Breaking News

SANGAREDDY

ధాన్యం కొనుగోలు కేంద్రాలపై కాన్ఫరెన్స్

ధాన్యం కొనుగోలు కేంద్రాలపై కాన్ఫరెన్స్

ఈనెల 31లోగా ఆధార్ అనుసంధానం దళిత బంధు ధరణిపై ప్రత్యేక శ్రద్ధ కలెక్టర్ శరత్ సామాజిక సారథి సంగారెడ్డి ప్రతినిధి: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించినట్లు సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయం నుంచి జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి కొనుగోలు కేంద్రాలు, పోడు భూములు, ఆధార్ అనుసంధానం, ధరణి తదితర విషయాలపై ప్రత్యేక […]

Read More
ఉచిత హోమియో వైద్య శిబిరం

ఉచిత హోమియో వైద్య శిబిరం

సామాజిక సారథి, సంగారెడ్డి: సంగారెడ్డి వాసవీ క్లబ్స్  ఆధ్వర్యంలో పట్టణంలోని ఫ్రై డే మార్కెట్ మానిక్ ప్రభు మందిరంలో ఉచిత హోమియోపతి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఎం.ఎం.ఆర్  వైద్యశాల సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వాసవీ క్లబ్ ప్రతినిధులు చంద శ్రీధర్, ఇరుకుల్లా ప్రదీప్, కొంపల్లి విద్యాసాగర్, కటకం శ్రీనివాస్, చిలమకూరి నరేంద్ర, నామ శ్రీనివాస్ , నామ భాస్కర్, పుట్నాల లక్ష్మణ్,  వెంకటేశం, మధుసూదన్, వాసవీ సభ్యులు, ఎం.ఎం.ఆర్.  వైద్య బృందం,  తదితరులు పాల్గొన్నారు.

Read More
25 వరకు పల్స్ పోలియో

25 వరకు పల్స్ పోలియో

సామాజిక సారథి, సంగారెడ్డి:  సంగారెడ్డి జిల్లాలో జనవరి 23 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ రాజర్షి షా సంబంధిత శాఖల అధికారులను కోరారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజర్షి షా అధ్యక్షతన వైద్య ఆరోగ్య శాఖ , అనుబంధ శాఖలతో జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజర్షి మాట్లాడుతూ ఈ […]

Read More
రాంగ్ రూట్ లో వెళ్లి సజీవదహనం

రాంగ్ రూట్ లో వెళ్లి సజీవదహనం

పెట్రోల్ ట్యాంక్ పగిలి ఇద్దరు సజీవదహనం సామాజిక సారథి, మెదక్‌: బైక్‌ గుంటలో పడి మంటలు చెలరేగడంతో ఇద్దరు సజీవదహనమయ్యారు. ఈ సంఘటన మెదక్‌ జిల్లా టేక్మాల్‌ మండలం బొడ్మట్‌ పల్లిలో శివారులో చోటుచేసుకుంది. నారాయణ్‌ ఖేడ్‌ మండలం మంగల్‌ పేట్‌ గ్రామానికి చెందిన దత్తు(23), వాసుదేవ్‌లు బైక్ పై సంగారెడ్డికి వెళ్తున్నారు. బొడ్మట్‌ పల్లి సమీపంలో రాంగ్‌ రూట్‌లో వెళుతుండగా, బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ కోసం తవ్విన గుంటలో పడ్డారు. ఈ ప్రమాదంలో పెట్రోల్‌ ట్యాంక్‌ […]

Read More
అంతర్జాతీయ ఉపాధ్యక్షుడిగా శ్రీధర్

అంతర్జాతీయ ఉపాధ్యక్షుడిగా శ్రీధర్

సామాజిక సారథి, సంగారెడ్డి:  వాసవీ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఉపాధ్యక్షులుగా 2022 వ సేవ సంవత్సరానికి సంగారెడ్డి పట్టణానికి చెందిన చంద శ్రీధర్ ఎన్నికయ్యారు. విజయవాడ పట్టణంలో ఆదివారం జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన చంద శ్రీధరతో  అంతర్జాతీయ అద్యక్షలు పాత సుదర్శన్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్బంగా వాసవి క్లబ్ జిల్లా ప్రతినిధులు చంద శ్రీధర్ ను అభినందించారు.

Read More
కూచిపూడి ఐశ్వర్యం

కూచిపూడి ఐశ్వర్యం

చిన్న వయసులోనే పెద్ద ప్రదర్శనలు కరోనా సమయంలోనూ నృత్యంలో ట్రైనింగ్ ఆసక్తి నుంచి అభిరుచి వైపు అడుగులు ఎన్నో రివార్డులు, అవార్డులు ఆమెకే సొంతం సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: కరోనా లాక్ డౌన్ సమయంలో కూచిపూడి నృత్యం నేర్చుకుని ఎన్నో అవార్డులు సాధించి అందిరిచేత శభాష్ అనుపించుకుంటోంది. రెండేళ్ల నుంచి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి ప్రశంసలు పొందుతోంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం డివిజన్​లోని కొత్తపేటకు చెందిన వేదపల్లి దీపిక, సన్నీ దంపతుల కుమార్తె ఐశ్వర్య కూచిపూడిపై […]

Read More
‘డబుల్’ గుడ్న్యూస్!

‘డబుల్’ గుడ్​న్యూస్!

​ ఇళ్ల ప్రారంభోత్సవానికి అధికార యంత్రాంగం సన్నాహాలు అర్హుల జాబితా వెల్లడికి నిర్ణయం సంగారెడ్డి జిల్లాలో 1,367 ఇళ్లు సిద్ధం సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: పేదల ఇంటి కలను సహకారం చేసేందుకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి జిల్లా అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. జిల్లావ్యాప్తంగా అందోల్, నారాయణఖేడ్, జహీరాబాద్, సంగారెడ్డి నియోజకవర్గాల పరిధిలో 1,367 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు ఇప్పటికే పూర్తయ్యాయి. […]

Read More
కలెక్టర్ విరాళం

కలెక్టర్ విరాళం

సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: సాయుధ దళాల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ చేయూతనందించాలని  జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా కోరారు. సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా మంగళవారం కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో ఆయన తన వంతు విరాళం అందజేసి సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రక్షణకు, భారత ప్రజల సుఖశాంతుల కొరకు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పని చేస్తున్న భారత త్రివిధ దళాల సేవలు […]

Read More