Breaking News

ఆఖరి మోఖా.. మూగబోనున్న మైకులు

ఆఖరి మోఖా.. మూగబోనున్న మైకులు
  • మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం నేటితో లాస్ట్
  • పతాకస్థాయికి పొలిటికల్ వార్
  • ప్రచారానికి ఒక్క రోజు మాత్రమే గడువు
  • విస్తృతంగా ర్యాలీలు, గ్రామాల్లో సభలు
  • ఆ హోరెత్తిన బహిరంగ సభలు, సమావేశాలు
  • ఓటర్లతో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ నేతల ‘చివరి పలుకులు’
  • నవంబర్ 3న ఉపఎన్నిక, 6న ఫలితాలు

సామాజిక సారథి, మునుగోడు ప్రత్యేక ప్రతినిధి: మునుగోడు ఉపఎన్నిక ప్రచారం ఆఖరి మోఖాకు చేరింది. ప్రచారానికి తుది గడువు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీల నేతలంతా సుడిగాలి పర్యటనలు చేస్తూ నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. మంగళవారం సాయంత్రం 6గంటలకు వరకే ఎన్నికలు ప్రచారం చేసేందుకు గడువు ఉండటంతో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ పార్టీలు నియోజకవరంలోని 7 మండలాలు, 2 మున్సిపాలిటీలో విస్తృతంగా పర్యటనలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, బీఎస్సీ అభ్యర్థి ఆందోజు శంకరాచారికి మద్దతుగా ప్రచారాన్ని స్పీడ్ పెంచారు. మొత్తంగా గత నెలరోజులుగా మునుగోడులో హోరామోరీ ప్రచారం సాగింది.

టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే నియోజకవర్గంలో రణభేరితో భారీ బహిరంగ సభను నిర్వహించి కదనరంగానికి ఉరకలేస్తోంది. బీజేపీ సోమవారం నిర్వహించాల్సిన బహిరంగ సభ రద్దయింది. దీంతో ఆ ఎఫెక్ట్ నుంచి ప్రజల్లో నెగిటివ్ ఫిలింగ్ కుపొకుండా బీజేపీ శ్రేణులు మండలాల వారీగా సోమవారం 9సభలు నిర్వహించి ఓట్లు అభ్యర్థించే పనిలో నిమగ్నమయ్యారు. బీఎస్పీ ఆత్మగౌరవంతో ఇప్పటికే భారీ బహిరంగ సభ నిర్వహించి సత్తాచాటుకున్నది. నియోజకవర్గంలో బహుజనుల గొంతును వినిపిస్తూ ఇంటింటి ప్రచారంలో దూసుకుపోతుంది. కాంగ్రెస్ పార్టీ మండలాల వారీగా ప్రచారం చేస్తూ నియోజకవర్గాన్ని ఇప్పటికే చుట్టేసింది. నేడు నియోజకవర్గంలో భారీఎత్తున మహిళ గర్జనను నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లల్లో తలమునకలైయ్యారు. మొత్తానికి ఎన్నికల ప్రచారానికి కేవలం 12 గంటల సమయం ఉండటంతో ప్రధాన పార్టీలు ప్రతి నిమిషాన్ని వృథాకాకుండా ఓటరు దేవుళ్లను ఆకట్టుకునేందుకు పడరాని పాట్లుపడుతున్నారు. స్వతంత్ర అభ్యర్థులు సైతం నియోజకవర్గంలో ప్రత్యేక వాహనాలను ఏర్పాటుచేసి తమదైన శైలీలో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.

హోరెత్తిన టీఆర్ఎస్ ప్రచారం

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతులను ఆదుకున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా నాంపల్లిలోని అంగడి బజార్ లో మంత్రి తలసాని స్థానిక రైతులతో ముచ్చటించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పంట పెట్టుబడుల కోసం ఎకరానికి రూ. 10వేల ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ బావులకు మీటర్లు పెట్టే మోడీ సర్కార్  కు మునుగోడు ప్రజలు తమ ఓటుతో బుద్ధిచెప్పాలని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నా ఊకొండి. సింగారం గ్రామాల్లో సోమవారం 500 బైకులతో భారీర్యాలీ నిర్వహించారు. రెండు గ్రామాల్లోని వీధుల్లోకి ర్యాలీగా వెళ్లి.. ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. వల్ల ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నికల్లో వామపక్షాలు ఉన్న బలపరిచిన టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. సీఎం చడం కేసీఆర్ బహిరంగ సభతో టీఆర్ఎస్ గెలుపు ఖాయమైందని.. భారీ మెజారిటీ దిశగా తెల కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు దిగి రావాలంటే మునుగోడు ఎన్నికల్లో బీజేపీని చిత్తూ చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.