రాణిశంకరమ్మ ఇనాం భూములపై వివాదం వందేళ్లుగా కాస్తులో టెంకటి గ్రామపేద రైతులు ఓఆర్‌సీ తీసుకోకపోవడంతో రాణివారసులకు హక్కు హక్కుదారులుగా పరిగణిస్తూ.. పట్టాబుక్కులు జారీ ఇటీవల అమ్ముకోవడంతో వెలుగులోకి భూవివాదం న్యాయం చేయాలని కోరుతున్న పేద రైతులు వంద ఏళ్లుగా దున్నుకొని బతుకుతున్న పేదల ఈనాం భూములపై కొందరి కన్నుపడింది. గుంట, రెండు గుంటల చొప్పున సాగుచేసుకుని జీవనోపాధి పొందుతున్న బక్క జీవుల బతుకుల్లో ధరణి మట్టికొట్టింది. ఈ భూములు తమవే అనుకున్న సాగుదారులు ఓఆర్సీ తీసుకోలేదు. దీంతో […]
సారథి, అలంపూర్(మానవపాడు): జోగుళాంబ గద్వాల జిల్లా అడిషనల్ కలెక్టర్ రఘురామశర్మ బుధవారం అలంపూర్ జోగుళాంబ, బాలబ్రహ్మశ్వర స్వామి ఆలయాలను దర్శించుకున్నారు. అనంతరం స్థానిక తహసీల్దార్ ఆఫీసు నుంచి జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ధరణి వెబ్సైట్ నుంచి అందిన ఫిర్యాదులపై సలహాలు, సూచనలు ఇచ్చారు. అలాగే ఊట్కూర్ గ్రామ శివారులో ఉన్న ప్రభుత్వభూమిలో గతంలో లావాణీ పట్టాలు ఇచ్చినా రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయకపోవడంతో రైతుల భూములను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ విషయమై […]
సారథి, రామడుగు: గతంలో మ్యుటేషన్ కోసం నెలల నుంచి ఏళ్ల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేదని, ధరణి కార్యక్రమంతో రాష్ట్రంలోని అన్ని భూములను డిజిటలైజేషన్ చేయడం శుభపరిణామమని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. కరీంనగర్జిల్లా రామడుగు మండల తహసీల్దార్ ఆఫీసులో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన రైతులకు విశ్రాంతి గది, రక్షిత తాగునీటి సౌకర్యం, టాయిలెట్స్, ఆఫీస్ రెనవేషన్ రూములను ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ.. రిజిస్ట్రేషన్ కు […]
సారథి, మానవపాడు: ధరణి సేవలను ప్రజలకు అందుబాటులో పారదర్శకంగా అందించాలని జోగుళాంబ గద్వాల జిల్లా ఈడీఎం ఫారూఖ్ సూచించారు. గురువారం మానవపాడు మండల కేంద్రంలోని మీసేవ సెంటర్లను ఆయన పరిశీలించారు. మీసేవ ద్వారా అందించే కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో పాటు రైతులకు అందించే సేవలకు అధిక రేట్లు తీసుకోకుండా ప్రభుత్వం సేవలు అందించాలని సూచించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కూడా పారదర్శకత పాటించాలని ఆదేశించారు. అనంతరం మానపాడు తహసీల్దార్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సందర్శించి అక్కడ రైతులకు […]
సారథి, రామడుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భూముల అమ్మకానికి తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 15న జరిగే కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీపీఐ కరీంనగర్ జిల్లా సహాయ కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం రామడుగు మండల కేంద్రంలో సీపీఐ ముఖ్యకార్యకర్తల సమావేశం గొడిశాల తిరుపతిగౌడ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ భూముల వేలం కోసం తెచ్చిన జీవోనం.13ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పేదలకు ఇండ్ల […]
అన్ని భూముల డిజిటలైజేషన్ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ సారథి, చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో రూ.10లక్షల వ్యయంతో నిర్మించనున్న రెస్ట్ రూం, సురక్షిత తాగునీటి సౌకర్యం, టాయిలెట్స్, ఆఫీస్ రినవేషన్ రూం పనులను ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అడిషనల్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ తో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రిజిస్ట్రేషన్ కు వచ్చే రైతులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. గతంలో తహసీల్దార్ ఆఫీసుకు వచ్చేవారు చెట్లకింద […]
సారథి, మానవపాడు: కేవలం ఏడు నిమిషాల్లోనే భూమి రిజిస్ట్రేషన్ కావడంపై వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సంతోషం వ్యక్తంచేశారు. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు తహసీల్దార్ కార్యాలయానికి ఓ సాధారణ వ్యక్తిలా వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ధరణి రైతులకు ఒక వరమని, మధ్యవర్తులు, బ్రోకర్ల ప్రమేయం లేకుండా మీ సేవకు వెళ్లి ధరణి పోర్టల్ లో ఆన్లైన్చేసుకుంటే ఈజీగా రిజిస్ట్రేషన్అయిందని గుర్తుచేశారు. ధరణి సేవలను తెలుసుకునేందుకే సాధారణ వ్యక్తిలా వచ్చానని తెలిపారు.
సారథి న్యూస్, మెదక్: ఈనెల 11వ తేదీలోగా మెదక్ జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులను ఆదేవించారు. శుక్రవారం ఆయన కల్లెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని 429 పంచాయతీలతో పాటు గుర్తించిన 84 మదిర గ్రామాల్లో పల్లెప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో 27లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నాయని, అధికారులు ఒక స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు. జిల్లాలో ధరణి అద్భుతంగా పనిచేస్తోందన్నారు. […]