సారథి న్యూస్, కర్నూలు: ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్‌లో దళిత యువతిపై దారుణానికి పాల్పడిన మానవమృగాలను వెంటనే ఉరితీయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ నాయకులు, ప్రజాసంఘాల నాయకులు చేపట్టిన కొవ్వొత్తుల ర్యాలీలో కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పాల్గొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
దుబాయ్: ఐపీఎల్13 సీజన్లో భాగంగా దుబాయ్ వేదికగా శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో అత్యంత ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన హైదరాబాద్ బ్యాటింగ్ ఎంచుకుంది. చెన్నైకి 165 టార్గెట్ విసిరింది. చివరి ఓవర్లలో ప్రియమ్ గార్గ్ తనదైన బ్యాటింగ్, మెరుపు షాట్లతో మెరిపించాడు. హైదరాబాద్ బ్యాట్స్మెన్లు వార్నర్ 28(29), ఎంకే పాండే 29(21), ప్రియమ్ గార్గ్ 51(26), అభిషేక్ శర్మ 31( 24) […]
సారథి న్యూస్, శ్రీశైలం/ కర్నూలు: దశాబ్దాల కాలం నుంచి పెండింగ్‌లో ఉన్న గిరిజన భూముల భూవివాదాలకు ఆస్కారం లేకుండా అటవీహక్కుల చట్టం మేరకు ఆర్‌వోఎఫ్‌ఆర్ కింద రాష్ట్రంలో 1.53 లక్షల మంది గిరిజన రైతులకు 3.12లక్షల ఎకరాల భూమిపై హక్కు పత్రాలను పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అడవులు, కొండ ప్రాంతాల్లో వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న గిరిజన రైతుకు […]
సారథి న్యూస్, శ్రీశైలం/కర్నూలు: జాతిపిత మహాత్మాగాంధీ ఆశయసిద్ధి కోసం సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బాటు వేశారని, అందుకు వలంటీర్ల వ్యవస్థను నిదర్శంగా భావించవచ్చని కలెక్టర్ జి.వీరపాండియన్ అన్నారు. శుక్రవారం గాంధీ జయంతిని పురస్కరించకుని సున్నిపెంటలోని గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళుర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని గిరిపుత్రులకు భూమి హక్కు కల్పించేలా సీఎం నిర్ణయం తీసుకోవడంతో పాటు భూమిహక్కు పత్రాల పంపిణీకి శ్రీకారం చుట్టడం […]
సారథి న్యూస్, వెల్దండ: నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో నూతన నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్(అంబేద్కర్ భవనం)ను కల్వకుర్తి ఎమ్మెల్యే జి.జైపాల్ యాదవ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బడుగు బలహీనవర్గాలు, అగ్రవర్ణాల్లోని పేదలకు ఎన్నో అవకాశాలు కల్పించేలా కష్టపడి రాజ్యాంగ రచన చేశారని కొనియాడారు. ఆయన ఆశయాలు ప్రతిఒక్కరికీ ఆదర్శమన్నారు. ఆయన కలలను సాకారం చేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్తెలంగాణకు సీఎం కావడం వరమన్నారు. పేదలు, […]
సారథి న్యూస్, కల్వకుర్తి: ఉత్తర ప్రదేశ్ లోని హత్రాస్ గ్రామానికి చెందిన 19 ఏళ్ల దళిత యువతిపై జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ.. దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ.. శుక్రవారం సాయంత్రం నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో యువజన, ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ ఆఫీసు నుంచి మహబూబ్‌నగర్ చౌరస్తా మీదుగా హైదరాబాద్ చౌరస్తా వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్‌లో దళిత మహిళలపై వరుసగా […]
దుబాయ్: ఐపీఎల్ 13 సీజన్లో భాగంగా దుబాయ్ వేదికగా చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ హైదరాబాద్ సన్‌రైజర్స్164 పరుగులు చేసింది. చివరిలో ప్రియమ్ గార్గ్ తనదైన బ్యాటింగ్, మెరుపు షాట్లతో మైమరిపించాడు. హైదరాబాద్ బ్యాట్స్మెన్లు వార్నర్ 28(29), ఎంకే పాండే 29(21), ప్రియమ్ గార్గ్ 51(26), అభిషేక్ శర్మ31( 24) పరుగులు చేశారు. ఇక చెన్నై బౌలర్లు డీఎల్ చాహర్ రెండు, ఎస్ఎన్ ఠాకుర్ ఒకటి, పీపీ చావ్లా ఒకటి చొప్పున వికెట్లు తీశారు. తొలుత టాస్ […]
సారథి న్యూస్, హైదరాబాద్: దేశవ్యాప్తంగా జాతిపిత మహాత్మాగాంధీ 151వ జయంతి వేడుకలు ఘనంగా శుక్రవారం జరిగాయి. అందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం సైతం వేడుకలను ఘనంగా నిర్వహించింది. లంగర్ హౌస్ లోని బాపు ఘాట్ వద్ద మహాత్ముడి విగ్రహానికి గవర్నర్ తమిళ సై సౌందర్య రాజన్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సర్వమత ప్రార్థనలో పాల్గొన్నారు. కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, […]