Breaking News

JOURNALIST

జైలు నుంచి జర్నలిస్ట్ రఘు విడుదల

జైలు నుంచి జర్నలిస్ట్ రఘు విడుదల

సారథి, నల్లగొండ: సూర్యాపేట జిల్లా గుర్రంబోడు భూముల వ్యవహారంలో రెచ్చగొట్టే కథనాలను ప్రసారం చేశారనే ఆరోపణలతో అరెస్ట్ అయి జైలులో ఉన్న తొలి వెలుగు జర్నలిస్టు రఘు 13 రోజుల తర్వాత మంగళవారం నల్లగొండ జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. ఈనెల 3న మార్కెట్‌లో పండ్లు, కూరగాయలు కొనేందుకు ఇంటి నుంచి వెళ్లిన రఘును మఫ్టీలో వచ్చిన పోలీసులు వెంబడించి బలవంతంగా అరెస్ట్ చేసి కారులో తీసుకెళ్లిన విషయం తెలిసిందే. తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం రాష్ట్ర […]

Read More
జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలి

జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలి

సారథి, వేములవాడ: జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలని వేములవాడ టీయూడబ్ల్యూజేహెచ్(143) ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు మహమ్మద్ రఫీ ప్రభుత్వాన్ని కోరారు. జర్నలిస్టులందరికీ కరోనా టెస్టులు చేసి మెరుగైన వైద్యం అందించాలన్నారు కోరారు. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల అడిషనల్ కలెక్టర్ అంజయ్యకు వినతిపత్రం అందజేశారు. వేములవాడతోపాటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు కరోనా వ్యాక్సిన్​ వేయాలని విజ్ఞప్తిచేశారు. జర్నలిస్టులకు అక్రిడిటేషన్​కార్డులు ఇవ్వాలని డిమాండ్​చేశారు. ఆయన వెంట ప్రెస్​క్లబ్​ప్రధాన కార్యదర్శి భాస్కర్​రెడ్డి, ఇతర జర్నలిస్టులు […]

Read More
తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్రే కీలకం

తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్రే కీలకం

సారథి న్యూస్, రామగుండం: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జర్నలిస్టుల పాత్రే కీలకమని, పాత్రికేయుల సంక్షేమానికి సీఎం కేసీఆర్​ కృషిచేస్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. శనివారం ఆయన రూ.20లక్షల వ్యయంతో నిర్మించనున్న గోదావరిఖని ప్రెస్​క్లబ్​ భవన నిర్మాణానికి రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే గోదావరిఖని ప్రెస్ క్లబ్ చైతన్యానికి మారుపేరుగా నిలిచిందని, తెలంగాణ ఉద్యమంలో ఇక్కడి జర్నలిస్టు సాగించిన పోరాటం మరువలేనిదన్నారు. మొట్టమొదట […]

Read More
జర్నలిస్టులకు కేంద్రం గుడ్​న్యూస్​

జర్నలిస్టులకు కేంద్రం గుడ్​ న్యూస్​

హైదరాబాద్: కరోనా మహమ్మారి బారినపడిన జర్నలిస్టులకు కేంద్రప్రభుత్వం రూ.50వేలు నుంచి రూ.లక్ష వరకు ఆర్థిక సహాయం అందజేస్తోంది. అలాగే మృతిచెందిన వారికి రూ.ఐదులక్షల సాయం అందజేస్తోంది. కొవిడ్​ట్రీట్​మెంట్​ అనంతరం డిశ్చార్జ్​అయిన జర్నలిస్టులు ధ్రువీకరణ పత్రాలతో కింద తెలియజేసిన లింక్ లో ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. అన్ని వివరాలను కింద పేర్కొన్న లింక్​లో పొందుపరిచారు. http://pibaccreditation.nic.in/jws/default.aspx

Read More

కరోనాకు జర్నలిస్టు బలి

సారథిన్యూస్ రామగుండం: కరోనా మహమ్మారి ఓ యువ జర్నలిస్టును బలి తీసుకున్నది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన రాంచందర్​ ఆంధ్రప్రభ దినపత్రికలో విలేఖరిగా పనిచేస్తున్నాడు. కొంత కాలంగా శ్వాససంబంధిత ఇబ్బందితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. కరీంనగర్​ దవాఖానలో చికిత్సపొందుతూ మంగళవారం కన్నుమూశాడు. రాంచందర్​ మృతికి గోదావరిఖని ప్రెస్ క్లబ్ నాయకులతోపాటు సీనియర్ జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు.

Read More
జర్నలిస్టులను అన్ని విధాల ఆదుకుంటున్నాం

337 మంది జర్నలిస్టులకు సాయం

సారథిన్యూస్​, హైదరాబాద్​: రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారినపడ్డ 337 మంది జర్నలిస్టులకు రూ. 59 లక్షల 30 వేల రూపాయలు ఆర్థికసాయం అందించామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్​ అల్లం నారాయణ వెల్లడించారు. పాజిటివ్ వచ్చిన 256 మందికి 20 వేల రూపాయల చొప్పున, 51 లక్షల 20 వేల రూపాయలు, హోం క్వారంటైన్ లో ఉన్న 81 మంది జర్నలిస్టులకు పదివేల రూపాయల చొప్పున 8 లక్షల 10 వేల రూపాయలను అందిచామన్నారు. జర్నలిస్టులు ఎవరికైనా […]

Read More

జర్నలిస్టుపై కాల్పులు

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో నడిరోడ్డులో ఒక జర్నలిస్ట్‌పై దుండగులు కాల్పులు జరిపారు. కొద్దిరోజుల క్రితం తన మేనకోడలిని వేధించారని సదరు జర్నలిస్టు ఫిర్యాదు చేశాడు. దీంతో కక్ష పెంచుకున్న ఆకతాయిలు కాల్పులు జరిపిఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఉత్తరప్రదేశ్​లోని ఘజియాబాద్​లో విక్రమ్​ జోషి ఓ పత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి విక్రమ్​ తన కూతురుతో కలిసి ఇంటికి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి ఆకస్మికంగా కాల్పులు జరిపారు. ఇందుకు సంబంధిన దృశ్యాలు దగ్గరలో ఉన్న సీసీ […]

Read More
కరోనా పాజిటివ్‌ .. జర్నలిస్ట్‌ సూసైడ్​

కరోనా పాజిటివ్‌.. జర్నలిస్ట్‌ సూసైడ్​

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ ఎయిమ్స్‌ హాస్పిటల్‌లో దారుణం చోటుచేసుకుంది. కరోనా పాజిటివ్‌ వచ్చిన 34 ఏళ్ల జర్నలిస్ట్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఎయిమ్స్‌ బిల్డింగ్‌ ఫోర్త్‌ ఫ్లోర్‌‌ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. హిందీ డైలీ ‘డైనిక్‌ భాస్కర్‌‌’ పేపర్‌‌లో పనిచేస్తున్న జర్నలిస్ట్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో భయపడిపోయిన ఆయన రెండు రోజుల నుంచి కొలీగ్స్‌, ఫ్రెండ్స్‌కు డిప్రెషన్‌ మెసేజ్‌లు పంపడం మొదలుపెట్టాడు. జర్నిలిస్టులు పరిస్థితి మరీ దారుణంగా తయారైందని, చాలా సార్లు […]

Read More