Breaking News

Day: April 29, 2021

మామిడి తోటకు పెళ్లి

మామిడి తోటకు పెళ్లి

సారథి, రామడుగు: తొలిసారి కాపుకు వచ్చిన మామిడి తోటకు పెళ్లి జరిపించారు. రైతులు ఈ ఆచారాన్ని పాటిస్తుంటారు. కరీంనగర్​ జిల్లా రామడుగు మండల కేంద్రానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ కడారి వీరయ్య తన సొంత వ్యవసాయ పొలంలో మూడెకరాల విస్తీర్ణంలో మామిడి తోట సాగుచేశారు. మొదటి సారి కోత దశకు వచ్చిన మామిడి తోటకు పెళ్లి చేశారు. గురువారం పురోహితుడు రామస్వామి పంతులు సమక్షంలో శాస్త్రోక్తంగా వేదమంత్రోచ్ఛరణ మధ్య కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఈ తంతు నిర్వహించారు.

Read More
స్వీయ నియంత్రణతో కరోనాను బ్రేక్ చేద్దాం

స్వీయ నియంత్రణతో కరోనాను బ్రేక్ చేద్దాం

  • April 29, 2021
  • Comments Off on స్వీయ నియంత్రణతో కరోనాను బ్రేక్ చేద్దాం

మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి సారథి, రామయంపేట: కరోనా చైన్ ను బ్రేక్ చేయాలంటే ప్రతిఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి సూచించారు. గురువారం మెదక్​ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో శ్రీహెల్త్ కేర్ ఫార్మసీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అందరూ కరోనా నిబంధనలు పాటించాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రజలకు విజ్ఞప్తిచేశారు. కరోనా సెకండ్ వేవ్ సివియరిటీ ఎక్కువగా ఉన్నందున ప్రతిఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించి జాగ్రత్తగా […]

Read More
జర్నలిస్టులకు రూ.50లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి

జర్నలిస్టులకు రూ.50లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి

ఫ్రంట్​ లైన్​ వారియర్స్​ గా గుర్తించాలి జాట్​ రాష్ట్ర అధ్యక్షుడు పగుడాకుల బాలస్వామి నేత సారథి, వికారాబాద్​: విధి నిర్వహణలో భాగంగా కోవిడ్ బారినపడి ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టులకు రూ.50 లక్షల బీమా తరహా ఎక్స్​గ్రేషియా చెల్లించాలని జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ(జాట్​) రాష్ట్ర అధ్యక్షుడు పగుడాకుల బాలస్వామి నేత డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఇల్లు వదిలి బయటికి రానీ విపత్కర పరిస్థితుల్లో కూడా కుటుంబాన్ని పక్కనపెట్టి విధి నిర్వహిస్తున్న జర్నలిస్టులను కొవిడ్ మహమ్మారి కబళించడం దురదృష్టకరమని […]

Read More
తహసీల్దార్​కు సమాచార కమిషనర్​ నోటీసులు

తహసీల్దార్​కు సమాచార కమిషనర్​ నోటీసులు

సారథి, బిజినేపల్లి: సమాచార హక్కు చట్టం కింద సకాలంలో దరఖాస్తుదారుడికి సరైన సమాచారం ఇవ్వకపోవడంపై నాగర్​కర్నూల్ ​జిల్లా బిజినేపల్లి తహసీల్దార్​కు ఆర్టీఐ కమిషనర్ ​బుధవారం షోకాజ్ ​నోటీసులు జారీచేశారు. బిజినేపల్లి మండలం వడ్డేమాన్ ​గ్రామంలో 2012లో ఎంత మంది రైతులు ఖరీఫ్​ సీజన్​లో బీమా చెల్లించారో తనకు పూర్తి సమాచారం ఇవ్వాలని న్యాయవాది ఏసీబీ శ్రీరామ్​ఆర్యా బిజినేపల్లి తహసీల్దార్​కు దరఖాస్తు చేశారు. సమాచారం ఇవ్వకపోవడంతో నాగర్​కర్నూల్ ​ఆర్డీవోకు అప్పీల్​చేశారు. అయినా కూడా జిల్లా అధికారుల నుంచి సరైన […]

Read More
వృత్తి ఉద్యోగాల్లో వారికి చికాకులు తప్పవు

వృత్తి ఉద్యోగాల్లో వారికి చికాకులు తప్పవు

నేటి రాశిఫలాలు29 ఏప్రిల్ 2021గురువారం మేషం: బంధుమిత్రుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలకు సంబంధించిన సమాచారం అందుతుంది. తరచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. కుటుంబపెద్దల సహకారంతో కొన్ని పనులు పూర్తవుతాయి. దూరప్రయాణాల ద్వారా శారీరక శ్రమ కలుగుతుంది. వ్యాపారాలు లాభాల బాట పట్టడం కష్టంగా మారుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమఅధికం, ఫలితం తక్కువగా ఉంటుంది. మీ శ్రీమతి గారితో ఉల్లాసంగా గడుపుతారు. సమయానికి ధనం అందక అవస్థలు పడుతారు. బదిలీలు మార్పులు, చేర్పులు అసౌకర్యం కలిగిస్తాయి. […]

Read More
అపోహలు వీడి.. వ్యాక్సిన్​ తీసుకోండి

అపోహలు వీడి.. వ్యాక్సిన్​ తీసుకోండి

సారథి, రామడుగు: కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో నివారణకు కరీంనగర్ ​జిల్లా రామడుగు గ్రామపంచాయతీ పాలకవర్గం కొద్దిరోజులుగా సెల్ఫ్ లాక్ డౌన్ విధించింది. అందులో భాగంగానే బుధవారం గ్రామంలోని ప్రధాన చౌరస్తాలతో పాటు వార్డుల్లో సర్పంచ్ పంజాల ప్రమీల, వైస్ ఎంపీపీ పురేళ్ల గోపాల్, ఎంపీటీసీ బొమ్మరవేని తిరుమల, పాలకవర్గ సిబ్బందితో కలిసి హైపో ద్రావణాన్ని పిచికారీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మాస్క్ ధరించి […]

Read More
కరోనా టెస్టుల కోసం బారులు

కరోనా టెస్టుల కోసం బారులు

20 మందికి మాత్రమే నిర్ధారణ పరీక్షలు నిరాశతో వెనుదిరుగుతున్న జనం తాజాగా కొవిడ్​తో వృద్ధుడు మృతి, అవసరమైన వారే టెస్టులు చేయించుకోండి: డీఎంహెచ్​వో వెంకటేశ్వర్​ రావు సారథి, పెద్దశంకరంపేట: మెదక్​ జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రంలో ఓ వ్యక్తి(52) కరోనాతో బాధపడుతూ బుధవారం చనిపోయాడు. అతని పరిస్థితి విషమించడంతో స్థానిక ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రానికి ఆటోలో తీసుకొచ్చారు. ఆటోలోనే అతనికి వైద్యపరీక్షలు చేశారు. కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో మెదక్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. అక్కడికి చేరుకునేలోపే […]

Read More