Breaking News

Day: November 30, 2021

సాహితి లెజెండ్ "సిరివెన్నెల" ఇకలేరు

సాహితి లెజెండ్ “సిరివెన్నెల” ఇకలేరు

సామాజిక సారథి, హైదరాబాద్:  సరస్వతీ పుత్రుడు, సాహితీవేత్త సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇక లేరన్న వార్త, సినీ ఇండస్ట్రీలో తీవ్రవిషాదం నెలకొంది. ఆయన పాటే శ్వాసగా జీవిస్తూ వెండితెరమీద సిరివెన్నెల కురిపించిన మహానుభావుడు. మాట, పాటల మాంత్రికుడు వేలాది పాటలు రాసి జన హృదయాలను దోచుకున్న ప్రజాకవి అంటూ సామాజిక మాధ్యమాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అభిమానులు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. ఆయన మృతి సాహితి, సాంస్కృతిక రంగానికి తీరనిలోటని సినీ ప్రముఖులు, నటులు, తారలు, ఆర్టిస్టులు, కుటుంబానికి ప్రగాఢ […]

Read More
మోడీ, కేసీఆర్లకు ప్రజలే గుణపాఠం చెబుతారు..

మోడీ, కేసీఆర్​లకు ప్రజలే గుణపాఠం చెబుతారు..

సాగుచట్టాల రద్దు కాంగ్రెస్‌ విజయం: పొన్నాల సామాజిక సారథి, హైదరాబాద్‌: మదమెక్కిన ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్‌లకు ప్రజలే గుణపాఠం చెబుతారని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు.  సలహాలు తీసుకోకుండా నూతన వ్యవసాయ చట్టాల ఆర్డినెన్స్‌ను మోడీ తెచ్చారని ఆయన ఆరోపించారు. వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకోవాలని రాహుల్ గాంధీ  ముందే చెప్పారని ఆయన పేర్కొన్నారు. సాగుచట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవడం రైతులు, కాంగ్రెస్‌ విజయమన్నారు. గోదాముల్లో బియ్యం నిల్వలు ఉంటే కేంద్ర వ్యవసాయ […]

Read More
బీజేపీ ఘోర వైఫల్యం

బీజేపీ ఘోర వైఫల్యం

రైతులను చంపిన దుర్మార్గమైన ప్రభుత్వం మతఘర్షణలతో పబ్బం గడిపే ఉన్మాదులు ఇంత దిగజారిన కేంద్ర ప్రభుత్వాన్ని చూడలేదు సాగనంపకుంటే శంకరగిరి మాన్యాలే కేంద్రమంత్రి కిషన్​రెడ్డి ఓ దద్దమ్మ యాసంగిలో కొనుగోలు కేంద్రాలు బంద్‌ కేబినెట్‌ భేటీ అనంతరం మీడియాతో సీఎం కేసీఆర్​ సామాజిక సారథి, హైదరాబాద్‌: పాలనారంగంలో అనేక వైఫల్యాలను మూటగట్టుకున్న బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపాల్సిందేనని సీఎం కేసీఆర్​ఉద్ఘాటించారు. ఈ ప్రభుత్వం అన్నిరంగాల్లో విఫలమైందన్నారు. దేశంలో ఆహారభద్రత కొరవడిందని, ఆహారసూచీలో ఇతర దేశాలతో వెనకబడిందన్నారు. కేంద్రం తీరువల్ల […]

Read More
సౌతాఫ్రికా టు హైదరాబాద్‌

సౌతాఫ్రికా టు హైదరాబాద్‌

11 మంది ప్రయాణికులకు కరోనా పాజిటివ్‌ ప్రత్యేక పర్యవేక్షణలో ట్రీట్​మెంట్​ సామాజిక సారథి, హైదరాబాద్‌: సౌతాఫ్రికా నుంచి హైదరాబాద్‌కు మూడు రోజుల్లో 185 మంది ప్రయాణికులు వచ్చారు. నవంబర్‌ 25, 26, 27 తేదీల్లో హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌తో వణికిపోతున్న బోట్స్‌వానా నుంచి 16 మంది వచ్చారు. దీంతో చాలామంది భయపడుతున్నారు. అంతేకాకుండా కరోనా కొత్త వేరియెంట్‌ కేసులున్న 12 దేశాల నుంచి వచ్చిన వారు కూడా ఇందులో ఉన్నారు. హైదరాబాద్‌కు వచ్చిన […]

Read More
ఢిల్లీలో కాలుష్యంపై సుప్రీం ఆందోళన

ఢిల్లీలో కాలుష్యంపై సుప్రీం ఆందోళన

సెంట్రల్‌ విస్టా పనులు కొనసాగడంపై ఆగ్రహం ప్రభుత్వాన్ని వివరణ కోరుతామన్న చీఫ్‌ జస్టిస్‌ రమణ న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో భవన నిర్మాణ కార్యకలాపాలపై నిషేధం విధించినప్పటికీ సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టు పనులు కొనసాగుతుండటంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. దీనిపై కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరుతామని తెలిపింది. తాజాగా గాలి కాలుష్యం స్థాయి 419 అని, ఇది రోజు రోజుకూ పెరుగుతోందని తెలిపింది. ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా భారత […]

Read More
12 మంది ఎంపీల సస్పెన్షన్

రాజ్యసభలో 12 ఎంపీలపై సస్పెన్షన్​ వేటు

న్యూఢిల్లీ: వివాదాస్పద సాగు చట్టాల రద్దు బిల్లుకు రాజ్యసభ కూడా సోమవారం ఆమోదం తెలిపింది. అంతకుముందు ఈ బిల్లును లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. దీంతో పార్లమెంట్‌ తొలిరోజే సాగుచట్టాల రద్దు వ్యవహారం ముగిసింది. ఇక రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదమే మిగిలింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ జరగాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఈ బిల్లుకు లోక్‌సభ, రాజ్యసభ ఆమోదం లభించడంతో, దీనిని రాష్ట్రపతి […]

Read More
రైతులపై మోడీ ప్రభుత్వం వివక్ష

రైతులపై మోడీ ప్రభుత్వం వివక్ష

ధాన్యం సేకరణలో జాతీయ విధానం తీసుకురావాలి: కేకే గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్​ఎంపీల నిరసన ప్రదర్శన న్యూఢిల్లీ: ధాన్యం సేకరణపై కేంద్రం జాతీయ పాలసీ తీసుకురావాలని టీఆర్‌ఎస్‌ రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు డిమాండ్‌ చేశారు. తెలంగాణ రైతులపై ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎఫ్‌సీఐ ధాన్యం సేకరణతో రైతులకు భద్రత ఉంటుందని, తెలంగాణలో పండిన ధాన్యాన్ని తీసుకోవాలని ఎన్నిసార్లు కోరినా కేంద్రం పట్టించుకోలేదని దుయ్యబట్టారు. పార్లమెంట్‌ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద […]

Read More
హాస్టళ్లలో జాగ్రత్తగా ఉండాలి

హాస్టళ్లలో జాగ్రత్తగా ఉండాలి

కరోనా నిలకడగానే ఉంది మూడో దశ ముప్పుపట్ల అప్రమత్తంగా ఉండాలి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సామాజిక సారథి, హైదరాబాద్‌: కరోనా విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. పాఠశాలల్లో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో మంత్రి సోమవారం కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో సమావేశమయ్యారు. విద్యాసంస్థల్లో ఎవరికి వారు కొవిడ్‌ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించడం, భౌతిక దూరం, […]

Read More