సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్..హెలికాప్టర్ ప్రమాదానికి కారణమిదే.. సాంకేతిక కారణాలు ఏమీ లేవు దుర్ఘటనపై త్రివిధ దళాల బృందం దర్యాప్తు న్యూఢిల్లీ: గత డిసెంబర్ 8న చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ ప్రయాణించిన హెలికాప్టర్ కిందికి దిగుతున్న సమయంలో కమ్ముకున్న మేఘాల వల్లే ప్రమాదం జరిగిందని త్రివిధ దళాల దర్యాప్తు బృందం వెల్లడించింది. బుధవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తో భారత వాయుసేనకు చెందిన ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ […]
ఆ పొలంలోకి రామంటున్న కూలీలు కూలీలు రాకపోవడంతో రైతుల్లో ఆందోళన విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవట్లేదని స్థానిక రైతుల ఆరోపన సామాజిక సారథి, కౌడిపల్లి: పంట పొలంలో విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా మారాయని వాటిని సరిచేయాలని పలుమార్లు సంబంధిత విద్యుత్ సిబ్బందికి చెప్పినా పట్టించుకున్న పాపానపోలేదని స్థానిక రైతులు వాపోతున్నారు. కౌడిపల్లి సమీపంలోని ఇండియన్ పెట్రోల్ బంక్ వెనకాల ధర్మసాగర్ కట్ట వద్దనున్న 33/11 కెవి విద్యుత్ స్తంభాలు పంట పొలంలో వంగి ఉన్నాయని రైతులు […]
చివరగా తీసిన వీడియో పరిశీలను పంపిన అధికారులు చెన్నై: తమిళనాడు నీలగిరి జిల్లా కూనూర్ అటవీ ప్రాంతంలో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనపై దర్యాప్తు వేగవంతమైంది. ఈ నెల8న జరిగిన ఘటనలో తొలి సీడీఎస్ బిపిన్ రావత్ సహా మరో 13మంది మృతి చెందిన ఈ ఘటనకు సంబంధించిన వైరల్ గా మారిన వీడియో ఇప్పుడు కీలకంగా మారింది. కోయంబత్తూర్ కు చెందిన జో అనే వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్ డిసెంబర్ 8న స్నేహితుడు నాజర్ అతని కుటుంబసభ్యులతో […]
గంగానదిలో కలిపి కుమార్తెలు క్రితిక, తరిణి హరిద్వార్: హెలిక్యాప్టర్ ప్రమాదంలో మరణించిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ దంపతుల చితాభస్మాన్ని వారి కుమార్తెలు క్రితిక, తరిణి గంగానదిలో నిమజ్జనం చేశారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ పుణ్యక్షేత్రం వద్ద శ్రద్ధకర్మలు నిర్వహించి చితాభస్మాన్ని నదిలో కలిపారు. కుమార్తెలు ఇద్దరు కూడా తమ తల్లిదండ్రుల చితాభస్మాలు ఉంచిన పాత్రలను పూలతో నింపి విడివిడిగా నీళ్లలో జారవిడిచారు. జనరల్ బిపిన్ రావత్ దంపతులు తమిళనాడులోని కూనూరు వద్ద […]
సామాజిక సారథి, నార్కెట్ పల్లి: ముందు వెళుతున్న లారీని డీసీఎం ఢీకొట్టడంతో, క్యాబిన్లో ఇరుక్కుని ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతిచెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నార్కట్ పల్లిలో సోమవారం రాత్రి జరిగింది. నెల్లూరు జిల్లా లక్ష్మీపురం గ్రామానికి చెందిన చుండి హర్షవర్ధన్ రెడ్డి(30) సూర్యాపేట నుంచి హైదరాబాద్ కు డీసీఎంలో ప్రయాణిస్తున్నాడు. నార్కెట్ పల్లి గ్రామ శివారులోని నల్లగొండ ఫ్లై ఓవర్ దగ్గరకు రాగానే అతివేగం, డ్రైవర్ అజాగ్రత్తతో ముందు వెళుతున్న లారీని ఢీకొట్టింది. […]
సారథి, రామాయంపేట: కేరళ నుంచి మధ్యప్రదేశ్ కు 10 మంది వలస కూలీలతో వెళ్తున్న బోలెరో వాహనం నేషనల్ హైవే నం.44పై రామయంపేట స్థానిక పెద్దమ్మ టెంపుల్ వద్ద టైర్ పంచర్ కావడంతో బోల్తాకొట్టింది. అందులో ఉన్న ముగ్గురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. పలువురికి స్వల్పంగా గాయాలయ్యాయి. వీరిని చికిత్స కోసం రామాయంపేట గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. పోలీసులు కేసుదర్యాప్తు చేస్తున్నారు.
సారథి న్యూస్, హుస్నాబాద్: వేగంగా వస్తున్న లారీ ఢీకొని ఓ యువకుడు మృతిచెందిన ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో చోటుచేసుకున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా కొండసముద్రంకు చెందిన తాటిపర్తి చంద్రమౌళి(37) శనివారం హస్నాబాద్‌కు వచ్చాడు. కాగా పట్టణంలోని నాగారం వద్ద రోడ్డు దాటుతుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చంద్రమౌళి అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
మృతుల్లో ఇద్దరు మహిళలు ఒకరు రెండేళ్ల చిన్నారి.. సారథి న్యూస్, మెదక్: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. వీరిలో ఇద్దరు మహిళలు, ఒకరు రెండేళ్ల చిన్నారి ఉంది. బాలానగర్- మెదక్ నేషనల్ హైవే పై మెదక్ జిల్లా కొల్చారం మండలం కిష్టాపూర్ వద్ద గురువారం రాత్రి ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కొల్చారం మండలం అప్పాజిపల్లి గ్రామానికి చెందిన ఆటో మెదక్ నుంచి కొల్చారం వైపునకు వస్తుండగా హైదరాబాద్ నుంచి ఎదురుగా వస్తున్న […]