సారథి న్యూస్, రామగుండం: హథ్రాస్‌లో జరిగిన ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని దళితసంఘాలు డిమాండ్ చేశాయి. బీజేపీ ప్రభుత్వం అగ్రవర్ణాలకు కొమ్ముకాస్తూ దళితులను దగా చేస్తున్నదని దళితసంఘాల నేతలు ఆరోపించారు. యూపీలో అసలు ప్రజాస్వామ్యం ఉందా? మానవహక్కులు ఉన్నాయా? ప్రజాస్వామ్యదేశంలో ఇంత అన్యాయం జరుగుతుంటే ప్రభుత్వం నిస్సుగ్గుగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. ఆదివారం గోదావరి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట దళిత సంఘాల యాక్షన్ కమిటీ […]
షార్జా: షార్జా వేదికగా ఐపీఎల్13 టోర్నీలో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమిని చవిచూసింది. 34 పరుగుల తేడాతో ముంబై విజయం సాధించింది. మొదటి టాస్ గెలిచిన ముంబై బ్యాటింగ్ చేపట్టింది. నిర్ణీత 20 ఓవర్లలో 209 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ముంబై సారథి రోహిత్‌శర్మ ఆరు పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. డికాక్ 67 (39 బంతులు, 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఎస్ఏ యాదవ్ 27 (18 బంతులు, 6 […]
సారథి న్యూస్, ఎల్బీ నగర్: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ గుంతలుపడి బురదమయంగా మారాయి. మరమ్మతులు చేపట్టడంలో జీహెచ్ఎంసీ అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టేలా టీడీపీ నాయకులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఆదివారం హయాత్‌నగర్ డివిజన్ పరిధిలోని అన్మగల్, హయత్‌నగర్ లో టీడీపీ డివిజన్ అధ్యక్షుడు దాసరమొని శ్రీనివాస్ ముదిరాజ్, పార్టీ సీనియర్ నాయకుడు సింగిరెడ్డి మురళీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇన్ఫర్మేషన్ కాలనీ, వెంకటాద్రికాలనీ, సత్యనారాయణ కాలనీల్లో వరి నాట్లు వేసి నిరసన […]
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహ్మమారి విజృంభణ కొనసాగుతోంది. ఆదివారం కొత్తగా 6,242 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,19,256కు చేరింది. మహమ్మారి బారినపడి 40 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు 5,981 మంది మరణించారు. మొత్తం 72,811 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 54,400 మంది కరోనా చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 6,58,875 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హెల్త్ బులిటెన్ […]
సారథి న్యూస్, బిజినేపల్లి: జిల్లా వైద్యారోగ్యశాఖ ద్వారా ఈనెల 5 నుంచి 12వ తేదీ వరకు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న జాతీయ నులిపురుగుల నిర్మూలన వారోత్సవాల్లో భాగంగా అర్హులైన ప్రతి చిన్నారికి నులి పురుగుల నివారణ మాత్రలు వేయించాలని లట్టుపల్లి వైద్యాధికారి డాక్టర్ ఎస్.రాజేష్ గౌడ్ సూచించారు. ల్లాలోని బిజినపల్లి మండలంలోని లట్టుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని నాలుగు గ్రామాలు, 27 గిరిజన తండాల్లో 4,335 చిన్నారులకు ఆల్బెండజోల్ మాత్రలు వేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. 2 […]
సారథి న్యూస్, బిజినేపల్లి: గ్రామంలోని ఇండ్లు, ఇతర అన్ని రకాల నిర్మాణాలకు కూడా భ్రదత కల్పిస్తూ పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, అందుకోసం అన్ని ఇండ్లను, ప్రభుత్వ, ప్రైవేట్ఆస్తుల వివరాలను ధరణి పోర్టల్ లో పొందుపర్చుకోవాలని నాగర్‌కర్నూల్‌జిల్లా బిజినేపల్లి ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గ్రామాల్లో నిర్వహిస్తున్న ఆస్తి ఆన్లైన్ప్రక్రియను క్షేత్రస్థాయిలో పాలెం గ్రామంలో ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ ఆకస్మికంగా పరిశీలించారు. గ్రామంలో ఉన్న ఇండ్లు, ప్రభుత్వ, ప్రైవేట్ఆస్తుల వివరాలను ధరణి పోర్టల్ […]
సత్కవి గుర్రం జాషువా భారతరత్న డాక్టర్బాబాసాహెబ్ అంబేద్కర్ సమకాలికుడు. అంబేద్కర్ కంటే నాలుగేళ్లు చిన్నవాడు. అస్పృశ్యతను చవిచూసిన ఈ కవిరేణ్యుడు తన ఖండ కావ్యం ‘గబ్బిలం’ లో నాటి సామాజిక వ్యవస్థ మూలాలు, అమానవీయ దౌష్ట్యాన్ని కరుణారస భరితంగా వర్ణించి సాహిత్య వేదికపై మానవ జాతిని మేలు కొల్పిన సంఘసంస్కర్త. మరీ ముఖ్యంగా అరుంధతీయుల దుర్భర జీవనగతులను ‘ప్రశ్నించే చైతన్యం’తో అనుసంధించి సమర సతాత్మక ప్రబోధంతో సమాజాన్ని తట్టిలేపిన విశ్వనరుడు. జాతీయోద్యమం స్ఫూర్తితో దేశభక్తి కొత్తపుంతలు తొక్కుతున్న […]
ట్రంప్ ఆరోగ్య పరిస్థితి ఎంతో విషమంగా ఉన్నట్టు సమాచారం. కరోనాతో ట్రంప్ ఇటీవలే ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. మరో 48 గంటలు దాటితే గానీ ఏ విషయం చెప్పలేమని వైద్యులు చెబుతున్నారు. అయితే ట్రంప్ మాత్రం ప్రస్తుతం మాట్లాడుతున్నారు. ‘ఇప్పటికైతే నేను ఆరోగ్యంగానే ఉన్నాను. కానీ రానున్న కొన్ని గంటలే కీలకం’ అంటూ ఆస్పత్రి నుంచే ఓ వీడియోను పోస్ట్ చేశారు. వాషింగ్టన్ డీసీలోని వాల్టర్ రీడ్ నేషనల్ మిలటరీ మెడికల్ సెంటర్లో ఆయన చికిత్స […]