సామాజికసారథి, రంగారెడ్డి: ఇటీవల దారుణహత్యకు గురైన రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం గోవిందాయిపల్లి గ్రామానికి చెందిన శేషిగారి శివగౌడ్(24), గుండెమోని శివగౌడ్(29) కుటుంబసభ్యులను BRS నేత డా.ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆదివారం పరామర్శించారు. ఆయనను చూడగానే ఆ యువకుల తల్లిదండ్రులు ఘొల్లున ఏడ్చారు. వారిని ఆర్ఎస్పీ ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాట్సాప్ గ్రూపులో ఫొటోలను డిలిట్ చేశారని ఇద్దరు యువకులను కిరాతకంగా చంపడం దారుణమన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. కడ్తాల, తలకొండపల్లి, వెల్దండ, కల్వకుర్తి ప్రాంతాల్లో […]
సామాజికసారథి, అలంపూర్: నాగర్ కర్నూల్ ఎంపీగా డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు మించిన ఎంపీ అభ్యర్థి కాంగ్రెస్, బీజేపీలో ఎవరూ లేరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవిని గెలిపిస్తే రేవంత్ రెడ్డికి ఇచ్చిన డబ్బు సంచులు ఢిల్లీలో పంచడానికి పనికొస్తాడని విమర్శించారు. ప్రవీణ్ కుమార్ ను గెలిపిస్తే పేదల కష్టాలు తీర్చడానికి పార్లమెంట్ లో ప్రజల గొంతుక అవుతారని అన్నారు. మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ […]
సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: ఎస్సీ వర్గీకరణపై నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. ఎస్సీలను కాంగ్రెస్, బీజేపీలు మోసం చేశాయని విమర్శించారు. శనివారం ఆయన నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లిలో మీడియాతో మాట్లాడారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే పదేళ్లలో ప్రధాని నరేంద్రమోడీ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కనీసం ఒక ఆర్డినెన్స్ ను కూడా తీసుకురాలేకపోయారని అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ చేశారా? ప్రజలకు చెప్పాలని […]
ఆగస్టు 8న పార్టీ కోఆర్డినేటర్ రాంజీగౌతమ్ సమక్షంలో బీఎస్పీలో చేరిక నల్లగొండ ఎన్ జీ కాలేజీ గ్రౌండ్లో భారీ బహిరంగ సభకు శ్రీకారం సారథి, హైదరాబాద్: గురుకుల విద్యాలయాల సంస్థ పూర్వ కార్యదర్శి, ఇటీవలే వీఆర్ఎస్తీసుకున్న ఐపీఎస్ఆఫీసర్డాక్టర్ఆర్ఎస్ప్రవీణ్కుమార్బహుజన సమాజ్‌పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. తన అభిమానులు, అనుచరులతో కలిసి పెద్దసంఖ్యలో పార్టీ కోఆర్డినేటర్ రాంజీగౌతమ్సమక్షంలో ఆగస్టు 8న బీఎస్పీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అందుకోసం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కాలేజీ మైదానంలో ఐదులక్షల మందితో భారీ […]
సారథి, హైదరాబాద్: డిగ్రీలో ప్రవేశానికి నిర్వహించే తెలంగాణ గురుకులం అండర్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీజీయూజీసెట్-2021) జులై 11న జరగనుంది. 2021-22 విద్యాసంవత్సరానికి గాను తెలంగాణ సోషల్ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల్లో బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ కోర్సుల్లో మొదటి ఏడాది ప్రవేశానికి జులై 11న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు టీజీయూజీసెట్ కన్వీనర్ డాక్టర్ఆర్ఎస్ ప్రవీణ్కుమార్రాష్ట్రంలోని ఆయా కేంద్రాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష […]
కండ కావరాన్ని ఆత్మగౌరవంతో ఓడించాలె ఎన్నో అడ్డంకులు వచ్చినా జ్ఞానమార్గాన్ని వీడొద్దు గురుకులాల సెక్రటరీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అలరించిన ఆరో స్వేరో స్వర సునామీ వేడుక సారథి, హైదరాబాద్: పాటలకు చావులేదని, పాటలు జీవితాలను, సమూహాలను మారుస్తాయని, సమాజంలో మార్పులు తీసుకొస్తాయని, చరిత్ర గతినే మారుస్తాయని స్వేరోస్ఆర్గనైజేషన్ఫౌండర్, గురుకులాల సెక్రటరీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అభివర్ణించారు. పాటలు ప్రపంచానే మారుస్తాయని, స్వాతంత్ర్యాన్ని తీసుకొస్తాయని గుర్తుచేశారు. పాటలే అధికారాన్ని కూడా తీసుకొస్తాయని పునరుద్ఘాటించారు. ఇందుకు ‘వందేమాతరం’, ‘బండెనుక […]
సారథి న్యూస్, కొల్లాపూర్: ఈనెల 28న కొల్లాపూర్‌లో జరిగే స్వేరోస్ జ్ఞానయుద్ధ భేరి సభను జయప్రదం చేయాలని స్వేరోస్ సీనియర్ రిసోర్స్ పర్సన్ డాక్టర్ సోలపోగుల స్వాములు కోరారు. సోమవారం ఆయన కొల్లాపూర్ మండలంలోని ఎన్మన్ బెట్ల, జవాయిపల్లి, సింగోటం కొండ్రావుపల్లి, కల్వకోల్, కుడికిళ్ల గ్రామాల్లో పర్యటించి యువకులు, విద్యార్థులకు జ్ఞాన యుద్ధభేరి సభ ఆవశ్యకత, ప్రాముఖ్యత, ఉద్దేశ్యాన్ని వివరించారు. అనంతరం వారిచేత పోస్టర్లు, కరపత్రాలు, స్టిక్కర్లను విడుదల చేయించారు. అంతకుముందు కొల్లాపూర్ సీఐ వెంకట్ రెడ్డి, […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ గిరిజన గురుకుల జూనియర్ కాలేజీల్లో ప్రవేశపరీక్ష (టీటీడబ్ల్యూఆర్‌జేసీ) ఫలితాల సొసైటీ కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విడుదల చేశారు. రిజల్ట్‌ను TGGURKULAM లో చూసుకోవచ్చని తెలిపారు. విద్యార్థులకు ఎస్‌ఎంఎస్ ద్వారా ఫలితాలు పంపిస్తామని చెప్పారు. ప్రవేశ ప్రక్రియ తేదీలు త్వరలోనే ప్రటిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని మొత్తం 73 గిరిజన గురుకుల జూనియర్ కాలేజీల్లో 7,040 సీట్లు ఉండగా.. వీటిలో ప్రవేశాలకు మార్చి 8న నిర్వహించిన పరీక్షకు 10,052 మంది విద్యార్థులు హాజరయ్యారు.