సారథి న్యూస్, పోలాకి(శ్రీకాకుళం): వంశధార ప్రాజెక్టు త్వరలోనే పూర్తిచేస్తామని, అన్నదాతలను అన్నిరకాలుగా ఆదుకుంటామని, శ్రీకాకుళం జిల్లా స్థితిగతులు, రూపురేఖలను సమూలంగా మార్చుతామని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ప్రజాసంకల్పయాత్రకు మూడేళ్లు పూర్తి కావడంతో ప్రజల కోసం నాడు.. ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా గురువారం 7వ రోజు సంఘీభావ యాత్రలో పాల్గొన్నారు. పోలాకి మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం నుంచి ఎంపీడీవో ఆఫీసు వరకు చేపట్టిన యాత్రను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన […]
సారథి న్యూస్, పాలకొండ(శ్రీకాకుళం): రాష్ట్రంలో రైతును రాజుగా చేయాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దృఢసంకల్పంతో ఉన్నారని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా పాలకొండలో చెరుకు రైతుల అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఇది రైతన్నల ప్రభుత్వమని, విద్య, వైద్యం, వ్యయసాయం, సంక్షేమాలపై ప్రత్యేకశ్రద్ధ వహిస్తుందన్నారు. రైతుభరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన ఎరువులు, నాణ్యమైన విత్తనాలను సరఫరా చేస్తున్నామని వివరించారు. జిల్లాలో చెరుకు పంట విస్తీర్ణం పెంచాలన్నారు. తద్వారా చెరుకు ఫ్యాక్టరీ […]
సారథి న్యూస్, శ్రీకాకుళం(సీతంపేట): సీతంపేట ఐటీడీఏలో ఏర్పాటుచేసిన అటవీహక్కు(ఆర్వోఎఫ్ఆర్ పట్టాల) పత్రాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ హాజరయ్యారు. ఆయన పాలకొండ ఎమ్మెల్యే కళావతి, ఐటీడీఏ పీవో శ్రీధర్ ఘనస్వాగతం పలికారు. గాంధీ జయంతి సందర్భంగా తొలుత గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఐటీడీఏ ప్రాంగణంలో జీసీసీ ఏర్పాటుచేసిన వివిధ స్టాళ్లను మంత్రి పరిశీలించారు. కార్యక్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారాం, పశుసంవర్ధకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, కలెక్టర్ జే.నివాస్, […]