Breaking News

వనపర్తి శ్రీ చైతన్య స్కూల్ పై చర్యలు తీసుకోవాలిడీఈఓ కు విద్యార్థి సంఘాల ఫిర్యాదు

సామాజిక సారథి, వనపర్తి, బ్యూరో:

గవర్నమెంట్ రూల్స్ కు విరుద్దంగా సమ్మర్ హాలిడేస్ ముగియకుండానే స్కూల్ ను ఓపెన్ చేయడంతో పాటు ఇష్టమొచ్చిన రేట్లకు బుక్స్, నోట్ బుక్స్ అమ్ముతున్న వనపర్తి శ్రీచైతన్య స్కూల్ పై చర్యలు తీసుకోవాలని శనివారం వనపర్తి ఇంచార్జీ డీఈఓ గోవింద రాజులు కు పలు విద్యార్థి సంఘాల నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వనపర్తి జిల్లా కేంద్రంలోని చిట్యాల రోడ్ లో ఉన్న శ్రీచైతన్య స్కూల్ లో గవర్నమెంట్ రూల్స్ కు విరుద్దంగా పుస్తకాలు, నోట్ బుక్కులు అమ్మడమే కాకుండా వాళ్లు చెప్పిన రేట్లకు కొనుగోలు చేయాలని తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈ స్కూల్ లో అడ్మీషన్ ఫీజులు, స్కూల్ ఫీజులు, బుక్స్, నోట్ బుక్స్ ఫీజుల వివరాలు నోటీస్ బోర్డులో పేరెంట్స్ కు అందుబాటులో ఉంచకుండా ఇష్టమొచ్చిన రేట్లకు అమ్ముతున్నారు. గతేడాది ఉన్న ఫీజులకు అదనంగా ఈ విద్యాసంవత్సరం ఒక్కో తరగతికి రూ.2 వేల రూపాయలు అధనంగా వసూలు చేస్తున్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన వారికి నామమాత్రపు ఫీజుల వసూలు చేస్తున్నామని తప్పుడు సమాచారం ఇచ్చి స్కూల్ లో మాత్రం విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్నారు.
గతేడాది కూడా శ్రీచైతన్య హైస్కూల్ లో స్కూల్ లోనే బుక్స్, నోట్ బుక్స్, బెల్ట్ లు,బ్యాడ్జీలు అమ్ముతుండగా విద్యార్థి సంఘాలు ఆందోళన చేసినా వనపర్తి ఎంఈఓ శ్రీనివాస్ గౌడ్ పట్టించుకోకుండా స్కూల్ యాజమాన్యానికి అండగా ఉంటున్నారన్నారు.ఈ స్కూల్ లో తరగతి గదులు, టాయ్ లెట్లు అపరిశుభ్రంగా ఉండడంతో పాటు కిటికీలకు తలుపులు కూడా సక్రమంగా లేవన్నారు. వర్షాకాలంలో క్లాస్ రూంలోకి వర్షపు నీళ్లు వచ్చి చిత్తడిగా మారి స్టూడెంట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా స్కూల్ యాజమాన్యం పట్టించుకోవడం లేదన్నారు. ఈ స్కూల్ లో జర్నలిస్టుల పిల్లలకు అడ్మీషన్లు లేవని చెప్పడం విద్యాహక్కు చట్టానికి విరుద్దమని స్థానిక ఎంఈఓ కార్పోరేట్ స్కూళ్ల నుంచి కమీషన్లు తీసుకుంటూ వారికే సహకరిస్తున్నారని అన్నారు. ఈ స్కూల్ లో రూల్స్ కు విరుద్దంగా బుక్స్, నోట్ బుక్స్ అమ్ముతున్న విషయం పై తేది 02.06.2023 న సామాజిక సారథి తెలుగు దినపత్రికలో వచ్చిన పేపర్ క్లిప్పింగ్ ను పరిశీలించి విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. స్కూల్ ఆవరణతో పాటు వనపర్తి పట్టణంలోని లలిత పబ్లిక్ స్కూల్ కు దగ్గర ఓ ఇంటిలో స్టోర్ రూం ఏర్పాటు చేసి బుక్కులు , నోట్ బుక్కులు స్టాక్ పెట్టుకొని పుస్తకాలు అమ్ముతున్నారు. అధికారులు ఆ ఇంటిని పూర్తిగా పరిశీలించి స్కూల్ యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని డీఈఓ ను కోరారు. కార్యక్రమంలో వివిధ విద్యార్థి సంఘాల నాయకులు రాము, ఎన్.భరత్, సీతారాం, బీ.రాము, వంశీ పాల్గొన్నారు.