సారథి న్యూస్, నల్లగొండ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సరుకు రవాణా, అత్యవసర సేవల వాహనాలు మినహా మిగిలిన అన్ని ప్రైవేట్ వెహికిల్స్ల్లో ప్రయాణించే వారికి విధిగా పాస్ ఉండాలని, పాస్ లేకుండా ప్రయాణాన్ని అనుమతించబోమని నల్లగొండ జిల్లా ఎస్పీ రంగనాధ్ సూచించారు. ఆదివారం పలు ఆదేశాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వెళ్లాలనే ప్రయాణికులకు ఇకపై ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు మాత్రమే అనుమతిస్తామని స్పష్టంచేశారు. నల్లగొండ జిల్లా మీదుగా మాచర్లకు వెళ్లే […]
సారథి న్యూస్, కర్నూలు: దేశంలో ఆర్థిక సంస్కరణలకు నాంది పలికిన మహానుభావుడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అని కాంగ్రెస్ నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు లక్ష్మీనరసింహయాదవ్ కొనియాడారు. పాణ్యం నియోజకవర్గ పరిధిలోని నంద్యాల చెక్ పోస్టు సమీపంలో కాంగ్రెస్ ఆఫీసులో పీవీ నరసింహారావు శతజయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి పీవీ చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు భరత్ కుమార్ ఆచారి, కాంగ్రెస్ జిల్లా […]
సారథి న్యూస్, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం పాతర్ల పహాడ్ గ్రామంలో ఆదివారం దారుణం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. మద్యం తాగిన మైకంలో సొంత బాబాయ్ లచ్చయ్య(55)ను గొడ్డలితో అన్న కొడుకు వెంకన్న నరికి చంపాడు. తీవ్రమైన రక్తపు మడుగులో లచ్చయ్య అక్కడికక్కడే చనిపోయాడు. నిందితుడు వెంకన్న పరారీలో ఉన్నాడు. ఈ దారుణఘటనకు దారితీసిన కారణాలు తెలియాల్సి ఉంది.
సారథి న్యూస్, ఖమ్మం: బహుభాషా కోవిదుడు, సరళీకరణ ఆర్థిక విధానాలు, లుక్ ఈస్ట్ పాలసీతో భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు దేశానికి ఎనలేని సేవచేశారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కొనియాడారు. కష్టకాలంలో ప్రధానమంత్రి పగ్గాలు చేపట్టి ఆర్థిక రంగాన్ని పరుగులు పెట్టించారని గుర్తుచేశారు. ఆదివారం పీవీ శతజయంతి సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ ఆఫీసులో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. దేశానికి సేవలను కొనియాడారు.
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా కోరలు చాచింది. కొత్త ప్రాంతాలకు విస్తరిస్తూ.. ఈజీగా మింగేస్తోంది. ఆదివారం కొత్తగా 983 పాజిటివ్‌కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 14,418కు చేరింది. మహమ్మారి బారినపడి తాజాగా నలుగురు మృత్యువాతపడ్డారు. ఇప్పటి వరకు 247 మంది చనిపోయారు. యాక్టివ్‌కేసులు 9 వేలు ఉన్నాయి. చికిత్స అనంతరం 5172 మంది డిశ్చార్జ్ అయ్యారు. జీహెచ్ఎంసీ పరిధిలో 816, రంగారెడ్డి జిల్లాలో 47, మేడ్చల్ జిల్లాలో 29 చొప్పున కేసులు నిర్ధారణ అయ్యాయి.
శతజయంతి ఉత్సవాల్లో సీఎం కేసీఆర్ సారథి న్యూస్, హైదరాబాద్: దివంగత భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు బహుముఖ ప్రజ్ఞాశాలి అని, గొప్ప సంస్కరణ శీలి అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు కొనియాడారు. సంస్కరణలకు పీవీ నిలువెత్తు రూపమని కీర్తించారు. ఆదివారం నెక్లెస్ రోడ్డులో పీవీ శతజయంతి ఉత్సవాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. పీవీ జ్ఞానభూమి వద్ద ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. దేశచరిత్రను ప్రపంచానికి తెలియజేసిన గొప్ప వ్యక్తి […]
సారథి న్యూస్, హుస్నాబాద్: ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం లక్ష్యం నీరుగారుతున్నదని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గడిపె మల్లేశ్ ఆరోపించారు. హుస్నాబాద్ పట్టణంలోని అనభేరి, సింగిరెడ్డి అమరుల భవనంలో ఆయన మీడియాతో మాట్లాడారు. హుస్నాబాద్ పట్టణంలోని కరీంనగర్ రోడ్డులో 4000 వేలకు పైగా హరితహారం మొక్కలు పెంటకుప్పలపై వేశారని ఆరోపించారు. మండల ప్రజాపరిషత్ అధికారులు, మున్సిపల్ కమిషనర్‌కు ఆ మొక్కలు చూపించగా ఆ మొక్కలు ప్రభుత్వానికి కావంటూ బుకాయిస్తున్నారని ఆరోపించారు. రూ.5లక్షలకు […]
సారథి న్యూస్, ఖమ్మం, రామడుగు,చొప్పదండి: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గొప్ప రాజనీతిజ్ఞుడని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో పీవీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఖమ్మం కలెక్టరేట్లో మంత్రి పువ్వాడ అజయ్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఖమ్మంలో పీవీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటుచేస్తామని పేర్కొన్నారు. దేశానికి మార్గనిర్దేశనం చేసిన మహనీయుడు మాజీ ప్రధాని పీవీ అని రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ కొనియాడారు. మహబూబాబాద్‌లో […]