-ఆత్మీయ సమ్మేళనం లో భారీగా కాంగ్రెస్ నేతలు
సామాజిక సారధి , నాగర్ కర్నూల్: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇటీవల కాలంలోనే రాష్ట్ర నేతలతో కలిసి ఢిల్లీ ముఖ్య నేతలతో కలిసి డాక్టర్ రాజేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఈనెల 20వ తేదీన చేరటంపై నాగర్ కర్నూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జోష్ పెరిగింది . ఈనెల 20వ తేదీన కొల్లాపూర్ లో ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభకు కార్యకర్తలను తరలించేందుకు ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి , వారి కుమారుడు డాక్టర్ రాజేష్ రెడ్డి తో కలిసి తెలకపల్లి మండలం కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో శుక్రవారం గ్రామాల నుండి భారీగా కార్యకర్తలు సమావేశానికి హాజరయ్యారు . అక్కడికి వచ్చిన కార్యకర్తలు డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి నాయకత్వంపై జేజేలు కొట్టారు . భారీగా కార్యకర్తలు సమావేశంలోని కేకులు కట్ చేసి యువ నాయకుడైన డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి కి పోటీలో నిలిపితే గెలిపించే బాధ్యత తమలాంటి కార్యకర్తలు అందరిపై ఉన్నదని జై రాజేష్ జై జై రాజేష్ అంటూ హంగామా చేశారు . సమావేశాన్ని ఉద్దేశించి ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి , వారి తనయుడు డాక్టర్ రాజేష్ రెడ్డి మాట్లాడుతూ తమ కుటుంబానికి ప్రజల మద్దతు ఎప్పుడూ ఉంటుందని రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కే పట్టాభిషేకం జరుగుతుందని అన్నారు . రాష్ట్రంలో మరో తొమ్మిది నెలల్లో ఎన్నికలు ఎప్పుడైనా జరగవచ్చునని కార్యకర్తలు కలిసికట్టుగా అందరు పనిచేసే నాయకత్వం కోరుకోవాలని వారు తెలిపారు . ఈనెల 20వ తేదీ జరిగే భారీ బహిరంగ సభకు కార్యకర్తల అధికంగా తరలిరావాలని కోరారు .
- July 14, 2023
- Top News
- మహబూబ్నగర్
- ముఖ్యమైన వార్తలు
- షార్ట్ న్యూస్
- TELANGANA
- తెలంగాణ
- Comments Off on తెలకపల్లి లో రాజేష్ కే జై కొట్టిన జనం