సామాజికసారథి మహబూబ్ నగర్ బ్యూరో : స్థానిక ఎంవీస్ ప్రభుత్వడిగ్రీ కళాశాల కామర్స్ విభాగాధిపతిగా ఉన్న డాక్టర్ ఎం.విజయ్ కుమార్ అసోసియేట్ ప్రొఫెసర్ గా పదోన్నతి పొందారు. తెలంగాణ రాష్ట్ర కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ నుంచి అసోసియేట్ ప్రొఫెసర్ గా ఉత్తర్వులు అందిన సందర్భంగా ఎంవీస్ కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థులు ఆయనకు అభినందనలు తెలిపారు. ప్రస్తుతం డాక్టర్ విజయ్ కుమార్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రీజనల్ కోఆర్డినేటర్ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
- January 27, 2023
- Archive
- Top News
- తెలంగాణ
- మహబూబ్నగర్
- ముఖ్యమైన వార్తలు
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- Assistant professor
- Dr.vijay Kumar
- MAHABUBNAGAR
- తెలంగాణ
- Comments Off on డా.విజయ్ కుమార్ కు అసోసియేట్ ప్రొఫెసర్ గా పదోన్నతి