Breaking News

CHANDRABABU

2047 నాటికి భారత్‌ నంబర్‌ వన్‌

– ప్రపంచం నలుమూలలా భారత్‌ టెక్కీలు– జీఎఫ్‌ఎస్‌టీ సదస్సులో చంద్రబాబు సామాజికసారథి, హైదరాబాద్‌: ప్రపంచ దేశాల్లో 2047 నాటికి ఇండియన్స్‌ నెంబర్‌వన్‌గా ఉంటారని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్‌లో డీప్‌ టెక్నాలజీస్‌ అంశంపై జీఎఫ్‌ఎస్‌టీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జీఎఫ్‌ఎస్‌టీ చైర్మన్‌ హోదాలో చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెక్నాలజీని అందిపుచ్చుకుంటే అన్నీ సాధ్యమేనని చెప్పారు. ఐటీతో ప్రపంచమంతా భారతీయులు విస్తరించారని తెలిపారు. 2047 నాటికి భారత్‌ […]

Read More
జగన్‌ అవినీతిపై ధర్మపోరాటం

జగన్‌ అవినీతిపై ధర్మపోరాటం

టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం ఆస్పత్రిలో ఆక్సిజన్‌ ప్లాంట్‌ ప్రారంభం చిత్తూరు: కుప్పం నియోజకవర్గంలో మూడు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం ప్రభుత్వ హాస్పిటల్‌లో ఆక్సిజన్‌ ప్లాంట్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు ప్రారంభించారు. ఇటీవల కాలంలో కరోనాతో బాధపడుతున్నవారు ఆక్సిజన్‌ లేక తీవ్ర ఇబ్బందులు పడిన నేపథ్యంలో కుప్పం నియోజకవర్గానికి ఆక్సిజన్‌ కొరత ఉండకూడదని భవిష్యత్‌ కార్యాచరణతో ఈ ప్లాంట్‌ ను ప్రారంభించినట్లు తెలిపారు. పలమనేరు మాజీ ఎమ్మెల్యే అమర్​నాథ్​రెడ్డి, కుప్పం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో […]

Read More
ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి

ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి

సారథి, రామడుగు: మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వాలని టీడీపీ రామడుగు మండలాధ్యక్షుడు అమిరిశెట్టి సుధాకర్ ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. ఎన్టీఆర్ 98వ జయంతి వేడుకలను టీడీపీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లుగా భావించి కూడు, గూడు గుడ్డ అనే నినాదంతో తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో టీడీపీని స్థాపించారని గుర్తుచేశారు. మద్యపాన నిషేధం, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, జనతావస్త్రాలు, పటేల్ పట్వారీ […]

Read More
తిరుపతిలో గురుమూర్తి ఘనవిజయం

తిరుపతిలో గురుమూర్తి ఘనవిజయం

ఫ్యాన్​గాలికి కొట్టుకుపోయిన విపక్షాలు మిన్నంటిన వైఎస్సార్​సీపీ సంబరాలు తిరుపతి: తిరుపతి పార్లమెంట్​ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో వైఎస్సార్​ కాంగ్రెస్ ​పార్టీ అభ్యర్థి గురుమూర్తి 2,31,943 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. మొదటి రౌండ్ నుంచీ ఆయన ఆధిక్యం కనబరిచారు. వైఎస్సార్​ సీపీకి 5,37,152 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మీకి 3,05,209 ఓట్లు వచ్చాయి. ఇక జనసేనతో కలిసి ఎన్నికల బరిలో దిగిన బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు 50,739, కాంగ్రెస్​ అభ్యర్థి చింతా మోహన్​ […]

Read More
చంద్రబాబు కాన్వాయ్​లో సాంకేతికలోపం

చంద్రబాబు కాన్వాయ్​లో సాంకేతికలోపం

సారథి న్యూస్, నల్లగొండ: టీడీపీ అధినేత, మాజీ సీఎం ఎన్​.చంద్రబాబు నాయుడు ప్రయాణిస్తున్న కాన్వాయ్ సాంకేతిక లోపం కారణంగా శుక్రవారం సాయంత్రం నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి కామినేని ఆస్పత్రి వద్ద నిలిచిపోయింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపునకు చంద్రబాబు వెళ్తున్నారు. ఇంతలో వాహనం నిలిచిపోయింది. అప్రమత్తమైన సిబ్బంది మరో వాహనశ్రేణిలో ఆయనను హైదరాబాద్​కు తీసుకెళ్లారు.

Read More

చంద్రబాబుకు బిగ్​షాక్​.. గల్లా రాజీనామా!

సారథిన్యూస్​, అమరావతి: సీనియర్​ రాజకీయనేతను అని చెప్పుకొనే చంద్రబాబుకు ఈ మధ్య షాక్​ల మీద షాక్​లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేయగా తాజాగా టీడీపీ పొలిట్​బ్యూరో సభ్యురాలు గల్లా అరుణకుమారి తన పదవికి రాజీనామా చేశారు. త్వరలోనే పార్టీకి కూడా గుడ్​బై చెప్పనున్నట్టు సమాచారం. అరుణకుమారి సుధీర్ఘకాలంపాటు కాంగ్రెస్‌ హయాంలో మంత్రిగా పనిచేశారు. విభజన అనంతరం ఆమె టీడీపీలో చేరారు. ఆమె తనయుడు గల్లా జయదేవ్​ ప్రస్తుతం గుంటూరు ఎంపీగా కొనసాగుతున్నారు. అంతకుముందు […]

Read More

వ్యవసాయ బిల్లు.. రైతులకు గుదిబండ

సారథి న్యూస్ శ్రీకాకుళం: కేంద్రం ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయబిల్లు పేద రైతులకు గుదిబండ లాంటిదని.. కార్పొరేట్లకు మేలు చేకూర్చేందుకు కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చిందని సీపీఐ నేతలు ఆరోపించారు. మంగళవారం కేంద్ర బిల్లులకు వ్యతిరేకంగా శ్రీకాకుళంలో సీపీఐ శ్రేణులు ఆందోళకు దిగాయి. ఈ దీక్షలో సీపీఐ నేతలు బుడితి అప్పలనాయుడు, మన్మధరావు, ద్వారపూడి అప్పలనాయుడు, కూరంగి గోపినాయుడు సీతమ్మ ఆరిక హరిబాబు‌,టొంపల ఆదినారొయణ,ఊయక వెంకట రావు తదితరులు పాల్గొన్నారు.

Read More

‘జలకళ’ పేదరైతులకు వరం

సారథిన్యూస్​, శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం తీసుకొచ్చిన జలకళ పథకం పేదరైతులకు వరం లాంటిదని సీఎం వైస్​ జగన్మోహన్​రెడ్డి పేర్కొన్నారు. ఈ పథకంలో భాగంగా రాష్ట్రంలో 2 లక్షల వ్యవసాయ బోర్లు వేస్తున్నట్టు చెప్పారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వచ్చే నాలుగు సంవత్సరాలలో రూ.2,340 కోట్లతో 2 లక్షల బోర్లు ఉచితంగా వేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. ఈ పథకం కోసం […]

Read More