Breaking News

వైసీపీ నేత దారుణహత్య.. నంద్యాలలో టెన్షన్​.. టెన్షన్​

కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న రాయలసీమలో తీవ్ర అలజడి చెలరేగింది. కర్నూల్​ జిల్లా నంద్యాలలో వైసీపీ నేత సుబ్బారాయుడు దారుణహత్యకు గురయ్యారు. ప్రస్తుతం నంద్యాలలో టెన్షన్​ వాతావరణం నెలకొన్నది. శుక్రవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లిన సుబ్బారాయుడిపై గుర్తు తెలియని దుండగులు కర్రలతో వచక్షణారహితంగా దాడి చేశారు. నంద్యాలలోని విజయ పాల డెయిరీ సమీపంలో ఈ హత్య జరిగింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తున్నది. పాతకక్షలతోనే ఈ దాడి జరిగిందా? లేక ఇంకేమైనా ఇతర కారణాలు ఉన్నాయా అన్నది తెలియరాలేదు. సుబ్బారాయుడు పొన్నాపురం రేషన్ డీలర్‌గా పనిచేస్తున్నారు. న్యాయవాదిగానూ ప్రాక్టీస్ చేస్తున్నారు. సుబ్బారాయుడు హత్యను వెఎస్సార్​కాంగ్రెస్​ ఖండించింది. పోలీసులు నిందుతులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేస్తున్నది.