– ప్రపంచం నలుమూలలా భారత్ టెక్కీలు– జీఎఫ్‌ఎస్‌టీ సదస్సులో చంద్రబాబు సామాజికసారథి, హైదరాబాద్: ప్రపంచ దేశాల్లో 2047 నాటికి ఇండియన్స్ నెంబర్‌వన్‌గా ఉంటారని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్‌లో డీప్ టెక్నాలజీస్ అంశంపై జీఎఫ్‌ఎస్‌టీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జీఎఫ్‌ఎస్‌టీ చైర్మన్ హోదాలో చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెక్నాలజీని అందిపుచ్చుకుంటే అన్నీ సాధ్యమేనని చెప్పారు. ఐటీతో ప్రపంచమంతా భారతీయులు విస్తరించారని తెలిపారు. 2047 నాటికి భారత్ […]
బాక్సాఫీస్ దగ్గర నట సింహం నందమూరి బాలకృష్ణ విశ్వరూపం చూపించారు. ఫస్ట్ డే ‘వీర సింహా రెడ్డి’కి సూపర్బ్ కలెక్షన్స్ సాధించింది. ఆయన హీరోగా నటించిన తాజా సినిమా ‘వీర సింహా రెడ్డి’ ఫస్ట్ డే రికార్డ్ కలెక్షన్లు సాధించింది. బాలకృష్ణ కెరీర్ చూస్తే బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఫిగర్స్ చూపించింది. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు ఈ సినిమా 54 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్టు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అనౌన్స్ చేసింది. […]
సామాజిక సారథి, హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్, రాజకీయ భీష్ముడిగా పేరొందిన కొణిజేటి రోశయ్య(88) శనివారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ పల్స్ పడిపోవడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు సతీమణి శివలక్ష్మి, ముగ్గురు సతానం ఉన్నారు. ఉమ్మడి ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ఉద్దండులైన నేతగా పేరొందారు. వయస్సు రీత్యా రాజకీయాలకు కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. మలి దశ తెలంగాణ ఉద్యమ సమయంలో సంచలన […]
సారథి, అచ్చంపేట: ఆంధ్రప్రదేశ్ అక్రమంగా ప్రాజెక్టులను నిర్మిస్తే ఊరుకునేది లేదని, జలదోపిడీపై అక్కడే పాతరేస్తామని నాగర్ కర్నూల్జిల్లా అచ్చంపేట జడ్పీటీసీ సభ్యుడు మంత్రియ నాయక్ హెచ్చరించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కాంగ్రెస్, బీజేపీ సైంధవపాత్ర పోషిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్ర హక్కులకు విరుద్ధంగా కృష్ణా బేసిన్‌లో దోసెడు నీళ్లను కూడా తీసుకోనివ్వబోమని ఘాటుగా హెచ్చరించారు. కృష్ణాజలాల్లో తెలంగాణ వాటాను తేల్చకుండా కేంద్రప్రభుత్వం చోద్యం […]
సారథి, కరీంనగర్: పెద్దపల్లి జడ్పీ చైర్మన్, టీఆర్ఎస్ నేత పుట్ట మధునుపశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. కొద్దిరోజులుగా ఆయన సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అజ్ఞాతంలో ఉన్నారు. దీంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఇటీవల మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ కు పుట్ట మధుతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో పాటు వ్యాపార లావేదేవీలు నిర్వహించారని సమాచారం. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పుట్ట మధుపైనా సీఎం కేసిఆర్ తీవ్ర […]
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామపంచాయతీల ఏకగ్రీవానికి ప్రోత్సాహకాలను భారీగా పెంచింది. రూ.2 నుంచి రూ.20లక్షల వరకు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ ప్రోత్సాహకాలకు విస్తృతంగా ప్రచారం కల్పించాలని మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఆదేశాలు జారీచేశారు.ఇవి ప్రోత్సాహకాలు– 2వేలలోపు జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకు రూ.5లక్షలు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.– 2 నుంచి 5వేల జనాభా కలిగిన పంచాయతీలకు రూ.10 లక్షల ప్రోత్సాహకం ఇవ్వనుంది.– 5వేల […]
అమరావతి: ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్‌లో గ్రామపంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది. రెవెన్యూ డివిజన్ల వారీగా నాలుగు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. గతంలో చేసిన ప్రకటనను రీ షెడ్యూల్ చేసింది. గత షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 5,9,13,17వ తేదీల్లో ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. తాజాగా మార్పులు చేస్తూ ఫిబ్రవరి 9, 13, 17, 21 తేదీల్లో పోలింగ్నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఇక మొదటి దశ ఎన్నికలకు సంబంధించి జనవరి 29 నుంచి, […]
సారథి న్యూస్, హైదరాబాద్: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈనెల 8 నుంచి 14వ తేదీ వరకు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపిస్తున్నట్లు టీఎస్ ఆర్టీసీ రంగారెడ్డి జిల్లా ప్రాంతీయ మేనేజర్ బి.వరప్రసాద్ వెల్లడించారు. హైదరాబాద్ నుంచి తెలంగాణ సహా ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాలకు 4,980 ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నట్లు వివరించారు. వాటిలో తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు3,380 ప్రత్యేక బస్సులను, ఏపీకి 1,600 బస్సులను నడిపిస్తున్నట్లు తెలిపారు. […]