Breaking News

STUDENTS

అందరికీ అండగా ఉంటాం

అందరికీ అండగా ఉంటాం

సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: పటాన్ చెరువు మండలం ముత్తంగి బాలికల గురుకుల పాఠశాలను మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా సందర్శించారు. గురుకుల పాఠశాలలో నిన్న కరోనా కలకలం రేగిన విషయం తెలిసిందే. పాఠశాలలోని ఉపాధ్యాయురాలు పాటు 43 మందికి కరోనా పాజిటివ్ రావడంతో పాఠశాలను జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు,  పాఠశాల సిబ్బందితో మాట్లాడారు.  భయం భయం వద్దని, అందరికీ అండగా జిల్లా యంత్రాంగం […]

Read More
గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ వేధిస్తున్నారు.!

గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ వేధిస్తున్నారు.!

రాష్ట్ర కార్యదర్శి మల్లయ్య భట్టుకు ఫిర్యాదు విచారణకై పోలీసులకు ఆదేశం సామాజిక సారథి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ గత కొంతకాలంగా విద్యార్థినిల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ, వేధిస్తున్నారని బీసీ గురుకుల రాష్ట్ర కార్యదర్శి మల్లయ్య భట్టుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. బీసీ గురుకుల రాష్ట్ర కార్యదర్శి మల్లయ్య భట్టు సోమవారం పట్టణంలోని మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాలను సందర్శించి వసతులు, విద్యాబోధన, […]

Read More
వైరాలో కదంతొక్కిన విద్యార్థులు

వైరాలో కదంతొక్కిన విద్యార్థులు

సామాజిక సారథి‌, వైరా:  సచివాలయాలు,  దేవాలయాలకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న సీఎం కేసీఆర్  పేద విద్యార్థులకు బాకీ పడ్డ బోధనా రుసుము ఉపకార వేతనాల చెల్లింపుకు సంవత్సరాలుగా నిధులు ఎందుకు విడుదల చేయడం లేదని పీడీఎస్యూ  అధ్యక్షుడు ఎం.అజాద్ ప్రశ్నించారు. ఖమ్మం జిల్లా వైరాలో శుక్రవారం పీడీఎస్ యూ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆజాద్ మాట్లాడుతూ కొవిడ్ […]

Read More
హైస్కూల్ లో కరోనా కలకలం

హైస్కూల్ లో కరోనా కలకలం

సామాజిక సారథి‌, ఖమ్మం: ఖమ్మం జిల్లా చింతకాని జడ్పీ హైస్కూల్లో కరోనా కలకలం సృష్టించింది. బుధవారం పాఠశాలలోని 100మంది విద్యార్థులకు కరోనా టెస్టులు చేయగా ఐదుగురికి పాజిటివ్ నిర్ధారణ అయింది. పదోతరగతిలో ఇద్దరికి, 6,8,9 తరగతులకు చెందిన ఒక్కొక్కరికి కరోనా పాజిటివ్ నిర్ధారణయిందని వైద్య సిబ్బంది తెలిపారు.

Read More
సైబర్ నేరాలతో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి

సైబర్ నేరాలతో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి

సామాజిక సారథి, సిద్దిపేట:  సైబర్ నేరాల పట్ల విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని ఎస్సై శ్వేతా అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం సైబర్ అంబాసిడర్ కార్యక్రమం పేరుతో పాఠశాలల్లోని విద్యార్థులకు అవగాహన కల్పించారు. తల్లిదండ్రులు విద్యార్థులకు సెల్ ఫోన్ ఇవ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో సైబర్ సెక్యూరిటీ, ఆన్ లైన్ నేరాలు, మాట్రిమోనియల్ ఫ్రాడ్స్, ఫిష్ క్యాచింగ్, లాటరీ స్కాంలు రోజురోజుకు పెరుగుతున్నాయని వాటి బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవా విద్యార్థులకు సూచించారు. ఈ […]

Read More

తరగతులు ఆన్​లైన్​లో.. పిల్లలు కూలీపనుల్లో

సారథిన్యూస్​, గద్వాల: రాష్ట్ర విద్యాశాఖ విద్యార్థులకు ఆన్​లైన్​లో పాఠాలు బోధిస్తున్నామని చెబుతుండగా.. కొందరు విద్యార్థులు మాత్రం కూలీ పనులకు వెళ్తున్నారు. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం ఆన్​లైన్​ పాఠాలు ప్రారంభించింది. అయినప్పటికి విద్యార్థులకు సరైన గైడెన్స్​ ఇచ్చేవారు లేక వారు యథావిధిగా పొలంపనులకు వెళ్తున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో విద్యార్థులు ఓ వాహనంలో ఇలా కూలిపనులకు వెళ్తున్నారు.

Read More

ఆన్​లైన్​ పాఠాలు ప్రారంభం

సారథిన్యూస్, రామడుగు: కరోనా విలయతాండవం చేస్తున్న ప్రస్తుత తరుణంలో విద్యార్థుల చదువు భారంగా మారింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సెప్టెంబర్ 1 నుంచి టీ శాట్- దూరదర్శన్ ద్వారా విద్యార్థులకు విద్యాబోధన అందిస్తుంది. మంగళవారం తొలిరోజు విద్యార్థులకు టీవీ పాఠాలు ప్రారంభమయ్యాయి. కరీంనగర్​ జిల్లా రామడుగు మండలకేంద్రంలోని వివిధ గ్రామాల్లో విద్యార్థులు టీవీల ముందు కుర్చొని పాఠాలు విన్నారు. కానీ సిగ్నల్​ లేకపోవడం, పవర్​పోవడం వంటి సమస్యలు తలెత్తాయి.

Read More
ఇంటర్​ మెమోలు వచ్చేశాయి

ఇంటర్​​ మెమోలు వచ్చేశాయి

సారథిన్యూస్​, హైదరాబాద్​: కరోనా సంక్షోభం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్​ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్​ బోర్డు ఫెయిల్​ అయిన విద్యార్థులకు కనీస పాస్​మార్కులు (35 శాతం) వేసి కంపార్ట్​మెంటల్​లో పాస్​చేసింది. విద్యార్థులందరినీ పాస్​చేస్తామని సీఎం కేసీఆర్​ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,50,941 మంది విద్యార్థులను పాస్​చేసినట్టు ఇంటర్​ బోర్డు కార్యదర్శి శుక్రవారం ప్రకటించారు. విద్యార్థులు ఈ నెల 31వ తేదీ (శుక్రవారం) మధ్యాహ్నం 2 […]

Read More