Breaking News

Day: June 20, 2020

ములుగు అంటేనే అడవులు

సారథి న్యూస్​, ములుగు: ములుగు అంటేనే అడవులు ఉన్న ప్రాంతమని, అడవిని చూసినప్పుడు చెట్లు లేకపోవడం బాధేసిందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శనివారం ఆమె ములుగు జిల్లా కలెక్టరేట్​లో నిర్వహించిన ఉపాధి హామీ, హరితహారం పథకాలపై సమీక్షించారు. అడవులను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సమావేశంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క, కలెక్టర్ కృష్ణఆదిత్య, జడ్పీ సీఈవో పారిజాతం, జడ్పీ చైర్మన్ జగదీష్, పీవో హనుమంతు పాల్గొన్నారు.

Read More

వానాకాలంలోగా రైతు వేదికలు పూర్తి

సారథి న్యూస్, హుస్నాబాద్: వానాకాలంలోగా జిల్లాల్లో రైతువేదికలు నిర్మించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. శనివారం సిద్దిపేట కలెక్టరేట్ లో సమీక్షించారు. రెండు నెలలలోపు జిల్లాలో 126 రైతు వేదిక నిర్మాణాలు పూర్తిచేసి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలపాలని, ఇందుకోసం జిల్లాస్థాయిలో పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఏజెన్సీలను మంత్రి కోరారు. రైతు వేదికల నిర్మాణాలకు నిధుల కొరత లేదని, జిల్లాలో 126 వేదికల నిర్మాణాలు చేపట్టాలని, ఒక్కోదానికి రూ.22లక్షల చొప్పున […]

Read More

5వేల ఎకరాలకొక రైతువేదిక

సారథి న్యూస్, హుస్నాబాద్: 5వేల ఎకరాలకు ఒక్క రైతు వేదికను ఏర్పాటు చేస్తున్నట్లు హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. శనివారం కోహెడ మండలం శనిగరం గ్రామంలో రూ.22లక్షల వ్యయంతో నిర్మించనున్న రైతు వేదిక భవనానికి భూమిపూజ చేశారు. రైతులను రాజులు చేయడమే సీఎం కేసీఆర్​ లక్ష్యమన్నారు. అనంతరం ఉపాధిహామీ పథకంలో భాగంగా శనిగరం ప్రాజెక్టు కింద ఉన్న బెజ్జంకి కాల్వ మరమ్మతు పనులను ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు […]

Read More

పారిశుద్ధ్య కార్మికులకు సరుకులు పంపిణీ

సారథి న్యూస్​, రంగారెడ్డి: టీపీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఎన్​.ఉత్తమ్ కుమార్ రెడ్డి జన్మదినం సందర్భంగా శనివారం రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు కళ్లెం సుజాత రెడ్డి ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులను సన్మానించి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కాంగ్రెస్​ పార్టీని ఊరూరా బలోపేతం చేస్తామని ఆమె ప్రకటించారు.

Read More

అమర జవానులకు నివాళి

సారథి న్యూస్​, రంగారెడ్డి: ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు గద్దె విజయ్ నేత ఆధ్వర్యంలో కల్నల్​ సంతోష్​బాబుతో పాటు ఇతర అమర జవానులకు శనివారం నివాళులర్పించారు. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలోని ఎన్జీవోస్ కాలనీ సచివాలయ నగర్ బస్టాప్ నుంచి వనస్థలిపురం పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. 50 మంది పారిశుద్ధ్య కార్మికులకు మాస్కులు, శానిటైజర్లు, గ్లౌస్​లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ నేత కుంట్లూరు వెంకటేష్ గౌడ్, సచివాలయ నగర్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, […]

Read More

మహిళా నేత ఔదార్యం

సారథిన్యూస్, గంగాధర: తన పుట్టినరోజు నాడు వికలాంగులకు బస్​పాస్​లు అందించి ఓ మహిళా నేత ఔదార్యాన్ని చాటుకున్నారు. టీఆర్​ఎస్​ మహిళా నాయకురాలు రోజా తన పుట్టిన రోజున సొంతఖర్చులతో వికలాంగులకు ఉచిత బస్​పాసులు అందజేశారు. శనివారం కరీంనగర్​ జిల్లా గంగాధర మండల పరిషత్​ కార్యాలయంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ వికలాంగులకు బస్​పాసులను అందించారు.

Read More

రైతులకు పరిహారం చెక్కులు

సారథి న్యూస్​, కరీంనగర్​: కరీంనగర్​ జిల్లా మానకొండూరు నియోజవర్గంలో వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ శనివారం పర్యటించారు. కాళేశ్వరం జలాలను తిమ్మాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో తీసుకెళ్లే క్రమంలో భూములు కోల్పోతున్న రైతులకు పర్లపల్లి గ్రామంలో చెక్కులు పంపిణీ చేశారు. ఆయన వెంట మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితెల సతీష్​కుమార్​ ఉన్నారు.

Read More

కరోనా రికార్డు

సారథి న్యూస్​, హైదరాబాద్​: కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. కొత్త ప్రాంతాలకు చాపకింద నీరులా విస్తరిస్తోంది. కొత్త వ్యక్తులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో శనివారం మొదటిసారి కొత్తగా 546 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలోనే 458 కేసులు పాజిటివ్​గా తేలాయి. ఒకేరోజు కరోనాతో ఐదుగురు మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 203కు చేరింది. రాష్ట్రంలో కేసులు 7072కు చేరాయి. ఇప్పటివరకు 53,757 మందికి వైద్యపరీక్షలు నిర్వహించారు. 3,363 మంది బాధితులు ఆస్పత్రిలో చికిత్స […]

Read More