Breaking News

GADWALA

జూరాలకు వరద ఉధృతి

జూరాలకు వరద ఉధృతి

సారథి, జూరాల(మానవపాడు): జూరాల ప్రాజెక్టు 47 గేట్లు ఎత్తి 4.65 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జూరాల పరీవాహక ప్రాంతాల్లో ఉన్న రైతులను జిల్లా అధికారులు అప్రమత్తం చేశారు. మత్స్యకారులు నదిలోకి చేపలవేటకు వెళ్లకూడదని హెచ్చరించారు. జూరాల జలాశయానికి 4 లక్షల 65వేల 500 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి చేరుతుంది. పూర్తి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 316.920 మీటర్ల మేర నీటి మట్టం […]

Read More
కండరగండడు

కండరగండడు

సారథి, మానవపాడు: 50 కాదు.. 100 కాదు.. 150 కేజీలకు పైగా ఉన్న బరువును ఈజీగా ఎత్తేశాడు ఈ కండరగండడు. జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన ఇమ్రాన్​ మాసుం బాషా గుండ్లను ఎత్తే ప్రదర్శనలో ఎప్పటినుంచో పాల్గొంటున్నాడు. ఇటీవల బక్రీద్​పండుగ సందర్భంగా కర్నూలు జిల్లా గుత్తి పెట్రోల్​బంక్​వద్ద సీఐటీయూ ఆటోడ్రైవర్ల యూనియన్​ఆధ్వర్యంలో గుండ్లను ఎత్తే పోటీలో పాల్గొన్నాడు. 140, 160 కిలోల బరువైన గుండ్లను ఎత్తి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆటోడ్రైవర్లు మాసుం బాషాకు అభినందనలు తెలిపి సన్మానించారు. […]

Read More
పునాది తవ్వితే.. బంగారమే బంగారం!

పునాది తవ్వితే.. బంగారమే బంగారం!

పనులు చేస్తుండగా కూలీలకు లభ్యం ఒకేచోట 100కు పైగా నాణేలు వెలుగులోకి.. వాటి విలువ రూ.కోటిపైమాటే సారథి, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలో శివాలయం పక్కన జనార్ధన్ రెడ్డికి సంబంధించిన పాత ఇంటిని కూలగొట్టి కొత్త ఇల్లును కడుతుండగా, పునాదుల్లో బంగారు ఆభరణాలు, నాణేలు లభించాయి. అసలు విషయం ఇంటి యజమానికి చెప్పకుండా కూలీలు తలా పంచుకున్నారు. అసలు విషయం బుధవారం వెలుగుచూసింది. పునాదులు తవ్వడానికి 10 మంది కూలీలు పనిచేశారు. అందులో […]

Read More
వేడుకగా బక్రీద్ పర్వదినం

వేడుకగా బక్రీద్ పర్వదినం

సారథి, మానవపాడు: అంతా కలిసిమెలిసి బక్రీద్ పండుగను జరుపుకోవడం సంతోషకరమని జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు ఎస్సై సంతోష్ కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని జామియా మసీద్ కమిటీ, ఖలీల్ యూత్ ఆధ్వర్యంలో యువకులకు రెండేళ్ల క్రితం క్రికెట్ టోర్నీ నిర్వహించారు. కరోనా నేపథ్యంలో బహుమతులను ప్రదానం చేయలేదు. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని విజేతలకు మొదటి బహుమతి, సీనియర్ కెప్టెన్ శాలిబాషా జట్టుకు, జూనియర్స్ విభాగంలో మొదటి బహుమతి ఇద్రుస్ జట్టుకు ఎస్సై సంతోష్ కుమార్, మాడుగుల […]

