సారథి న్యూస్, రామగుండం: టీఆర్ఎస్ పార్టీని రామగుండం నియోజకవర్గంలో మరింత బలోపేతం చేద్దామని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. గురువారం ఆయన రామగుండం నియోజవర్గం టీఆర్ఎస్ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను గడపగడపకు తీసుకెళ్లేందుకు కార్యకర్తలు కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటి మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, సమన్వయ కమిటీ సభ్యులు, పట్టణ కమిటి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
మృతుల్లో ఇద్దరు మహిళలు ఒకరు రెండేళ్ల చిన్నారి.. సారథి న్యూస్, మెదక్: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. వీరిలో ఇద్దరు మహిళలు, ఒకరు రెండేళ్ల చిన్నారి ఉంది. బాలానగర్- మెదక్ నేషనల్ హైవే పై మెదక్ జిల్లా కొల్చారం మండలం కిష్టాపూర్ వద్ద గురువారం రాత్రి ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కొల్చారం మండలం అప్పాజిపల్లి గ్రామానికి చెందిన ఆటో మెదక్ నుంచి కొల్చారం వైపునకు వస్తుండగా హైదరాబాద్ నుంచి ఎదురుగా వస్తున్న […]
అబుదాబి: ఐపీఎల్13 సీజన్లో భాగంగా అబుదాబిలో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ లెవన్ పంజాబ్ కు ముంబై ఇండియన్స్192 పరుగుల టార్గెట్ ఇచ్చింది. చివరి ఓవర్లలో పొలార్డ్ హ్యాట్రిక్ సిక్స్‌లతో అద్భుతంగా బ్యాటింగ్చేశాడు. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేశారు. ముంబై కెప్టెన్ రోహిత్‌శర్మ 70(45 బంతుల్లో 8 ఫోర్లు, మూడు సిక్స్‌లు) పరుగులు చేశాడు. సూర్యాకుమార్ యాదవ్ 10, ఇషాన్‌కిషన్28(32 బంతుల్లో సిక్స్, ఒక ఫోర్), పొలార్డ్ 47(20 బంతుల్లో మూడు […]
సారథి న్యూస్, రామాయంపేట: గ్రామాల్లో జరిగే ఉత్సవాల్లో దున్నపోతులను అమ్మవారికి బలివ్వడం చట్టరిత్యా నేరమని నిజాంపేట వెటర్నరీ అధికారి సుధాకర్ దేశ్ ముఖ్ హెచ్చరించారు. గురువారం ఆయన మెదక్ జిల్లా మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని చల్మేడ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామాల్లో కరోనా విస్తరిస్తున్నదని ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చల్మెడ గ్రామంలో కరోనా మహమ్మారిని పోవాలంటే అమ్మవారికి దున్నపోతులు బలివ్వాలని గ్రామస్థులు నిర్ణయించారు. ఇందుకోసం ఒక్కో ఇంటికి రూ. 1000 వసులూ […]
సారథి న్యూస్, కర్నూలు: కోవిడ్ 19 కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని, ప్రస్తుతం వైరస్ తగ్గుముఖం పడుతున్న తరుణంలో దుకాణాలు నిర్వహించుకునే వేళలు పెంచేలా అవకాశం కల్పించాలని కర్నూలు నగర ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్‌ను రిటైల్ వ్యాపార దుకాణ యజమానులు కోరారు. గురువారం వైఎస్సార్సీపీ ఆఫీసులో ఎమ్మెల్యేను కలిసి తమ సమస్యలను విన్నవించారు. లాక్‌డౌన్ కారణంగా ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల వరకే దుకాణాలను తెరుచుకుని వ్యాపారాలు జరుపుకుంటున్నామని, దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని […]
సారథి న్యూస్, వాజేడు(ములుగు): ములుగు జిల్లాలోని వాజేడు మండలం చికుపల్లి అటవీ పాంత్రంలో ఉన్న బొగత జలపాతాన్ని వెంకటాపురం రేంజ్ ఆఫీసర్, వాజేడు ఎస్సై తిరుపతి రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. బొగత జలపాతానికి వచ్చే పర్యాటకులు అటవీ అధికారులు చెప్పిన జాగ్రత్తలు పాటించాలన్నారు. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించాలని, మాస్క్ తప్పనిసరి కట్టుకుని బొగత జలపాతం సందర్శనకు రావాలని సూచించారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. […]
సారథి న్యూస్, రామగుండం: ఉత్తరప్రదేశ్ హత్రాస్‌లో దళిత యువతిపై జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ ఆలిండియా లాయర్స్ యూనియన్ (ఏఐఎల్ యూ) ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం రామగుండం ప్రధాన చౌరస్తా వరకు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎల్ యూ రాష్ట్ర మహిళా విభాగం కన్వీనర్ సీహెచ్ శైలజ మాట్లాడుతూ.. స్వతంత్ర భారతదేశంలో అర్ధరాత్రి మహిళ ఒంటరిగా తిరిగినప్పుడే నిజమైన స్వతంత్రం వచ్చినట్లని బాపూజీ కలలుగన్నారని గుర్తుచేశారు. మహిళలు ఒంటరిగా తిరగలేకపోతున్నారని అన్నారు. యూపీలో యువతిపై […]
సారథి న్యూస్, కర్నూలు: దేశంలో దళిత మహిళలపై దాడులు, అత్యాచారాలు అధికమయ్యాయని, ఘటన జరిగిన వెంటనే దోషులను పట్టుకుని ఉరితీస్తే తప్పా మార్పు రాదని లీడర్స్ యూత్ సొసైటీ, దళిత ప్రజాసంఘాల నాయకులు అన్నారు. యూపీలో పదిరోజుల క్రితం ఓ దళిత యువతిని నాలుక కోసి, మెడ, నడుము విరిచి అతిదారుణంగా అత్యాచారానికి పాల్పడిన దుండగులను ఉరితీయాలని డిమాండ్ చేస్తూ గురువారం కర్నూలు నగరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన నగర ఎమ్మెల్యే […]