానా డాక్టర్. ఆయన టీడీపీ నుంచి రాజకీయ అరగేట్రం చేశారు. 1999-2008(టీడీపీ), 2008-2013 (కాంగ్రెస్), 2013- 2014(టీఆర్‌ఎస్)లో ఎంపీగా గెలుపొందారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో బీఆర్‌ఎస్ పార్టీలో […]
బిజినేపల్లి మండలం వెలుగొండలో ఉద్రిక్తత సామాజికసారథి, బిజినేపల్లి: అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. డీజే పాటలతో ఊరేగింపు నిర్వహిస్తున్న కొందరు దళిత యువకులపై అదే గ్రామానికి చెందిన పలువురు అగ్రకులస్తులు దాడులకు తెగబడ్డారు. ఈ ఘటన ఆదివారం రాత్రి నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వెలుగొండ గ్రామంలో చోటుచేసుకుంది. బాధితులు, స్థానికుల కథనం మేరకు వివరాలు.. భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా గ్రామంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఊరుఊరంతా కదిలివచ్చి ఆ […]