సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: కేంద్ర ప్రభుత్వం రెండోసారి అధికారంలోకచ్చిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు, వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్య ప్రజల జీవన, ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టారని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఏఐడిడబ్ల్యూఏ) రాష్ట్ర సహాయ కార్యదర్శి కందికొండ గీత అన్నారు. ఆదివారం కేంద్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటికైనా దిగివచ్చి రైతు […]
సారథి, మానవపాడు: 50 కాదు.. 100 కాదు.. 150 కేజీలకు పైగా ఉన్న బరువును ఈజీగా ఎత్తేశాడు ఈ కండరగండడు. జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన ఇమ్రాన్ మాసుం బాషా గుండ్లను ఎత్తే ప్రదర్శనలో ఎప్పటినుంచో పాల్గొంటున్నాడు. ఇటీవల బక్రీద్పండుగ సందర్భంగా కర్నూలు జిల్లా గుత్తి పెట్రోల్బంక్వద్ద సీఐటీయూ ఆటోడ్రైవర్ల యూనియన్ఆధ్వర్యంలో గుండ్లను ఎత్తే పోటీలో పాల్గొన్నాడు. 140, 160 కిలోల బరువైన గుండ్లను ఎత్తి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆటోడ్రైవర్లు మాసుం బాషాకు అభినందనలు తెలిపి సన్మానించారు. […]
సారథి, పెద్దశంకరంపేట: బతుకుదెరువు కోసం కర్నూలు జిల్లా డోన్నుంచి వచ్చిన ఓ వ్యక్తి గుండెపోటుతో మృతిచెందాడు. ఈ ఘటన మెదక్‌జిల్లా పెద్దశంకరంపేటలో బుధవారం జరిగింది. ఎస్సై నరేందర్ కథనం.. డోన్‌కు చెందిన దూదేకుల షేక్ షావలీ(45) పొట్టకూటి కోసం పెద్దశంకరంపేట్ వచ్చి తాపీమేస్త్రి పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఉదయం ఛాతీలో నొప్పి రావడంతో తోటికార్మికుడు జయరాములు ఆస్పత్రికి తీసుకువెళ్తున్న సమయంలో మెదక్ రోడ్డులో పక్కనే కుప్పకూలిపోయాడు.. సంగారెడ్డిలో ఉంటున్న అతని సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు […]
సారథి, కర్నూలు: ఎంతో మంది యువతను ఎస్సైలు, గ్రూప్స్ ఆఫీసర్లు, టీచర్లు, కానిస్టేబుళ్లుగా తీర్చిదిద్దిన ప్రముఖ ఇంగ్లిష్ ఫ్యాకల్టీ టీచర్ ఇలియాస్ కరోనాతో చనిపోయాడు. నాలుగు రోజుల క్రితం కొవిడ్ బారినపడ్డాడు. ప్రైవేట్ ఆస్పత్రిలో బెడ్ దొరక్కపోవడంతో చివరికి కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స కోసం చేరాడు. ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో కన్నుమూశాడు. కర్నూలుకు చెందిన ఇలియాస్ వృత్తి రీత్యా ప్రభుత్వ హైస్కూలులో ఇంగ్లిష్ టీచర్. తెలుగురాష్ట్రాల్లో ప్రధానంగా హైదరాబాద్, మహబూబ్ నగర్, కర్నూల్, నంధ్యాల, విజయవాడలో ప్రధాన […]
సారథి న్యూస్, మానవపాడు: తెలంగాణ సాంఘిక సంక్షేమశాఖ గురుకులాల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వంటి గొప్ప వ్యక్తి గురుకులాలకు సెక్రటరీగా ఉండడం ఈ ప్రాంత విద్యార్థుల అదృష్టమని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి తన వంతు కృషిచేస్తానని ఆయన అన్నారు. అలంపూర్ లో నిర్వహించిన స్వేరోస్ సంబరాల్లో గురువారం ఉదయం సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. ఆయన మొదట […]
సారథి న్యూస్, అలంపూర్: అలంపూర్ పట్టణంలో జనవరి 13,14 తేదీల్లో నిర్వహించబోయే స్వేరోస్ సంబరాలకు రావాలని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ను ఆహ్వానించినట్లు తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల అసిస్టెంట్ స్పోర్ట్స్ ఆఫీసర్ డాక్టర్ సోలపోగుల స్వాములు, సీనియర్ స్వేరో ఎంసీ కేశవరావు తెలిపారు. కార్యక్రమానికి సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ చేతులమీదుగా ఆవిష్కరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో స్వేరోస్ ఆర్.నాగరాజు, ఆర్.సునీల్, ఇతర నాయకులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): తుంగభద్ర పుష్కరాలకు కార్తీక శోభ సంతరించుకుంది. పవిత్ర సోమవారం కావడం, పుష్కరాలు 11వ రోజు కావడంతో పలు ఘాట్లకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు ఉమ్మడి మండల పరిధిలోని పుల్లూరు పుష్కర ఘాట్ కు తాకిడి పెరిగింది. ఇక్కడ వేలసంఖ్యలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా పరిధిలోని ఘాట్లలో నదీస్నానాలకు అనుమతి లేకపోవడంతో అలంపూర్ పుష్కర ఘాట్ కు భక్తులు పెద్దసంఖ్యలో వస్తున్నారు. కొందరు నదిలో […]
సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు జిల్లా దేవరగట్టులో కర్రల సమరానికి బ్రేక్ పడింది. ఈ ఏడాది దసరా రోజున జరగాల్సిన బన్నీ ఉత్సవంపై నిషేధం విధించారు. కరోనా నేపథ్యంలో ఈ ఉత్సవంపై నిషేధం విధించినట్లు పోలీసులు ప్రకటించారు. గీత దాటితే చర్యలు తప్పవని హెచ్చరించారు. దసరా వచ్చిందంటే ఎక్కడైనా దుర్గమ్మ పూజలు చేస్తారు. కానీ కర్నూలు జిల్లా దేవరగట్టులో కర్రలతో ఫైట్ చేస్తుంటారు. సంప్రదాయం పేరిట తలలు పగలగొట్టుకుంటారు. చేతులు విరగ్గొట్టుకుంటారు. కర్రల యుద్ధంలో ఎంతో మంది […]