Breaking News

NIZAMABAD

టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతల దురాగతాలు

టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతల దురాగతాలు

నిజామాబాద్​లో కుటుంబం ఆత్మహత్య వెనక ఎంపీ అరవింద్​అనుచరులు 317 జీవోతో ఉద్యోగుల్లో అభద్రత కాంగ్రెస్​నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ సామాజికసారథి, హైదరాబాద్‌: తెలంగాణలో టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతల ఆకృత్యాలకు ఉద్యోగులు, జనం బలవుతున్నారని కాంగ్రెస్‌ప్రచార కమిటీ చైర్మన్‌మధుయాష్కీ మండిపడ్డారు. వనమా రాఘవేందర్​ఎపిసోడ్‌ముగియక ముందే.. నిజామాబాద్‌లో మరో సంఘటన జరిగిందన్నారు. నిజామాబాద్‌లో నలుగురి ఆత్మహత్యలకు బీజేపీ నేతలే కారణమన్నారు. ఎంపీ అరవింద్‌అండదండలతో దురాగతాలు చేస్తున్నారని ఆరోపించారు. నలుగురు ఆత్మహత్యల వెనక బీజేపీ, టీఆర్‌ఎస్‌నేత హస్తం ఉందన్నారు. వడ్డీ వ్యాపారులును […]

Read More
ఎమ్మెల్సీగా కవిత ఏకగ్రీవం

ఎమ్మెల్సీగా కవిత ఏకగ్రీవం

నిన్న నామినేషన్‌.. నేడు ఎన్నిక రెండవసారి మండలిలోకి ప్రవేశం అభినందించిన టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు సామాజిక సారథి, నిజామాబాద్‌: సీఎం కేసీఆర్‌ కూతురు, సిట్టింగ్​ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల అభ్యర్థిగా మళ్లీ పోటీచేసిన ఆమె ఎన్నిక ఏకగ్రీవమైంది. స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాస్‌ నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించడంతో ఆమెకు లైన్‌ క్లియర్‌ అయింది. మంగళవారం ఆమె నామినేషన్‌ దాఖలు చేయగా.. ఒక్కరోజు గ్యాప్‌లోనే బుధవారం ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా […]

Read More
తెలంగాణలో పసుపు బోర్డు పెట్టే ఉద్దేశమే లేదు

తెలంగాణలో పసుపు బోర్డు పెట్టే ఉద్దేశమే లేదు

పార్లమెంట్​లో కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరణ సారథి న్యూస్​, హైదరాబాద్: నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటుపై కమలనాథులు యూ టర్న్ తీసుకున్నారు. బోర్డును సాధిస్తామని గత పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు దండుకున్న బీజేపీ తమ వైఖరి ఏమిటో స్పష్టం చేసింది. అలాంట బోర్డు ఏర్పాటుచేసే ఆలోచన లేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. పసుపు బోర్డు పెట్టే ఉద్దేశం లేదని కేంద్రం తేల్చిచెప్పింది. టీఆర్​ఎస్​ రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర […]

Read More
ఎమ్మెల్యే తండ్రి దశదినకర్మకు సీఎం కేసీఆర్​హాజరు

ఎమ్మెల్యే తండ్రి దశదినకర్మకు సీఎం కేసీఆర్​ హాజరు

సారథి న్యూస్, హైదరాబాద్: నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా తండ్రి కృష్ణమూర్తి ఇటీవల కన్నుమూశారు. బుధవారం మాక్లూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే స్వగృహంలో నిర్వహించిన ద్వాదశ దినకర్మలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పాల్గొన్నారు. రోడ్డు మార్గం ద్వారా ఆయన అక్కడికి నేరుగా వెళ్లి ఎమ్మెల్యే గణేష్ గుప్తా కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు. అంతకుముందు కృష్ణమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీఎం వెంట హోంశాఖ మంత్రి మహమూద్​అలీ, మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, […]

Read More
వీరజవాన్ మహేష్​కుటుంబానికి అండగా ఉంటాం

వీరజవాన్ మహేష్ ​కుటుంబానికి అండగా ఉంటాం..

సారథి న్యూస్​, హైదరాబాద్​: దేశ సరిహద్దుల్లో జరిగిన ముష్కరుల కాల్పుల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన వీరజవాన్ మహేష్​ మృతిచెందడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన యోధుడిగా మహేష్​ చరిత్రలో నిలిచిపోతారని సీఎం కేసీఆర్​ కొనియాడారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారు. జవాన్ కుటుంబానికి ప్రభుత్వపరంగా రూ.50లక్షల ఆర్థిక సహాయం అందించనున్నట్లు వెల్లడించారు. అర్హతను బట్టి కుటుంబసభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తెలిపారు. […]

Read More
నిజామాబాద్​డీఎంహెచ్​వో రాజీనామా

నిజామాబాద్ జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజీనామా

సారథి న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ ​నాగేశ్వర్ రావు సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. వైద్యాశాఖ ఉన్నతాధికారులకు తన రాజీనామా లెటర్​ను పంపించారు. అయితే ఇటీవల జిల్లాకేంద్రంలో కరోనాతో మృతిచెందిన ఓ పేషెంట్​ను ఎలాంటి భద్రతాచర్యలు పాటించకుండా ఆటోలో తీసుకెళ్లారు. పీపీఈ కిట్లు మాత్రమే ధరించిన సిబ్బంది మాత్రమే అంబులెన్స్​లో తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే జిల్లా ఆస్పత్రిలో సకాలంలో సరైన వైద్యం అందక నలుగురు రోగులు మృతిచెందారు. ఈ వరుస ఘటనలపై పై […]

Read More
షార్ట్ న్యూస్

మనోజ్ కుటుంబానికి సాయం

సారథి న్యూస్​, నిజామాబాద్​: కరోనా మహమ్మారితో మరణించిన యువ జర్నలిస్టు మనోజ్ కుమార్​ కుటుంబానికి తనవంతు సహాయంగా రూ‌.50వేల ఆర్థిక సాయాన్ని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు( డీసీసీబీ)అధ్యక్షుడు పోచారం భాస్కర్ రెడ్డి సోమవారం ప్రకటించారు. కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా ప్రజలకు వార్తలను అందిస్తూ సమాజానికి మేలు చేస్తున్న యువ రిపోర్టర్ అకాల మరణం కలచివేసిందన్నారు. మనోజ్​ కుటుంబసభ్యులకు ప్రగాఢసానుభూతి తెలిపారు.

Read More