
సామాజిక సారథి, సంగారెడ్డి: సంగారెడ్డి వాసవీ క్లబ్స్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఫ్రై డే మార్కెట్ మానిక్ ప్రభు మందిరంలో ఉచిత హోమియోపతి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఎం.ఎం.ఆర్ వైద్యశాల సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వాసవీ క్లబ్ ప్రతినిధులు చంద శ్రీధర్, ఇరుకుల్లా ప్రదీప్, కొంపల్లి విద్యాసాగర్, కటకం శ్రీనివాస్, చిలమకూరి నరేంద్ర, నామ శ్రీనివాస్ , నామ భాస్కర్, పుట్నాల లక్ష్మణ్, వెంకటేశం, మధుసూదన్, వాసవీ సభ్యులు, ఎం.ఎం.ఆర్. వైద్య బృందం, తదితరులు పాల్గొన్నారు.