Read More
జోగుళాంబ సన్నిధిలో అడిషనల్ కలెక్టర్​

జోగుళాంబ సన్నిధిలో అడిషనల్ కలెక్టర్​

సారథి, అలంపూర్(మానవపాడు): జోగుళాంబ గద్వాల జిల్లా అడిషనల్ ​కలెక్టర్ రఘురామశర్మ బుధవారం అలంపూర్ జోగుళాంబ, బాలబ్రహ్మశ్వర స్వామి ఆలయాలను దర్శించుకున్నారు. అనంతరం స్థానిక తహసీల్దార్ ఆఫీసు నుంచి జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ధరణి వెబ్​సైట్ నుంచి అందిన ఫిర్యాదులపై సలహాలు, సూచనలు ఇచ్చారు. అలాగే ఊట్కూర్ గ్రామ శివారులో ఉన్న ప్రభుత్వభూమిలో గతంలో లావాణీ పట్టాలు ఇచ్చినా రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయకపోవడంతో రైతుల భూములను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ విషయమై […]

Read More
శాంతియుతంగా బక్రీద్

శాంతియుతంగా బక్రీద్

సారథి, మానవపాడు: వచ్చే బక్రీద్, వినాయక చవితి పండుగలను ఎవరికి ఇబ్బంది కలిగించకుండా జరుపుకోవాలని జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు ఎస్సై సంతోష్ సూచించారు. ఆదివారం మానవపాడు పోలీస్​స్టేషన్ ఆవరణలో ముస్లిం పెద్దలు, ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు, యువకులతో శాంతిసమావేశం నిర్వహించారు. మత సామరస్యానికి ప్రతీకగా అందరం కలిసి పండుగలను జరుపుకుందామని పిలుపునిచ్చారు. బక్రీద్ పండుగ సందర్భంగా ఈద్గా ప్రార్థన స్థలాల్లో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతిఒక్కరూ మాస్క్ ​ధరించి, భౌతికదూరం పాటించాలని కోరారు. సోషల్ […]

Read More
ప్రజలకు పారదర్శకంగా ధరణి సేవలు

ప్రజలకు పారదర్శకంగా ధరణి సేవలు

సారథి, మానవపాడు: ధరణి సేవలను ప్రజలకు అందుబాటులో పారదర్శకంగా అందించాలని జోగుళాంబ గద్వాల జిల్లా ఈడీఎం ఫారూఖ్ సూచించారు. గురువారం మానవపాడు మండల కేంద్రంలోని మీసేవ సెంటర్లను ఆయన పరిశీలించారు. మీసేవ ద్వారా అందించే కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో పాటు రైతులకు అందించే సేవలకు అధిక రేట్లు తీసుకోకుండా ప్రభుత్వం సేవలు అందించాలని సూచించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కూడా పారదర్శకత పాటించాలని ఆదేశించారు. అనంతరం మానపాడు తహసీల్దార్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సందర్శించి అక్కడ రైతులకు […]

Read More
బిడ్డ దక్కకపోయినా భర్తను కాపాడుకుంది..

బిడ్డ దక్కకపోయినా భర్తను కాపాడుకుంది..

రోడ్డు ప్రమాదంలో కొడుకు దుర్మరణం మృత్యువుతో పోరాడుతున్న భర్త వైద్యం కోసం రూ.20లక్షలు అవసరం సోషల్​ మీడియా ద్వారా సాయం కోసం.. వేడుకున్న కస్తూర్బా స్కూలు టీచర్​ 2 రోజుల్లోనే రూ.32లక్షలు సాయం చేసిన దాతలు సారథి, గద్వాల(మానవపాడు): మృత్యువు రూపంలో వచ్చిన కారు ఆమె కొడుకును బలితీసుకుంది.. భర్తను చావు అంచులదాకా తీసుకెళ్లింది. ఓ వైపు దు:ఖాన్ని పంటిబిగువున దాచుకుంది. మరోవైపు ప్రాణాపాయస్థితిలో ఉన్న భర్తను కాపాడుకొనేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు. చివరికి సోషల్​మీడియా వేదికగా […]

Read More