Breaking News

DMHO

కరోనా టెస్టుల కోసం బారులు

కరోనా టెస్టుల కోసం బారులు

20 మందికి మాత్రమే నిర్ధారణ పరీక్షలు నిరాశతో వెనుదిరుగుతున్న జనం తాజాగా కొవిడ్​తో వృద్ధుడు మృతి, అవసరమైన వారే టెస్టులు చేయించుకోండి: డీఎంహెచ్​వో వెంకటేశ్వర్​ రావు సారథి, పెద్దశంకరంపేట: మెదక్​ జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రంలో ఓ వ్యక్తి(52) కరోనాతో బాధపడుతూ బుధవారం చనిపోయాడు. అతని పరిస్థితి విషమించడంతో స్థానిక ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రానికి ఆటోలో తీసుకొచ్చారు. ఆటోలోనే అతనికి వైద్యపరీక్షలు చేశారు. కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో మెదక్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. అక్కడికి చేరుకునేలోపే […]

Read More

సౌలతులు ఎట్లున్నయి?

సారథిన్యూస్, రామడుగు: కరీంనగర్​ జిల్లా రామడుగు మండలకేంద్రం, గండిగోపాల్​రావుపేట ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని మంగళవారం డిప్యూటీ డీఎంహెచ్​వో రవిసింగ్​ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్​సీలో సౌకర్యాలు ఏలా ఉన్నాయని రోగులను అడిగి తెలుసుకున్నారు. విధిగా టెస్టులు చేస్తున్నారా అని సిబ్బందిని ప్రశ్నించారు. ప్రతిరోజు 50 మందికి పరీక్షలు చేస్తున్నామని డాక్టర్​ శ్రీనివాస్, డాక్టర్​ రాధిక రవిసింగ్​కు తెలిపారు. కార్యక్రమంలో గోపాల్​రావు పేట ఎంపీటీసీ ఎడవెళ్లి కరుణశ్రీ, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.

Read More
డీఎంహెచ్ వో గా చందూ నాయక్

డీఎంహెచ్ వో గా చందూ నాయక్

సారథి న్యూస్​ : జోగులాంబ గద్వాల జిల్లా  డీఎంహెచ్​వో( జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి)గా డాక్టర్ చందూ నాయక్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో రంగారెడ్డిలో పని చేసిన ఈయన జిల్లా ఇంచార్జీ డీఎంహెచ్​వోగా రావడం జరిగింది.

Read More
లంచం తీసుకుంటూ దొరికిన పెద్దడాక్టర్​

అడ్డంగా దొరికిన పెద్ద డాక్టర్

సారథిన్యూస్​, గద్వాల: లంచం తీసుకుంటూ జోగుళాంబ గద్వాల జిల్లా డీఎంహెచ్​వో భీమ్​నాయక్​ ఏసీబీ అధికారులను రెడ్​హ్యాండెడ్​గా పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని వడ్డేపల్లి మండలంలో డాక్టర్​ ఏ మంజుల మెడికల్​ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె కాకతీయ యూనివర్సిటీలో పీజీలో జాయిన్​ అయ్యారు. ఇందుకోసం రిలీవింగ్​ ఆర్డర్​ కోసం డీఎంహెచ్​వోకు దరఖాస్తు చేసుకున్నారు. లంచాలకు అలవాటు పడ్డ డీఎంహెచ్​వో తన కిందిస్థాయి ఉద్యోగిని సైతం రూ. 7000 లంచం అడిగాడు. దీంతో మంజుల […]

Read More
నిజామాబాద్​డీఎంహెచ్​వో రాజీనామా

నిజామాబాద్ జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజీనామా

సారథి న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ ​నాగేశ్వర్ రావు సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. వైద్యాశాఖ ఉన్నతాధికారులకు తన రాజీనామా లెటర్​ను పంపించారు. అయితే ఇటీవల జిల్లాకేంద్రంలో కరోనాతో మృతిచెందిన ఓ పేషెంట్​ను ఎలాంటి భద్రతాచర్యలు పాటించకుండా ఆటోలో తీసుకెళ్లారు. పీపీఈ కిట్లు మాత్రమే ధరించిన సిబ్బంది మాత్రమే అంబులెన్స్​లో తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే జిల్లా ఆస్పత్రిలో సకాలంలో సరైన వైద్యం అందక నలుగురు రోగులు మృతిచెందారు. ఈ వరుస ఘటనలపై పై […]

Read More

కరోనా వచ్చిందంటూ దుష్ప్రచారం

సారథిన్యూస్​, ఖమ్మం: కరోనా వచ్చిందంటూ తనపై సాక్షాత్తూ ఖమ్మం డీఎమ్​హెచ్​వో డాక్టర్​ మాలతి దుష్ప్రచారం చేశారని జిల్లాకు చెందిన డాక్టర్​ శంకర్​నాయక్​ జిల్లా కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు. డీఎమ్​హెచ్​వోపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. తనకు కరోనా నెగిటివ్ వచ్చినప్పటికీ కావాలని తనకు పాజిటివ్​ వచ్చందంటూ రిపోర్టులు మార్చి కొందరు తప్పుడు సమాచారాన్ని వైరల్​ చేశారని మండిపడ్డారు. తన కరోనా నెగెటివ్​ వచ్చన రిపోర్టులను శంకర్​నాయక్​ కలెక్టర్ కు చూపించారు. డీఎంఅండ్​హెచ్​వో పనితీరు సక్రమంగా లేదని ఆమె […]

Read More

జర్నలిస్టులకు కరోనా టెస్టులు

సారథిన్యూస్​, వరంగల్​ అర్బన్​: వైద్యులతోపాటు జర్నలిస్టులు కూడా ప్రజలకు కరోనాపై అవగాహన కల్పిస్తున్నారని వరంగల్అర్బన్ జిల్లా డీఎంహెచ్​వో లలిత దేవి పేర్కొన్నారు. పాత్రికేయులు కూడా తగిన జాగ్రత్తలు పాటిస్తూ తమ విధులను నిర్వర్తించాలని కోరారు. శనివారం వరంగల్​ ప్రెస్​క్లబ్​ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో వరంగల్​ ప్రెస్​క్లబ్​ అధ్యక్షుడు తుమ్మ శ్రీధర్ రెడ్డి, కార్యదర్శి పేరుమాండ్ల వెంకట్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీఆర్ లెనిన్, […]

Read More

క్వారంటైన్​ కు కరోనా అనుమానితులు

సారథి న్యూస్, రామడుగు : రామడుగు పీహెచ్​సీని కరీంనగర్​ డీఎంహెచ్​వో జి.సుజాత బుధవారం సందర్శించారు. పలు రికార్డులను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్యంపై ఆరాతీశారు. ఆరోగ్య కేంద్రం పరిధిలో గల ముంబై, మహారాష్ట్ర లేదా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి హోమ్ క్వారంటైన్​ లో ఉంటున్న వారికి పలు సూచనలు చేశారు. కరోనా లక్షణాలు గల అనుమానితులను జిల్లా క్వారంటైన్ కు రెఫర్ చేయాలని సూచించారు. ఆమె వెంట మండల వైద్యాధికారి శ్రీనివాస్ తో పాటు వైద్య […]

Read More