హెలికాప్టర్ ప్రమాద మృతుల గుర్తింపు మరో ఆరుగురి మృతదేహాల అప్పగింత న్యూఢిల్లీ: తమిళనాడులో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన వారిలో మరో ఆరుగురి మృతదేహాలను శనివారం గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన సైనికాధికారి సాయితేజతో పాటు వివేక్ కుమార్, మరో నలుగురు వాయుసేన సిబ్బంది మృతదేహాలను గుర్తించారు. వారి పార్థీవదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించామని ఆర్మీ అధికారులు వెల్లడించారు. మృతదేహాలను విమానాల్లో స్వస్థలాలకు తరలించనున్నామని, సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మిగిలిన మృతదేహాలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. […]
సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: సాయుధ దళాల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ చేయూతనందించాలని జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా కోరారు. సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా మంగళవారం కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో ఆయన తన వంతు విరాళం అందజేసి సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రక్షణకు, భారత ప్రజల సుఖశాంతుల కొరకు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పని చేస్తున్న భారత త్రివిధ దళాల సేవలు […]