Breaking News

Month: October 2020

హైదరాబాద్.. ఫోర్త్​ప్లేస్

హైదరాబాద్.. ఫోర్త్​ప్లేస్

షార్జా: ఐపీఎల్​13వ సీజన్​లో భాగంగా షార్జా వేదికగా రాయల్​ చాలెంజర్స్​ బెంగళూరు(ఆర్సీబీ)తో జరిగిన 52వ మ్యాచ్​లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఘన విజయం సాధించింది. ఇది సన్‌రైజర్స్‌కు ఆరో విజయం. పాయింట్ల పట్టికలో ఫోర్త్​ ప్లేస్​కు చేరింది. ముందుగా ఆర్సీబీ నిర్దేశించిన 121 పరుగుల టార్గెట్‌ను 14.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ గెలవడంతో ప్లే ఆఫ్‌ ఆశలను ఇంకా సజీవంగా ఉన్నాయి. వృద్ధిమాన్‌ సాహా( 39; 32 బంతుల్లో 4×4, 6×1) […]

Read More
రామారావు మహరాజ్ కు ఘననివాళి

రాంరావు మహరాజ్ కు ఘననివాళి

సారథి న్యూస్, రామాయంపేట: రాజయోగి రాంరావు మహరాజ్ చిత్రపటానికి మెదక్​ జిల్లా నిజాంపేట మండలంలోని జెడ్ చెర్వు గ్రామ సర్పంచ్ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు.

Read More
కురుమూర్తి జాతరకు రావొద్దు

కురుమూర్తి జాతరకు రావొద్దు

సారథి న్యూస్, మహబూబ్​నగర్: వచ్చే కురుమూర్తి జాతరకు ప్రజలెవరూ ఆలయానికి రావద్దని, ఇళ్ల వద్దనే పూజలు నిర్వహించుకునేలా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు సంబంధిత అధికారులకు సూచించారు. శనివారం జడ్పీ మీటింగ్​హాల్​లో సమీక్ష సమావేశం నిర్వహించారు. కురుమూర్తి జాతర ఉత్సవాలకు మన జిల్లా నుంచే కాకుండా వివిధ జిల్లాలు, రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈసారి కరోనా నేపథ్యంలో ప్రజలకు ఇళ్లవద్దనే సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించుకోవాలని సూచించారు. ఆలయాధికారులు కరోనా నిబంధనలు […]

Read More
ఏజెన్సీ ప్రాంతంలో ఎల్ఆర్ఎస్ వద్దు

ఏజెన్సీ ప్రాంతంలో ఎల్ఆర్ఎస్ వద్దు

సారథి న్యూస్, వాజేడు, ములుగు: కొమరం భీమ్​ 80వ వర్ధంతిని ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో తుడుందెబ్బ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. కొమురం భీమ్​ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ముఖ్యఅతిథులుగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మైపతి అరుణ్ కుమార్, ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొప్పుల రవి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నేడు రాష్ట్రంలో ఆదివాసీల హక్కులు, ఆదివాసీ ప్రజలకు […]

Read More
ధరణితో భూ హక్కులకు సంపూర్ణ భద్రత

ధరణితో భూ హక్కులకు సంపూర్ణ భద్రత

ప్రతి 5వేల ఎకరాలకు రైతువేదిక ఏర్పాటు హరితహారంతో ఆకుపచ్చ తెలంగాణ ప్రతిపక్షాల అసత్యప్రచారాలను నమ్మొద్దు రైతు ఆత్మీయ సమావేశంలో సీఎం కె.చంద్రశేఖర్​రావు జనగామ జిల్లా కొడగండ్లలో రైతువేదిక ప్రారంభం సారథి న్యూస్, జనగామ: రైతు సంక్షేమమే ప్రధానధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం కె.చంద్రశేఖర్​రావు అన్నారు. ధరణి పోర్టల్​ ద్వారా భూమిపై హక్కులకు సంపూర్ణ రక్షణ ఉంటుందన్నారు. శనివారం జనగామ జిల్లాలోని కడగండ్ల గ్రామంలో నిర్మించిన రైతు వేదిక నిర్మాణాన్ని ఆయన ప్రారంభించారు. రైతులు తమ సమస్యలను చర్చించేందుకే […]

Read More
‘పంజాబ్’​ దూకుడుకు బ్రేక్​

‘పంజాబ్’​ దూకుడుకు బ్రేక్​

అబుదాబి: ఐపీఎల్​13 సీజన్​లో భాగంగా అబుదాబి వేదికగా జరిగిన 50వ మ్యాచ్​లో కింగ్స్​ ఎలెవన్​పంజాబ్​పై రాజస్తాన్​రాయల్స్​7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో వరుసగా ఐదు మ్యాచ్​లు గెలిచిన పంజాబ్ ​దూకుడుకు బ్రేక్​ పడినట్లయింది. రాజస్తాన్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకోవడంతో మొదట బ్యాటింగ్​చేసిన కింగ్స్‌ పంజాబ్‌ 186 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. క్రిస్‌ గేల్‌ (99; 63 బంతుల్లో 4×6, 6×8), కేఎల్‌ రాహుల్‌ (46;41 బంతుల్లో 4×3, 6×2) రాణించడంతో పాటు పూరన్‌(22; […]

Read More
ఎవరికీ పట్టని వారియర్స్ బాధలు

ఎవరికీ పట్టని వారియర్స్ బాధలు

కరోనా మహమ్మారి భయానికి దేశమంతట తలుపులకు గొళ్లాలుపడ్డాయి. వైరస్​కోరలకు తామెక్కడ చిక్కుకోవాల్సి వస్తుందోనని ఇరుగుపొరుగుతో బంధాలు తెంచుకున్నాయి. కానీ, ఆరోగ్య కార్యకర్తలు మాత్రం మహమ్మారి సైరన్​దేశంలో మోగడంతోనే గడపదాటారు. ఇంట్లోని పిల్లాజల్లా వద్దని వాదించినా దేశమంతా లాక్​డౌన్​లో ఉంటే వీళ్లు మాత్రం ప్రాణాలకు తెగించి రోడ్డెక్కారు. ముఖ్యంగా మహిళలు పేగులు మెలిపెట్టే నెలసరి నొప్పులు, దీర్ఘకాలికంగా ఉన్న ఆరోగ్య సమస్యలను లెక్కచేయకుండా కరోనా కట్టడికి అహర్నిశలు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికీ ఏ మాత్రం అలుపెరగకుండా కరోనాతో కంటికి కనిపించని […]

Read More
పుస్తెమట్టెల అందజేత

పుస్తెమట్టెల అందజేత

సారథి న్యూస్, రామాయంపేట: నిజాంపేట మండలంలోని నందగోకుల్ గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన దొరలగల్ల యాదయ్య కూతురు పెళ్లికి నిజాంపేట జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ శుక్రవారం పుస్తెమట్టెలు అందజేశారు. కార్యక్రమంలో నార్లపూర్ ఎంపీటీసీ సభ్యుడు రాజిరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు గురుగల శ్రీనివాస్, నిజాంపేట ఉపసర్పంచ్ కొమ్మట బాబు పాల్గొన్నారు.

Read More