Breaking News

GHMC

జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో అగ్నిప్రమాదం

జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో అగ్నిప్రమాదం

సామాజిక సారథి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ జోనల్‌ కార్యాలయంలో బుధవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జీహెచ్‌ఎంసీ కార్యాలయంలోని మూడవ అంతస్తులో టాక్స్‌ సెక్షన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కార్యాలయమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. భారీగా మంటలు చెలరేగడంతో ఆందోళనకు గురైన ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. మంటల్లో కార్యాలయంలోని పలు ఫైల్స్​దగ్ధమయ్యాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. దీంతో లిప్ట్‌ నిలిచి పోవడంతో అందులో ఉన్నవారు ఆర్తనాదాలు చేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది […]

Read More
మంత్రి కేటీఆర్ ​పరామర్శ

మంత్రి కేటీఆర్​ పరామర్శ

సారథి న్యూస్, మహబూబ్​నగర్: రెండు రోజుల క్రితం మంత్రి వి.శ్రీనివాస్​గౌడ్​తండ్రి నారాయణగౌడ్​కన్నుమూసిన విషయం తెలిసిందే. మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు మంగళవారం ఎక్సైజ్​శాఖ మంత్రి వి.శ్రీనివాస్​గౌడ్​ను పరామర్శించారు. మహబూబ్​నగర్​లోని మంత్రి నివాసానికి వచ్చి ఆయన తండ్రి వి.నారాయణ గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, మాజీమంత్రి సి.లక్ష్మారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Read More
జీహెచ్​ఎంసీ మేయర్​గా గద్వాల విజయలక్ష్మి

జీహెచ్​ఎంసీ మేయర్​గా గద్వాల విజయలక్ష్మి

డిప్యూటీ మేయర్​గా మోతే శ్రీలతరెడ్డి ఎన్నిక నూతన పాలకవర్గాన్నిఅభినందించిన మంత్రులు, ఎమ్మెల్యేలు సారథి న్యూస్, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్​మేయర్ గా టీఆర్ఎస్​నుంచి గెలుపొందిన బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ గా తార్నాక టీఆర్ఎస్ కార్పొరేటర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల అధికారి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతామహంతి చేతులమీదుగా ధ్రువీకరణపత్రాలను గురువారం అందుకున్నారు. వారిని డిప్యూటీ స్పీకర్​ తిగుళ్ల పద్మారావుగౌడ్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, తలసాని […]

Read More
విశ్వనగరానికి పేరు తీసుకొద్దాం

విశ్వనగరానికి పేరు తీసుకొద్దాం

అన్ని కులాలు, మతాలను ప్రేమించండి ప్రజాజీవితంలో మంచిపేరు తెచ్చుకోవాలి సంయమనం, సహనం, సాదాసీదాగా ఉండాలి మేయర్​, డిప్యూటీ మేయర్​, కార్పొరేటర్లతో సీఎం కేసీఆర్​ సారథి న్యూస్, హైదరాబాద్: విభిన్న ప్రాంతాలు, విభిన్న సంస్కృతులకు చెందిన ప్రజలు నివాసముంటున్న హైదరాబాద్ నగరం అసలు సిసలైన విశ్వనగరంగా, మినీ ఇండియాగా భాసిల్లుతున్నదని, ఈ నగర వైభవాన్ని మరింత పెంచేలా కొత్తగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు పాటుపడాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. కొత్తగా ఎన్నికైన జీహెచ్ఎంసీ మేయర్ […]

Read More
వరద సాయం కోసం ‘మీసేవ’ వద్దకు వెళ్లొద్దు

వరద సాయం కోసం ‘మీసేవ’ వద్దకు వెళ్లొద్దు

సారథి న్యూస్, హైదరాబాద్: జీహెచ్ఎంసీలో వరద సహాయం కోసం మీ సేవ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి ఇంకా వరద సహాయం అందని వారి వివరాలను సేకరిస్తున్నాయని తెలిపారు. బాధితుల వివరాలు, ఆధార్ నంబర్​ ధ్రువీకరణ జరుగుతుందని, ఆ తర్వాత వారి అకౌంట్ లోనే వరద సహాయం డబ్బులు జమవుతాయని చెప్పారు. ఈనెల 7వ తేదీ నుంచి సాయం అందని వారికి మళ్లీ […]

Read More
మరికొద్ది గంటల్లో జీహెచ్ఎంసీ పోలింగ్​

మరికొద్ది గంటల్లో జీహెచ్ఎంసీ పోలింగ్​

సారథి న్యూస్​, హైదరాబాద్‌: గ్రేటర్​ ఎన్నికల్లో మరో కీలకమైన ఘట్టం మరికొద్ది గంటల్లో ప్రారంభంకానుంది. షెడ్యూల్​లో భాగంగా డిసెంబర్​1న పోలింగ్ ​జరగనుంది. 4న ఫలితాలను వెల్లడించనున్నారు. అయితే నేతల వాగ్దానాలు, హామీలు, వాడీవేడి విమర్శల మధ్య ప్రచారం పర్వం ఆదివారం సాయంత్రం నాటికే ముగిసింది. సిటీలోని మొత్తం 15‌‌0 డివిజన్లలో ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాద్ 84, సైబరాబాద్ 38, రాచకొండ పరిధిలో 28, హైదరాబాద్ సిటీలో 4,979 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేసినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఉదయం […]

Read More
బీజేపీలో చేరిన మాజీమేయర్​కార్తీకరెడ్డి

బీజేపీలో చేరిన మాజీ మేయర్ ​కార్తీకరెడ్డి

హైదరాబాద్: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) మాజీ మేయర్, కాంగ్రెస్ నాయకురాలు బండ కార్తీకరెడ్డి తన భర్త చంద్రారెడ్డితో కలిసి బుధవారం బీజేపీలో చేరారు. వారికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం భూపేంద్ర యాదవ్‌ మాట్లాడుతూ తెలంగాణలో అవినీతి ప్రభుత్వాన్ని తరిమికొట్టడమే తమ లక్ష్యమన్నారు. గ్రేటర్ మేయర్ పీఠం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. కార్తీకరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు సీటు ఇవ్వకుండా మోసం […]

Read More
బీజేపీపై ఇక యుద్ధమే..

బీజేపీపై ఇక యుద్ధమే..

సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలోని 110డివిజన్లలో గెలుపు తమదేనని టీఆర్​ఎస్​ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్​రావు ధీమా వ్యక్తంచేశారు. జీహెచ్ఎంసీ సర్వేలన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయని స్పష్టంచేశారు. బీజేపీ వ్యతిరేక పోరాటం హైదరాబాద్ నుంచి మొదలు పెట్టబోతున్నామని పేర్కొన్నారు. దేశంలో బీజేపీ దుర్మార్గం గా వ్యవహరిస్తోందన్నారు. టీఆర్ఎస్ లోకసభ, రాజ్యసభ, శాసనసభ, శాసనమండలి, జీహెచ్ఎంసీ డివిజన్ ఇన్​చార్జ్​ సంయుక్త సమావేశం ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన బుధవారం తెలంగాణ భవన్ లో జరిగింది. ఈ […]

Read More