బద్వేలు: కడప జిల్లా బద్వేలు ఉపఎన్నికలో వైఎస్సార్ సీపీ ఘనవిజయం సాధించింది. మంగళవారం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలి రౌండ్ నుంచి స్పష్టమైన ఆధిక్యం కనబరిచిన వైఎస్సార్సీపీ అభ్యర్థి దాసరి సుధ విజయాన్ని విజయబావుటా ఎగరవేశారు. 90,411 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మొత్తం 13 రౌండ్లు ముగిసే సరికి వైఎస్సార్సీపీకి 1,12,072, బీజేపీకి 21,661, కాంగ్రెస్‌కు 6,217, నోటాకు 3,636 ఓట్లు పోలయ్యాయి. వైఎస్సార్సీపీ హవా ముందు ఇతర పార్టీలు పోటీ ఇవ్వలేకపోయాయి.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, టీపీసీసీ అధికార ప్రతినిధి ఇందిరాశోభన్ సంచలనం నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ షర్మిల వెంట నడవనున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం ఆమె లోటస్‌పాండ్‌లో వైఎస్ షర్మిలను కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తాను పార్టీకి ఎంతో సేవ చేసినప్పటికీ తనకు సముచితస్థానం కల్పించలేదన్నారు. రాజన్న రాజ్యం కోసం తాను షర్మిల వెంట నడవాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్ణయాలు, పార్టీలో […]
సారథి న్యూస్, శ్రీకాకుళం: ఏపీ సీఎం డాక్టర్వైఎస్జగన్మోహన్రెడ్డి 56మంది కార్పొరేషన్ల చైర్మన్లు, 672 మంది డైరెక్టర్లను ప్రకటించిన శుభ సందర్భంగా ఇందులో మహిళలకు 50శాతం పైగా రిజర్వేషన్లు కల్పించడం మరో విశేషమని మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు, రాష్ట్రమంత్రి సీదిరి అప్పలరాజు, కేంద్రమాజీ మంత్రి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షురాలు డాక్టర్కిల్లి కృపారాణి కొనియాడారు. డాక్టర్వైఎస్రాజశేఖరరెడ్డి కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం ఏడు రోడ్ల కూడలిలో వైఎస్సార్విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కేవలం 16నెలల్లోనే వివిధ పథకాల ద్వారా […]
కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న రాయలసీమలో తీవ్ర అలజడి చెలరేగింది. కర్నూల్ జిల్లా నంద్యాలలో వైసీపీ నేత సుబ్బారాయుడు దారుణహత్యకు గురయ్యారు. ప్రస్తుతం నంద్యాలలో టెన్షన్ వాతావరణం నెలకొన్నది. శుక్రవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లిన సుబ్బారాయుడిపై గుర్తు తెలియని దుండగులు కర్రలతో వచక్షణారహితంగా దాడి చేశారు. నంద్యాలలోని విజయ పాల డెయిరీ సమీపంలో ఈ హత్య జరిగింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తున్నది. పాతకక్షలతోనే […]
సారథి న్యూస్, కర్నూలు: విద్యార్థుల భవిష్యత్‌కు భరోసా కల్పించడమే సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి లక్ష్యమని వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు రాజావిష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. గురువారం నగరంలోని 23వ వార్డు ఇన్‌చార్జ్ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో మున్సిపల్ హైస్కూలులో ‘జగనన్న విద్యాకానుక’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజావిష్ణువర్ధన్ రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి తెర్నెకల్ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఏపీలో 43 లక్ష మంది విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కింద రూ.650 కోట్లు విలువ […]
సారథి న్యూస్, కర్నూలు: రైతు సంక్షేమార్థం అహర్నిశలు కృషిచేసే సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆశయం నెరవేర్చాలని, యార్డులో రైతుకు మెరుగైన సేమ, సదుపాయాలు కల్పించాలని వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య నూతన కమిటీ సభ్యులకు సూచంచారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం నగర ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్ అధ్యక్షతన నూతన చైర్‌పర్సన్ రోకియాబీ, వైస్ చైర్మన్ రాఘవేంద్రారెడ్డి, డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం నిర్వహించారు. కార్యక్రమానికి పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ […]
ఎన్డీఏలో చేరాలని ఏపీ జగన్‌ను ప్రధాని మోదీ ఆహ్వానించారా? ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏలో భాగస్వాములుగా మారి వైఎస్సార్సీపీ కి చెందిన ఇందరు ఎంపీలకు మంత్రి పదవులు తీసుకోవాలని మోదీ ఒత్తిడి తెస్తున్నారా? అంటే ఢిల్లీ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తున్నది. సీఎం జగన్ ఢిల్లీ వెళ్లాక జాతీయ మీడియాలో పలు ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే ప్రత్యక్షంగా పరోక్షంగా బీజేపీకి మద్దతు ఇస్తున్న వైఎస్సార్సీపీ త్వరలోనే ఎన్డీఏలో చేరబోతున్నదంటూ వార్తలు వస్తున్నాయి. రెండు వారాల క్రితమే సీఎం […]
సారథి న్యూస్, కర్నూలు: నిబద్ధత, పట్టుదల, కృషి, సమయస్ఫూర్తి.. వంటివి మహాత్మగాంధీని దేశానికి జాతిపితగా చేశాయని, ప్రతిఒక్కరూ ఆయన బాటలో నడవాలని వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం గాంధీ జయంతిని పురస్కరించుకుని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాయంలో మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుర్పించారు. ముఖ్యఅతిథులుగా నగర ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా బీవై రామయ్య మాట్లాడుతూ.. […]