Breaking News

Day: August 22, 2020

సాల్వెంట్‌ పరిశ్రమలో అగ్నిప్రమాదం

సాల్వెంట్‌ పరిశ్రమలో అగ్నిప్రమాదం

గుమ్మడిదల: సంగారెడ్డి జిల్లాలో శనివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గుమ్మడిదల మండలం దోమడుగులోని సాల్వెంట్‌ రసాయన పరిశ్రమలో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. జీడిమెట్ల, అన్నారం ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ నుంచి అగ్నిమాపక యంత్రాలను రప్పించారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

Read More
వెహికిల్​ ఓనర్‌షిప్‌పై కచ్చితమైన విధానం

వెహికిల్​ ఓనర్‌షిప్‌పై కచ్చితమైన విధానం

హైదరాబాద్: ప్రస్తుతం ఉన్న వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మార్పులు తెచ్చే విషయంపై కేంద్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ఇందుకు సంబంధించి తాజా సమాచారం ప్రకారం వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా ఫారం-20 నిబంధనల్లో సవరణలు చేయడం ద్వారా ఓనర్‌షిప్‌నకు సంబంధించి కచ్చితమైన విధానం అమల్లోకి తీసుకురావాలని యోచిస్తోంది. సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ 1989లోని ఫారం-20లో చేయాల్సిన మార్పులు, చేర్పులపై సలహాలు సూచనలు అందజేయాలని సంబంధిత శాఖలను కోరుతూ ఆగస్టు 18న నోటిఫికేషన్ కూడా విడుదల చేసినట్లు […]

Read More
మీరైనా జోక్యం చేసుకోండి

మీరైనా జోక్యం చేసుకోండి

పాలనలో తప్పులు ఎత్తిచూపే వారిని వేధిస్తున్నారు పవర్​హౌస్ ​ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలి గవర్నర్‌ తమిళిసై సౌందర్​రాజన్​కు రేవంత్ రెడ్డి లేఖ హైదరాబాద్: రాష్ట్రంలో సీఎం కేసీఆర్​ ప్రభుత్వం రాజ్యాంగ, ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తోందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి గవర్నర్ తమిళిసై సౌందర్​రాజన్ కు శనివారం లేఖ రాశారు. ప్రభుత్వం పట్ల విశ్వాసాన్ని కోల్పోయిన ప్రజలకు గవర్నర్ హోదాలో మీరు ఇటీవల స్పందించిన తీరు కొంత ఊరట కలిగించిందన్నారు. లేఖలోని ముఖ్యాంశాలు.. ‘రాష్ట్రంలో రాజ్యాంగ, పౌర, […]

Read More
వినాయక చవితిని ఇంట్లోనే జరుపుకోండి

వినాయక చవితిని ఇంట్లోనే జరుపుకోండి

సారథి న్యూస్, కర్నూలు: వినాయక చవితి పర్వదినం సందర్భంగా జిల్లా ప్రజలకు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుమ్మనూరు జయరాం, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్ జి.వీరపాండియన్, ఎస్పీ డాక్టర్ ​కె.ఫక్కీరప్ప, జేసీలు రవి పట్టన్ షెట్టి, రామసుందర్ రెడ్డి, సయ్యద్ ఖాజా మొహిద్దీన్, కర్నూలు మున్సిపల్ కమిషనర్ డీకే బాలాజీ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. కోవిడ్​19 నిబంధనలను అనుసరించి జిల్లా ప్రజలంతా ప్రకృతిని, సంస్కృతిని, పర్యావరణాన్ని సమతుల్యం చేస్తూ మట్టి గణపతులను ఇంట్లోనే పెట్టుకుని సంతోషంగా పండుగ […]

Read More
పేలిన కరెంట్​ట్రాన్స్​ఫార్మర్​

పేలిన కరెంట్ ​ట్రాన్స్​ఫార్మర్​

సారథి న్యూస్, అచ్చంపేట: నాగర్​కర్నూల్ ​జిల్లా లింగాల మండలం క్యాంప్ రాయవరంలో శనివారం సాయంత్రం 7 గంటల సమయంలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ పేలి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో స్థానికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఏం జరుగుతుందో తెలియక హతాశులయ్యారు.

Read More
ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్​సూసైడ్​

ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్ ​సూసైడ్​

శ్రీన‌గ‌ర్‌: జ‌మ్ముక‌శ్మీర్‌లో ఓ ఎయిర్​ఫోర్స్​ ఆఫీసర్​ సూసైడ్​ చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్​కు చెందిన ఇంద‌ర్‌పాల్ సింగ్(53)వైమానిక ద‌ళంలో వారెంట్ ఆఫీస‌ర్​గా పనిచేస్తున్నాడు. త‌న స‌ర్వీస్ పిస్టల్​తో త‌ల‌పై కాల్చుకున్నాడు. వెంట‌నే స‌హ‌చ‌రులు ఆయ‌న‌ను ఆస్పత్రికి తరలించారు. కొద్దిసేపటికే చనిపోయాడని డాక్టర్లు ధ్రువీకరించారు. పోస్టుమార్టం పూర్తయిన వెంట‌నే ఇంద‌ర్‌పాల్ భౌతిక కాయాన్ని కుటుంబ‌స‌భ్యుల‌కు అప్పగించినట్లు తెలిపారు. కాగా, ఈనెల జ‌మ్ము రీజియ‌న్‌లో సూసైడ్​ చేసుకున్న రెండో వైమానికద‌ళ ఉద్యోగి ఇంద‌ర్‌పాల్. ఆగ‌స్టు 8న కూడా ఉదంపూర్‌లో వైమానిక ద‌ళానికి చెందిన […]

Read More

బాలిక ఆత్మహత్య

సారథి న్యూస్, రామగుండం: బాలిక ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పోలీస్​స్టేషన్​ పరిధిలోని కృష్ణానగర్​లో శనివారం చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Read More
ఏపీలో 10,276 కరోనా కేసులు

ఏపీలో 10,276 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్​లో శనివారం కొత్తగా 10,276 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. వ్యాధిబారినపడి ఒకేరోజు 97 మంది మృతిచెందారు. మహమ్మారితో ఇప్పటివరకు 3,189 మంది కన్నుమూశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ ​కేసుల సంఖ్య 3,45,216కు చేరింది. గత 24 గంటల్లో కోలుకుని 8,593 మంది డిశ్చార్జ్‌ కాగా, ఇప్పటివరకు 2,52,638 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. 24 గంటల్లో 61,469 మందికి పరీక్షలు చేయగా, ఇప్పటివరకు 31,91,326 మందికి కరోనా టెస్టులు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో […]

Read More