Breaking News

షార్ట్ న్యూస్

వర్గీకరణ చేసి చట్టబద్దత కల్పించాలి

ఏమ్మార్పిస్ డిమాండ్ సామాజిక సారథి, మహాబూ నగర్ బ్యూరో : గత 28ఏళ్ళు గా వర్గీకరణ కోసం ఎమ్మార్పిఎస్ ఆధ్వర్యంలో మాదిగ లు గల్లీ నుంచి డిల్లీ వరకు పోరాటాలు చేస్తున్నదని బిజెపి వర్గీకరణ ను బలపరుస్తూ తీర్మాణం చేసిందని దాన్ని వెంటనే అమలు చేయాలని ఎమ్మార్పి ఎస్ ఆందోళన చేట్టారు.బిజెపి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం లో రాష్టం కార్యవర్గ సమావేశం లో ఆపార్టీ నేతలకుమంగళవారం వినతిపత్రం ఇచ్చేందుకు ఆందోళన చేపట్టారు. కేంద్రం లో బిజెపి […]

Read More
‘సామాజిక సారథి’ అగ్రగామిగా నిలవాలి

‘సామాజిక సారథి’ అగ్రగామిగా నిలవాలి

సామాజికసారథి, రామకృష్ణాపూర్: మంచి వార్తలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తూ ‘సామాజిక సారథి’అగ్రగామిగా నిలుస్తుందని రామకృష్ణాపూర్ పట్టణ ఎస్సై బి.అశోక్ అన్నారు. ‘సామాజికసారథి’ తెలుగు దినపత్రిక 2023 నూతన సంవత్సర క్యాలెండర్ ను ప్రభుత్వ అధికారులు, వివిధ రాజకీయ నాయకులు, వర్తక, వాణిజ్య వ్యాపారస్తుల చేతులమీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో మీడియా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తుందని గుర్తుచేశారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం అధికారులు, ప్రజాప్రతినిధులకు సమాచారాన్ని చేరవేయడంలో మీడియా కీలకపాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.

Read More
కబ్జాకు గురవుతున్న చెరువులను కాపాడాలి

కబ్జాకు గురవుతున్న చెరువులను కాపాడాలి

సామాజికసారథి, రామకృష్ణాపూర్ (మంచిర్యాల): జిల్లాలో కబ్జాకు గురవుతున్న చెరువులను కాపాడాలని డీఈ భాస్కర్ కు ఐక్య విద్యార్థి సంఘాల అధ్వర్యంలో గురువారం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ పట్టణాలు అభివృద్ధి చెందుతున్న క్రమంలో భూముల విలువలు పెరగడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు విచ్చలవిడిగా శిఖం భూములు కబ్జాలు చేస్తూ అక్రమ వెంచర్లను ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. చెరువు శిఖాలలో జరుగుతున్న అక్రమ పనులను నిలిపివేసి […]

Read More
బాధిత కుటుంబానికి సాయం

బాధిత కుటుంబానికి రూ.5వేల సాయం

సామాజికసారథి, రామకృష్ణాపూర్: మందమర్రి మండల బొక్కలగుట్ట గ్రామానికి చెందిన గజ్జి రజలింగు ప్రమాదానికి గురై ఒక సంవత్సరం నుంచి మంచానికే పరిమితం అయ్యారు. విషయం తెలుసుకున్న నెన్నెల కొవిడ్ వాలంటరీస్ వ్యవస్థాపకుడు, సొపతి వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు ఉపాధ్యాయుడు జలంపెల్లి శ్రీనివాస్ దాతల సహకారంతో సేకరించిన రూ.5500ను బాధిత కుటుంబానికి గురువారం అందించారు.

Read More

సామాజికసారథి అగ్రభాగాన నిలవాలి

సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: పత్రికలు, మీడియా సంస్థలు ప్రజలు, ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండి ప్రజల సమస్యలను వెలికితీసి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని తెలంగాణ డెంటల్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తనయుడు డాక్టర్ కూచకుళ్ల రాజేశ్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన ‘సామాజికసారథి’తెలుగు దినపత్రిక క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాజమాన్యం, పాత్రికేయులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనుభవం కలిగిన పాత్రికేయ బృందంతో ‘సామాజికసారథి’దినపత్రిక సరికొత్త కథనాలు అందిస్తూ […]

Read More

కుల వృత్తులకు ప్రాధాన్యత కల్పించిందే కేసీఆర్ …

…. ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు మంగీ విజయ్సామాజిక సారధి , బిజినేపల్లి: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కుల వృత్తులకు ప్రాధాన్యత కల్పించిన ఘనత కెసిఆర్ కే దక్కిందని ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు మంగి విజయ్ అన్నారు . శుక్రవారం మండల కేంద్రంలోని బిజినాపల్లిలో యాదవుల సోదరులు తయారుచేసిన గొంగళ్లను వారు పరిశీలించారు . బీసీలలో అత్యధిక జనాభా గల కురువ యాదవుల సోదరులకు ఉచిత గొర్ల పంపిణీ తో పాటు వారు ఆర్థికంగా […]

Read More
వార్డు సభ్యుడిపై సర్పంచ్​ దాడి

సర్పంచ్​ బిల్లులు స్వాహా

సామాజికసారథి, బిజినేపల్లి: ప్రభుత్వం నుంచి పని వచ్చిందని, మున్ముందు గ్రామానికి అవసరం వస్తుందని అప్పుచేసి మరీ పనులు చేశారు. బిల్లులు రాకపోతాయా..? అని చకచకా పూర్తిచేశారు. అభివృద్ధి పనులు చేసింది ఒకరైతే బిల్లులు తెచ్చుకున్నది మరొకరు.. తీరా అధికారుల వద్దకు వెళ్లి ఆరాతీస్తే అస​లు విషయం బయటపడింది. రెండేళ్ల క్రితం ప్రభుత్వం రైతు వేదికలను మంజూరుచేసింది. నాగర్​ కర్నూల్​ జిల్లా బిజినేపల్లి మండలంలో ఓ గ్రామానికి చెందిన ఓ వార్డు సభ్యుడు ముందుగానే లక్షలాది రూపాయల అప్పుతెచ్చి […]

Read More
ఘనంగా కాంగ్రెస్​ ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా కాంగ్రెస్​ ఆవిర్భావ దినోత్సవం

  • December 29, 2022
  • Comments Off on ఘనంగా కాంగ్రెస్​ ఆవిర్భావ దినోత్సవం

సామాజికసారథి, రామకృష్ణాపూర్: కాంగ్రెస్ పార్టీ 138 వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం పట్టణంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పల్లె రాజు అధ్వర్యంలో పార్టీ జెండాను బుధవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రఘునాథ్ రెడ్డి, సీనియర్ నాయకులు రాంబాబు, రాజయ్య, దేవేందర్, రామకృష్ణ, భూమేష్, రవి తదితరులు పాల్గొన్నారు.

Read More