సారథి న్యూస్, ఖమ్మం: తెలంగాణలో ఇటీవల మావోయిస్టుల కదలికలు కనిపిస్తుండటంతో పోలీస్‌శాఖ ఇప్పటికే అప్రమత్తమైంది. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ముగ్గురు యువతులు ఓకే రోజు అదృశ్యమయ్యారు. అయితే వీరికి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయా? వీరు అడవి బాటపట్టారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. అశ్వారావుపేట మండలం చెన్నాపురం కాలనీకి(గొత్తికోయ కాలనీ) చెందిన ముగ్గురు యువతులు ఈ నెల 16వ నుంచి కనిపించకుండా పోయారు. అందులో ఓ యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుమేరకు పోలీసులు […]
సారథి న్యూస్, రామడుగు: రాష్ట్రాలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెత్తనం చెలాయిస్తున్నది ఈ పద్ధతి సరికాదని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ రాజమల్లయ్య మండిపడ్డారు. శనివారం ఆయన కరీంనగర్ జిల్లా రామడుగులో విలేకరులతో మాట్లాడారు. దేశంలో ఓ వైపు కరోనా విలయతాండవం చేస్తుండగా.. మరోవైపు చైనా దురాక్రమణ పాల్పడుతున్నదని ఇటువంటి సమస్యలపై కేంద్రప్రభుత్వం దృష్టిపెట్టకుండా రాష్ట్రాల హక్కులను హరించేందుకు కుట్రలు పన్నుతోందని ఆయన ఆరోపించారు.
సారథిన్యూస్, హైదరాబాద్: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కార్యాలయంలో కరోనా కేసులు రావడం ఆందోళన కలిగిస్తున్నది. ఈటలకు చెందిన 7 గురు వ్యక్తిగత సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో మంత్రి ఈటల కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నట్టు సమాచారం. మంత్రికి చెందిన ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు పీఏలు, ముగ్గురు గన్‌మెన్లకు ప్రస్తుతం కరోనా సోకింది. వారంతా హోమ్ ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. దీంతో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు […]
సారథిన్యూస్, గద్వాల: ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇప్పటికే పలుచోట్ల రైతుల పంటలు నీటమునిగాయి. వరద ధాటికి రాకపోకలు ఆగిపోయి పలువురు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం బొంకూర్ పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. వాగు దాటికి రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు ,ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పోలీసు అధికారులు వాగుల వద్ద పర్యవేక్షిస్తున్నారు.
సారథిన్యూస్, హైదరాబాద్: మనం చాలామంది దొంగల గురించి విని వుంటాం.. చైన్‌స్నాచర్లు, పగటిపూట దొంగలు, రాత్రిపూట దొంగలు, సీజనల్ దొంగలు ఇలా రకరకాల దొంగలు ఉంటారు. కానీ ఇటీవల సైబరాబాద్ పోలీసులకు పట్టుబడ్డది మాత్రం హైటెక్ దొంగ. ఇతగాడు కేవలం ఫ్లైట్‌లోనే ప్రయాణాలు సాగిస్తుంటాడు. నేరుగా స్పాట్‌కు చేరుకుంటాడు. అనంతరం పనిపూర్తిచేసుకొని తిరిగి వెళ్లిపోతుంటాడు. ఈ హైటెక్ దొంగ గురించి సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన గంగాధర్ నొయిడాలో స్థిరపడ్డాడు. అక్కడ ఓ […]
ఢిల్లీ: గత కొంతకాలంగా సొంతపార్టీపై నిప్పులు చెరుగుతున్న వైఎస్సాఆర్ కాంగ్రెస్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు మరోసారి సంచల వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. అమరావతి భూములపై సీబీఐ ఎంక్వైరీ చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు ధర్నాలు చేశారు. కానీ అంతర్వేది ఘటనపై ఎందుకు మాట్లాడటం లేదు అని ప్రశ్నించారు? న్యాయవ్యవస్థనే తూలనాడేలా ధర్నాలు చేయడం సిగ్గుచేటని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని మార్చే హక్కు శాసనసభకు లేదన్న కనీస అవగాహన లేకుండా విజయసాయిరెడ్డికి […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో శనివారం(24 గంటల్లో) కొత్తగా 2,751 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇలా రాష్ట్రంలో ఇప్పటివరకు 1,20,116 కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారినపడి తాజాగా 9 మంది మృతిచెందారు. ఇప్పటివరకు కరోనా మృతుల సంఖ్య 808కు చేరింది. తాజాగా 1,675 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు మొత్తంగా 89,350 మంది కోలుకుని ఇంటికి చేరారు. దేశవ్యాప్తంగా కరోనా రికవరీ రేటు 76.49 శాతంగా నమోదైంది. తెలంగాణలో రికవరీ రేటు […]
సారథిన్యూస్, సత్తుపల్లి: ప్రజలంతా మట్టిగణపతినే పూజించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విమర్శించారు. శుక్రవారం ఆయన మాధురి మెడికల్స్ ఆధ్వర్యంలో ప్రజలకు మట్టిగణపతి ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రకృతిని కాపాడుకోవడం మానవ ధర్మం, పర్యావరణ పరిరక్షణకు గాను ప్రతి ఒక్కరూ మట్టి గణపతి విగ్రహాలను పూజించాలన్నారు.