ఉన్నతస్థాయి సమీక్షలో సీఏం వైఎస్జగన్ అమరావతి: జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం ఓటీఎస్ పై అవగాహన కల్పించాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణం, ఓటీఎస్ పథకంపై సీఎం జగన్ బుధవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఓటీఎస్‌పై అవగాహన కల్పించాలని, ఓటీఎస్ అనేది పూర్తి స్వచ్ఛందమని స్పష్టం చేశారు. రూ.10వేల కోట్ల భారాన్ని పేదలపై తొలగిస్తున్నామని పేర్కొన్నారు. రుణాలు మాఫీ చేస్తున్నామని, రిజిస్ట్రేషన్‌కూడా ఉచితంగా చేస్తున్నామని […]
సారథి, అచ్చంపేట: ఆంధ్రప్రదేశ్ అక్రమంగా ప్రాజెక్టులను నిర్మిస్తే ఊరుకునేది లేదని, జలదోపిడీపై అక్కడే పాతరేస్తామని నాగర్ కర్నూల్జిల్లా అచ్చంపేట జడ్పీటీసీ సభ్యుడు మంత్రియ నాయక్ హెచ్చరించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కాంగ్రెస్, బీజేపీ సైంధవపాత్ర పోషిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్ర హక్కులకు విరుద్ధంగా కృష్ణా బేసిన్‌లో దోసెడు నీళ్లను కూడా తీసుకోనివ్వబోమని ఘాటుగా హెచ్చరించారు. కృష్ణాజలాల్లో తెలంగాణ వాటాను తేల్చకుండా కేంద్రప్రభుత్వం చోద్యం […]
సారథి న్యూస్, రామడుగు: తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే అక్కడక్కడా ఎమ్మెల్యేలు, లీడర్లు వచ్చే వరకు పంపిణీ ప్రారంభించడం లేదు. దీంతో మహిళలు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తున్నది. శనివారం కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో చీరల పంపిణీ చేపట్టారు. ఉదయం 10గంటలకు చీరల పంపిణీ కార్యక్రమం ఉండగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మధ్యాహ్నం 12 గంటలైనా రాక పోవటంతో పంపిణీ కార్యక్రమం ఆలస్యమైంది. దీంతో మహిళలు […]
సారథి న్యూస్, శ్రీకాకుళం(సీతంపేట): సీతంపేట ఐటీడీఏలో ఏర్పాటుచేసిన అటవీహక్కు(ఆర్వోఎఫ్ఆర్ పట్టాల) పత్రాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ హాజరయ్యారు. ఆయన పాలకొండ ఎమ్మెల్యే కళావతి, ఐటీడీఏ పీవో శ్రీధర్ ఘనస్వాగతం పలికారు. గాంధీ జయంతి సందర్భంగా తొలుత గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఐటీడీఏ ప్రాంగణంలో జీసీసీ ఏర్పాటుచేసిన వివిధ స్టాళ్లను మంత్రి పరిశీలించారు. కార్యక్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారాం, పశుసంవర్ధకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, కలెక్టర్ జే.నివాస్, […]
కర్నూలు జిల్లాలో భారీవర్షం నంద్యాల డివిజన్‌లో 93.88 మి.మీ. వర్షపాతం పొంగిన నదులు, వాగులు, వంకలు మునిగిన లోతట్టు ప్రాంతాలు, కాలనీలు ప్రజలను కాపాడిన అగ్నిమాపక సిబ్బంది సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు జిల్లాలో శనివారం భారీవర్షం కురిసింది. కుండపోత వాన కురవడంతో లోతట్టు, నది పరీవాహక ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహించాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం అర్ధరాత్రి వరకు వాన కురుస్తూనే ఉంది. జిల్లాలోని కుందూ, హంద్రీ, శ్యాంనదులు […]
సారథి న్యూస్, కర్నూలు: అనంతపురం జిల్లాలో శుక్రవారం జరిగిన ఎస్సైల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమం ముగించుకుని తిరిగి హైదరాబాద్ కు వెళ్తున్న ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్థానిక కర్నూలు ‘బి’ క్యాంపులోని పోలీసు గెస్ట్‌ను సందర్శించారు. ఆయన జిల్లా ఉన్నతాధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. అక్కడి నుంచి ఆయన హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. డీజీపీని కలిసిన వారిలో కర్నూలు రేంజ్ డీఐజీ పి.వెంకటరామిరెడ్డి, కలెక్టర్ జి.వీరపాండియన్, కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప, జేసీ రవిపట్టాన్ […]
ప్రముఖ నటి రకుల్ ప్రీత్‌సింగ్ శుక్రవారం ఎన్సీబీ ఎదుట హాజరైన విషయం తెలిసిందే. ఆమెను సుమారు 4 గంటలపాటు ఎన్సీబీ అధికారులు ప్రశ్నించారు. అయితే చాలా ప్రశ్నలకు రకుల్ తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అంటూ సమాధానం చెప్పిందట దీంతో అధికారులు షాక్‌కు గురయ్యారని సమాచారం. మరోవైపు రియాతో రకుల్ చాట్చేసినట్టు ఎన్సీబీకి కీలక ఆధారాలు లభించాయి. దీంతో చాటింగ్ కు సంబంధించిన స్క్రీన్షాట్లను వారు రకుల్‌కు చూపించినట్టు టాక్. అయితే తాను రియాతో డ్రగ్స్‌కు గురించి చాటింగ్ […]
ఏర్పాట్లకు పూర్తిస్థాయిలో సహకరిస్తాం ఎమ్మెల్యేకు హామీ ఇచ్చిన జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అనిల్‌యాదవ్ సారథి న్యూస్, కర్నూలు: పన్నెండేళ్లకోసారి వచ్చే తుంగభద్ర పుష్కరాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని, అందుకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కర్నూలు నగర ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్‌కు హామీ ఇచ్చారు. శుక్రవారం అమరావతిలో నగర ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా […]