దేశంలో కరోనా టీకాలకు అయ్యే ఖర్చు కేంద్రాన్ని ప్రశ్నించిన సీరం ఇనిస్టిట్యూట్ సీఈవో న్యూఢిల్లీ : దేశంలో నానాటికీ విజృంభిస్తున్న కరోనాను అంతమొందించడానికి దేశీయంగా పలు ఫార్మా సంస్థలు వ్యాక్సిన్‌ను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా..? టీకా వచ్చినా అది ముందుగా ఎవరికి ఇవ్వాలి..? పంపిణీ ఎలా..? దానికోసమయ్యే ఖర్చు..? అనేదానిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీరం ఇనిస్టిట్యూట్ సీఈవో అదర్ పూనావల ఆసక్తికర వ్యాఖ్యలు […]
కర్నూలు జిల్లాలో భారీవర్షం నంద్యాల డివిజన్‌లో 93.88 మి.మీ. వర్షపాతం పొంగిన నదులు, వాగులు, వంకలు మునిగిన లోతట్టు ప్రాంతాలు, కాలనీలు ప్రజలను కాపాడిన అగ్నిమాపక సిబ్బంది సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు జిల్లాలో శనివారం భారీవర్షం కురిసింది. కుండపోత వాన కురవడంతో లోతట్టు, నది పరీవాహక ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహించాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం అర్ధరాత్రి వరకు వాన కురుస్తూనే ఉంది. జిల్లాలోని కుందూ, హంద్రీ, శ్యాంనదులు […]
మాకు నిర్ణయాధికారం ఇవ్వరా? ఐరాస వీడియోకాన్ఫరెన్స్‌లో ప్రధాని మోడీ న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారత్‌కు ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో నిర్ణయాధికారం నుంచి ఇంకెంతకాలం దూరంగా ఉంచుతారని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రశ్నించారు. ఐరాస సర్వప్రతినిధి సభ 75వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన వర్చువల్ సమావేశంలో పాల్గొన్న మోడీ ఈ సందర్భంగా ఐరాస అనుసరిస్తున్న వైఖరిపై అసంతృప్తి వ్యక్తంచేశారు. ఐరాసలో సంస్కరణలు చేయాలని భారత్ ఎంతోకాలంగా ఎదురుచూస్తోందని అన్నారు. అయితే అవి ఎప్పటికీ కార్యరూపం దాల్చుతాయోననీ, […]
సారథి న్యూస్, హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ఓటరు నమోదు ఇన్‌చార్జ్‌లతో టీఆర్ఎస్వర్కింగ్ప్రెసిడెంట్కె.తారక రామారావు శనివారం టెలీకాన్ఫరెన్స్‌నిర్వహించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నా ఓర్వలేనితనంతో ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని అన్నారు. ప్రతిపక్షాల చిల్లర ప్రయత్నాలను ఎండగట్టాలని సూచించారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు ఒక వ్యూహంతో పార్టీగా ముందుకు పోవాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అందులో భాగంగానే అర్హత ఉన్న ప్రతి గ్రాడ్యుయేట్ […]
సారథి న్యూస్, కర్నూలు: వచ్చే మూడు రోజుల వరకు భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని నంద్యాల ఏరియాలోని లోతట్టు ప్రాంత కాలనీవాసులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ సూచించారు. నంద్యాల వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. నంద్యాల డివిజన్ లో మహానంది, నంద్యాల టౌన్, రూరల్, బండి ఆత్మకూరు, మంత్రాలయం తదితర మండలాల్లో ఎక్కువ వర్షం కురవడంతో కుందూనది, శ్యాం కాల్వ తదితర వాగులన్నీ ఉధృతంగా ప్రవహించాయని అన్నారు. వరద ప్రాంతాల్లో […]
హయత్‌నగర్‌లో కార్యకర్తలతో భారీర్యాలీ ఆయన వెంటే పలువురు అనుచరులు సారథి న్యూస్, ఎల్బీ నగర్: హయత్‌నగర్ డివిజన్‌కు చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సింగిరెడ్డి మురళీధర్ రెడ్డి ఆ పార్టీని వీడారు. శనివారం ఆయన పెద్దసంఖ్యలో తన అనుచరులు, కార్యకర్తలతో కలిసి టీడీపీ హయత్ నగర్ డివిజన్ అధ్యక్షుడు దాసరమోని శ్రీనివాస్ ముదిరాజ్ సమక్షంలో నియోజకవర్గ ఇన్చార్జ్ ఎస్వీ క్రిష్ణప్రసాద్ ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. హయత్‌నగర్ డివిజన్ కేంద్రంలో టీడీపీ జెండాను ఎగరవేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు […]
ఎల్బీనగర్ నియోజకవర్గంలో పలు కాలనీలు జలమయం ఇబ్బందుల్లో పలు లోతట్టు కాలనీవాసులు సారథి న్యూస్, ఎల్బీనగర్: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్నగరంలో శుక్రవారం రాత్రి కురిసిన కుండపోత వానకు ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని చైతన్యపురి, కర్మన్‌ఘాట్, హస్తినాపురం, హయత్‌నగర్, నాగోల్, మన్సురాబాద్, బీఎన్‌రెడ్డి నగర్ డివిజన్లలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. హయత్ నగర్ లో రోడ్ల వరద నీటి ఉధృతికి కోతకు గురయ్యాయి. మట్టిరోడ్లన్నీ గుంతలమయంగా మారాయి. లోతట్టు కాలనీల్లోని ఇళ్లలోకి […]
సారథి న్యూస్, హైదరాబాద్: దసరా పండుగ రోజున ధరణి పోర్టల్ ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. విజయదశమి రోజు మంచి ముహూర్తంగా భావిస్తున్నందున అదేరోజు సీఎం స్వయంగా ధరణి పోర్టల్ ను అదేరోజు ప్రారంభించాలని భావిస్తున్నారు. అప్పటిలోగా అవసరమైన సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్, బ్యాండ్ ఏర్పాట్లు వంటి పనులను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. రిజిస్ట్రేషన్ విధానం, మోటివేషన్ చేయడం, ధరణి పోర్టల్ కు వివరాలను ఆప్ డేట్ చేయడం తదితర విధివిధానాలపై తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, సబ్ […]