సామాజికసారథి, రామకృష్ణాపూర్: గణేశ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన మండపాల వద్ద డీజే, సినిమా పాటలకు తావివ్వకుండా భక్తి పాటలతో ఉత్సవాలను నిర్వహించుకోవాలని టీడీపీ పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షుడు సంజయ్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని జీటీ హాస్టల్ బాలగణేష్ మండలి వద్ద ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భారతీయ, తెలంగాణ సంస్కృతిని తలపించేలా రామాయణం, మహాభారతం, సాంస్కృతి వేషధారణకు సంబంధించిన కార్యక్రమాలతో యువత, విద్యార్థులను చైతన్య పరిచేలా సెప్టెంబర్ 5న పట్టణంలోని జీటీ హాస్టల్ […]
సారథి, రామడుగు: మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వాలని టీడీపీ రామడుగు మండలాధ్యక్షుడు అమిరిశెట్టి సుధాకర్ ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. ఎన్టీఆర్ 98వ జయంతి వేడుకలను టీడీపీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లుగా భావించి కూడు, గూడు గుడ్డ అనే నినాదంతో తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో టీడీపీని స్థాపించారని గుర్తుచేశారు. మద్యపాన నిషేధం, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, జనతావస్త్రాలు, పటేల్ పట్వారీ […]
సారథి న్యూస్, నల్లగొండ: టీడీపీ అధినేత, మాజీ సీఎం ఎన్.చంద్రబాబు నాయుడు ప్రయాణిస్తున్న కాన్వాయ్ సాంకేతిక లోపం కారణంగా శుక్రవారం సాయంత్రం నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి కామినేని ఆస్పత్రి వద్ద నిలిచిపోయింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపునకు చంద్రబాబు వెళ్తున్నారు. ఇంతలో వాహనం నిలిచిపోయింది. అప్రమత్తమైన సిబ్బంది మరో వాహనశ్రేణిలో ఆయనను హైదరాబాద్‌కు తీసుకెళ్లారు.
అమరావతి: టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత తన పదవికి రాజీనామా చేశారు. బుధవారం ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్‌కు తన రాజీనామా పత్రాన్ని పంపించారు. రాష్ట్రంలో టీడీపీ చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆమె ప్రకటించారు. టీడీపీ కొద్దిరోజులుగా ఏపీ అభివృద్ధికి అడ్డుపడుతూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న అభివృద్ధిని, సంక్షేమ పథకాలను టీడీపీ అడ్డుకుంటుందని […]
సారథి న్యూస్, హయత్‌నగర్: రెండు రోజులుగా కురుస్తున్న అతి భారీ వర్షాల కారణంగా హయత్నగర్డివిజన్ పరిధిలోని రంగనాయకులగుట్ట, బంజారాకాలనీ, అంబేద్కర్ కాలనీ, భగత్ సింగ్ కాలనీ లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చాలా ఇళ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. టీడీపీ హయత్ నగర్ డివిజన్ సీనియర్ నాయకులు సింగిరెడ్డి మురళీధర్ రెడ్డి పార్టీ కార్యకర్తలతో తరలి వెళ్లి వరద నీళ్లలో చిక్కిన బాధితులను తాడు సాయంతో ఎత్తు ప్రదేశానికి తరలించారు. బాధితులందరికీ పునరావాసం […]
దుబ్బాకలో పోటీకి టీడీపీ, వామపక్షాలు లేనట్లేనా? క్లారిటీ ఇవ్వని ఆయా పార్టీల అదినాయకత్వం సారథి న్యూస్, దుబ్బాక: నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ తారజువ్వలా వెలిగిన పార్టీలు ఇప్పుడు కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదు. గతేడాది క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీలు తమ ఉనికిని కాపాడుకుకోలేకపోగా, అసెంబ్లీ ఎన్నికల్లో సైతం కనిపించ లేదు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత క్రమంగా ఆ చదరంగంలో మసకబారిపోతున్న ఆపార్టీల భవిష్యత్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందని […]
కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న రాయలసీమలో తీవ్ర అలజడి చెలరేగింది. కర్నూల్ జిల్లా నంద్యాలలో వైసీపీ నేత సుబ్బారాయుడు దారుణహత్యకు గురయ్యారు. ప్రస్తుతం నంద్యాలలో టెన్షన్ వాతావరణం నెలకొన్నది. శుక్రవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లిన సుబ్బారాయుడిపై గుర్తు తెలియని దుండగులు కర్రలతో వచక్షణారహితంగా దాడి చేశారు. నంద్యాలలోని విజయ పాల డెయిరీ సమీపంలో ఈ హత్య జరిగింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తున్నది. పాతకక్షలతోనే […]
వైసీపీ రెబల్ ఎంపీ, నిత్యం ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై విరుచుకుపడే రఘురామకృష్ణంరాజుకు తొలిసారి షాక్ తగిలింది. ఆయన ఇండ్లు, కంపెనీలు, ఆఫీసుల్లో గురువారం సీబీఐ సోదాలు నిర్వహించి కీలకపత్రాలు స్వాధీనం చేసుకున్నది. ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ ప్రత్యేక బృందాలు… రఘురామకృష్ణంరాజుకు చెందిన ఇందు, భారత్ కంపెనీ తో సహా ఎనిమిది కంపెనీలకు చెందిన డైరెక్టర్ ల ఇళ్లలో సోదాలు చేసింది. ఉదయం ఆరు గంటలనుండి సోదాలు జరుగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం […]