ప్రభుత్వం వద్ద ఎలాంటి రికార్డుల్లేవ్ ఢిల్లీ సరిహద్దుల్లో చనిపోయిన వారికి నష్టపరిహారం ఇవ్వలేం కేంద్రమంత్రి తోమర్ స్పష్టీకరణ కేంద్ర ప్రభుత్వం ‘లెక్క తప్పంది’ కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిపాటు జరిగిన ఆందోళనల్లో రైతులు మరణించిన దాఖలాలు లేవని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ అన్నారు. మరణించిన 750 మంది రైతులకు ఆర్థిక సాయం అందించడం కుదరదని కేంద్రప్రభుత్వం స్పష్టంచేసింది. ఆందోళనల్లో మరణించిన రైతులకు రూ.25లక్షల చొప్పున ఆర్థిక సాయం […]
సామాజిక సారథి, నాగర్‌కర్నూల్ ప్రతినిధి: ప్రముఖ నటుడు ఆర్.నారాయణమూర్తి తెరకెక్కించిన రైతన్న సినిమాను బుధవారం ఉదయం నాగర్‌కర్నూల్‌లోని రామకృష్ణ టాకీస్ లో ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి తిలకించారు. రైతన్నలు ఎదుర్కొంటున్న కష్టాలు, బాధలను మూర్తన్న చాలా బాగా ఆవిష్కరించారని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రైతుల నేపథ్యంలో వచ్చిన ఇలాంటి చిత్రాలను మనమంతా ఆదరించాలి, ఆశీర్వదించాలి, అఖండ విజయం అందించాలి. అది మన బాధ్యత’ అని గుర్తుచేశారు. మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని తెలిసి కూడా […]
ఇంటింటికీ బీఎస్పీ.. గడపగడపకు ఏనుగు ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం.. సమస్యలపై నిలదీస్తాం బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు కొత్తపల్లి కుమార్ ‘సామాజిక సారథి’తో చిట్‌చాట్ సామాజిక సారథి, నాగర్‌కర్నూల్ ప్రతినిధి: ఇంటింటికీ బహుజన్సమాజ్పార్టీని తీసుకెళ్లడంతో పాటు గడపగడపకు ఏనుగు గుర్తును మోసుకెళ్తామని ఆ పార్టీ నాగర్‌కర్నూల్‌జిల్లా ఉపాధ్యక్షుడు కొత్తపల్లి కుమార్చెబుతున్నారు. ప్రజల పక్షాల నిలబడతామని భరోసా కల్పిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కందనూలు గడ్డపై నీలిజెండాను ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ‘ఓటు హమారా.. సీటు తుమ్హరా.. నలే ఛలేగా’ […]
సామాజిక సారథి, నల్లగొండ ప్రతినిధి: ఆరేళ్ల సర్వీస్ఉండగానే తన అత్యున్నత ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయ రంగప్రవేశం చేశారు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్. అన్నివర్గాలను సమస్యలను తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆటోడ్రైవర్లు, చేతివృత్తులవారు, చేనేత కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు.. ఇలా అందరి బాధసాధకాలను తెలుసుకుంటున్నారు. వారందరినీ పేదరికంలో పెట్టివేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్నారు. 70 ఏళ్లలో అన్ని వర్గాలు అభివృద్ధికి దూరమైన తీరును గుర్తుచేస్తూనే.. బహుజన రాజ్యం ఆవశ్యకతను వివరిస్తున్నారు. తాజాగా […]
సామాజిక సారథి, హైదరాబాద్ ప్రతినిధి: పాస్‌లు ఉంటేనే ఇతరులను విద్యాసంస్థలు, యూనివర్సిటీల్లోకి అనుమతించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ నిర్ణయంపై బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ స్పందించారు. ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. నియంతల మాదిరిగా వ్యవహరించవద్దని హితవు పలికారు.‘‘కొన్నిరోజుల క్రితం నేను విద్యార్థి,నిరుద్యోగుల సమస్యను అర్థంచేసుకుందామని చిక్కడపల్లి, ఓయూ లైబ్రరీలకు పోయి విద్యార్థులతో మాట్లాడిన(రాజకీయం కోసం కాదు). అంతే! ఇప్పుడు పాస్ ఉంటేనే ‘ఇతరులు’ లోపలకు రావాలని నాటి ఆంధ్ర నియంత పాలకుల్లాగా నేడు […]
సామాజిక సారథి, చిట్యాల: పేద రైతుల పొట్ట కొట్టే ఇండస్ట్రీయల్ పార్కు ప్రతిపాదనను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు, పిట్టంపల్లి గ్రామాలను సందర్శించి రైతులతో మాట్లాడారు. రైతులు సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూముల్లో ప్రభుత్వం ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం అన్యాయమన్నారు. కేవలం బడా పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసం రెక్కాడితే గాని డొక్కాడని 400మంది పేదరైతుల భూములు […]
సామాజిక సారథి, హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాడుతున్న విషయం తెలిసిందే. నీవంటే నీవే అంటూ వేలెత్తిచూపుకుంటున్నాయి. యాసంగి సంగతి అటుంచింతే వానాకాలంలో చేతికొచ్చిన ధాన్యం కొనే దిక్కులేదు. కల్లాలు, రోడ్లపై ఆరబోసిన ధాన్యం వద్ద రైతులు పడిగాపులు గాస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు వడ్లు మొలకెత్తడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. తమను ఆదుకునే దిక్కు ఎవరని గగ్గోలుపెడుతున్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. కేంద్రం వద్దంటే యాసంగిలో ధాన్యం కొనలేమని […]
పార్లమెంట్‌లో అనూహ్యంగా గౌడను ఆహ్వానించిన మోడీ న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎప్పుడూ హుందాగా ఉంటారు. ఖాళీ సమయంలో.. లేకపోతే వీలైనప్పుడు పలువురు కీలక నేతలను, మేథావులను, ప్రత్యేకమైన వ్యక్తులను కలిసి సంభాషిస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో ప్రధాని మోడీ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల్లో ఫొటోలను షేర్ చేసి తన అనుభవాలను పంచుకుంటుంటారు. ప్రస్తుతం పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బిజీగా ఉన్న ప్రధాని మోడీ తాజాగా మాజీ ప్రధానమంత్రి దేవేగౌడతో భేటీ అయ్యారు. పార్లమెంట్సమావేశాలకు హాజరైన హెచ్‌డీ దేవేగౌడను […]