పంచాయతీ కార్యదర్శి కి ఫిర్యాదు చేసిన పాలెం కాంగ్రెస్ నాయకులు
సామాజిక సారథి, నాగర్ కర్నూల్: బిజినేపల్లి మండలం పాలెం మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భూములు, ఖాళీ స్థలాలను అమ్ముకుంటున్న వారిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు పంచాయతీ కార్యదర్శి కి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలెం పేరుకే మేజర్ గ్రామపంచాయతీ అని పాలకులు, ప్రజాప్రతినిధుల అవినీతి అక్రమాలతో అభివృద్దికి నోచుకోవడం లేదన్నారు. పాలెం గ్రామంలో గత నాయకులు లు తమ స్వార్థం కోసం ప్రభుత్వ భూములకు ఓనటర్ షిప్ లు ఇస్తూ సొమ్ము చేసుకుంటున్నారన్నారు. గ్రామంలోని చెరువు అలుగు దగ్గర కలివెట్లను, ప్రభుత్వ రోడ్లను కజ్జా జేసి యదేచ్ఛగా ప్లాట్లుగా మార్చినా పట్టింఛుకునే వారు కరువయ్యారన్నారు. గ్రామంలో ఉన్న ఖాళీ ప్లాట్లకు హౌస్ నెంబర్లు వేసి అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తూ అందిన కాడికి దండుకుంటున్నారన్నారు. పాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భూములు, ఖాళీ స్థలాలు, రోడ్లు తదితర భూములను దర్జాగా అమ్ముకుంటున్న వారిపై జిల్లా అధికారులు స్పందించి వెంటనే విచారణ చేయాలంటూ పాలెం కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులను కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రామకృష్ణ, జయకృష్ణ, శేఖర్, పరుషరాముడు తదితరులు ఉన్నారు.