సామాజిక సారథి,కడ్తాల్: కడ్తాల్ మండలం రావిచెడులో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ప్రారంభించినట్లు గ్రామీణాభివృద్ధి స్టాండింగ్ కమిటీ జిల్లా సభ్యులు కడ్తాల్ జడ్పీటీసీ జర్పుల దశరథ్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యకర్తలు ముందుండాలని చెప్పారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కంబాలపల్లి పరమేశ్, ఉమ్మడి ఆమనగల్లు పీఎసీఎస్ చైర్మన్ గంప వెంకటేష్, జిల్లా రైతు సమన్వయ సమితి కమిటీ […]
సామాజిక సారథి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో బుధవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జీహెచ్ఎంసీ కార్యాలయంలోని మూడవ అంతస్తులో టాక్స్ సెక్షన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కార్యాలయమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. భారీగా మంటలు చెలరేగడంతో ఆందోళనకు గురైన ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. మంటల్లో కార్యాలయంలోని పలు ఫైల్స్దగ్ధమయ్యాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో లిప్ట్ నిలిచి పోవడంతో అందులో ఉన్నవారు ఆర్తనాదాలు చేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది […]
సారథిన్యూస్, హైదరాబాద్: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కార్యాలయంలో కరోనా కేసులు రావడం ఆందోళన కలిగిస్తున్నది. ఈటలకు చెందిన 7 గురు వ్యక్తిగత సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో మంత్రి ఈటల కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నట్టు సమాచారం. మంత్రికి చెందిన ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు పీఏలు, ముగ్గురు గన్మెన్లకు ప్రస్తుతం కరోనా సోకింది. వారంతా హోమ్ ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. దీంతో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు […]
గుజరాత్ : గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఖాదర్ షేక్ కరోనా వైరస్ సోకి ప్రయివేట్ హాస్పిటల్లో చేరాడు. 20 రోజుల పాటు ప్రయివేట్ హాస్పిటల్లో చికిత్స చేయించుకున్న తర్వాత వారు వేసిన బిల్లు చూసి బిత్తర పోయాడు. ఇలా అయితే పేద ప్రజలు ఎలా వైద్యం చేయించుకుంటారా అనే ప్రశ్న అతన్ని తొలచింది. దీంతో తన ఆఫీసునే హాస్పిటల్‌గా మార్చేశాడు. 85 బెడ్లను ఏర్పాటు చేశాడు. స్థానిక అధికారుల నుండి అనుమతి తీసుకున్నాడు. వైద్య సిబ్బంది, యంత్రాలు, […]
సారథిన్యూస్, ఖమ్మం: ఖమ్మం జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఇంచార్జిగా ఆర్జేసీ కృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం నియామక ఉత్తర్వులను విడుదల చేశారు. ఈ సందర్భంగా కృష్ణను మంత్రులు కేటీఆర్, అజయ్ అభినందించారు. తక్షణమే బాధ్యతలు చేపట్టాలని ఆదేశించారు.