Breaking News

Day: May 27, 2020

రూ.1,500 ఇక పడవ్​

రాష్ట్ర ఆదాయం బాగా తగ్గిపోయింది ఉద్యోగుల వేతనాల్లో కోత తప్పదు ఈనెలలోనూ ఒక్కొక్కరికి రూ.12కేజీల బియ్యం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం కేసీఆర్​ సమీక్ష పాల్గొన్న సీఎస్​, ఇతర ఉన్నతాధికారులు సారథి న్యూస్​, హైదరాబాద్: లాక్ డౌన్ తో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం పడిపోయిందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. లాక్​ డౌన్​ నిబంధనల్లో సడలింపులు ఇచ్చినా ఆదాయం పెరగలేదని చెప్పారు. రిజిస్ట్రేషన్లు, రవాణా తదితర రంగాల్లో ఆదాయం పెద్దగా లేదని తెలిపారు. ఏడాదికి రూ.37,400 కోట్లను వడ్డీలుగా […]

Read More

నాగర్ కర్నూల్​ జిల్లాలో మరో పాజిటివ్ కేసు

వెల్లడించిన కలెక్టర్ శ్రీధర్ సారథి న్యూస్, నాగర్ కర్నూల్​: నాగర్ కర్నూల్​ జిల్లా చారకొండ మండలం రామచంద్రాపురంలో ఈ నెల 23న కరోనా పాజిటివ్ కేసు నమోదు కాగా బుధవారం వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో మరో పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ శ్రీధర్ అప్రమత్తం చేశారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య శాఖల అధికారులతో కరోనా నివారణ చర్యలపై కల్వకుర్తి ఆర్డీవో ఆఫీసులో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ లాక్ డౌన్ […]

Read More

బోరుబావిలో పసివాడు

ఆడుకుంటూ వెళ్లి అందులోపడ్డ బాలుడు సారథి న్యూస్​, మెదక్​: మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పోడ్చన్‌పల్లి గ్రామంలో ఆడుకుంటూ వెళ్లిన సాయివర్ధన్ అనే మూడేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు బోరు బావిలో పడ్డాడు. బుధవారం ఈ ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది. తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం 120 నుంచి 150 అడుగుల లోతులో బాలుడు ఉన్నాడు. రెస్య్యూటీమ్ వెంటనే సహాయక చర్యలు చేపట్టింది. సంఘటన స్థలానికి నాలుగు జేసీబీలు చేరుకుని పనులు చేపట్టాయి. మెదక్​ […]

Read More

దుండగులను కఠినంగా శిక్షించాలి

సీపీఎం రాష్ట్ర నేత రాఘవులు సారథి న్యూస్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రెండు రోజుల క్రితం మహిళపై అత్యాచారయత్నానికి పాల్పడి మహిళను కాపాడాలని వచ్చిన భర్త, ఆమె బంధువులపై దాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించి వారిపై హత్యాయత్నం, నిర్భయ చట్టం ప్రకారం కేసులు నమోదు చేయాలని సీపీఎం రాష్ట్ర నాయకులు లంక రాఘవులు డిమాండ్ చేశారు. బుధవారం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారితో మాట్లాడారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు […]

Read More

రైతులను ఆదుకోండి

సారథి న్యూస్ ఆదిలాబాద్ : రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చిట్యాల సుహాసిని రెడ్డి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన కు క్యాంపు ఆఫీసులో బుధవారం వినతిపత్రాన్ని అందజేశారు. రైతులకు 2018 -19 కి సంబంధించిన నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించాలని కోరుతున్నామన్నారు. అదేవిధంగా పత్తి రైతులు చెల్లించిన ప్రీమియం 66 కోట్లు కాగా రైతులకు రావాల్సిన రూ. 300 కోట్లు వెంటనే విడుదల చేయాలని కోరారు. కలెక్టర్​ను కలిసిన వారిలో […]

Read More

పంటమార్పిడి తప్పనిసరి

సారథి న్యూస్, నర్సాపూర్: రైతులు పంట మార్పిడి తప్పనిసరిగా చేసుకోవాలని కలెక్టర్ ధర్మారెడ్డి సూచించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా నియంత్రణ వ్యవసాయ సాగుపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. బుధవారం మండలంలోని మహమ్మద్ నగర్, సలాబత్ పూర్ గ్రామాల్లో సదస్సులను నిర్వహించగా జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ..దేశంలో పప్పుదినుసుల పంటల సాగు తక్కువగా ఉన్నందున దిగుమతి చేసుకోవడంతో విదేశీ మారకం భారం పడుతుందని, కనుక […]

Read More

వడదెబ్బతో ఎన్టీపీసీ కార్మికుడి మృతి

సారథి న్యూస్, గోదావరిఖని: వడదెబ్బతో ఓ కాంట్రాక్టు కార్మికుడు వడదెబ్బకు గురై మృతిచెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రామగుండం ఎన్టీపీసీలో కాంట్రాక్ట్ కార్మికుడిగా కొత్త సత్యనారాయణ( 49) పనిచేస్తున్నాడు. రైల్వే ట్రాక్ విధులు నిర్వహిస్తూ భోజనం చేసి కుళాయి దగ్గర నీళ్లు తాగడనికి వెళ్లి అక్కడికక్కడే కుప్పకూలి పడిపోవడంతో తోటి కార్మికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సత్యనారాయణ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. బాధిత కుటుంబానికి ఎన్టీపీసీ జేఏసీ నాయకులు, కాంట్రాక్టర్స్ […]

Read More

కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు చేయాలి

సారథి న్యూస్, గోదావరిఖని: నగర పాలక సంస్థలోని గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో(కోల్డ్ స్టోరేజ్) శీతల గిడ్డంగులు ఏర్పాటు చేయాలని బుధవారం కమిషనర్ పి.ఉదయ్ కుమార్ కు సీపీఐ నగర సహాయ కార్యదర్శి మద్దెల దినేష్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. రామగుండం నగరంలో మార్కెటింగ్ దినదినాభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తుండడం శుభపరిణామని అన్నారు. ప్రధానంగా కూరగాయలు, పండ్లు, చేపలు వంటివి నిలువ చేసుకోవడానికి గిడ్డంగులు లేకపోవడంతో ఆర్థికంగా తీవ్ర నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. […]

Read More