Breaking News

Day: December 12, 2021

రావత్‌ దంపతుల చితాభస్మం నిమజ్జనం

రావత్‌ దంపతుల చితాభస్మం నిమజ్జనం

గంగానదిలో కలిపి కుమార్తెలు క్రితిక, తరిణి హరిద్వార్‌: హెలిక్యాప్టర్‌ ప్రమాదంలో మరణించిన చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ దంపతుల చితాభస్మాన్ని వారి కుమార్తెలు క్రితిక, తరిణి గంగానదిలో నిమజ్జనం చేశారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ పుణ్యక్షేత్రం వద్ద శ్రద్ధకర్మలు నిర్వహించి చితాభస్మాన్ని నదిలో కలిపారు. కుమార్తెలు ఇద్దరు కూడా తమ తల్లిదండ్రుల చితాభస్మాలు ఉంచిన పాత్రలను పూలతో నింపి విడివిడిగా నీళ్లలో జారవిడిచారు. జనరల్‌ బిపిన్‌ రావత్‌ దంపతులు తమిళనాడులోని కూనూరు వద్ద […]

Read More
ఆలస్యమైతే ఖర్చు పెరుగుతోంది

ఆలస్యమైతే ఖర్చు పెరుగుతోంది

  • December 12, 2021
  • Comments Off on ఆలస్యమైతే ఖర్చు పెరుగుతోంది

ప్రాజెక్టుల నత్తనడన సాగడంపై కేంద్రమంత్రి గడ్కరీ కీలక వ్యాఖ్యలు న్యూఢిల్లీ: పలు ప్రభుత్వ ప్రాజెక్టులు నత్తనడకన సాగడంపై కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టుల అమలులో జాప్యంతో తరచూ ప్రాజెక్టు వ్యయాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తాను ఎవరిపైనా ఆరోపణలు చేయడం లేదని, అయితే వ్యవస్థాగత లోటుపాట్లతోనే ప్రభుత్వ ప్రాజెక్టుల అమలులో జాప్యం జరుగుతోందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ యంత్రాంగంలో నిర్ణయ రాహిత్యం, సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యమే పెద్దసమస్యగా ముందుకొస్తోందని […]

Read More
కేంద్రంతో గొడవ లేదు

కేంద్రంతో గొడవ లేదు

  • December 12, 2021
  • Comments Off on కేంద్రంతో గొడవ లేదు

ఇచ్చిన మాటపై నిలబడకుంటే మరోసారి ఉద్యమం తప్పదు జనవరి 15న సంయుక్త కిసాన్‌ మోర్చా భేటీ రైతునేత రాకేశ్‌ టికాయత్‌ వెల్లడి న్యూఢిల్లీ: రైతులంతా ఇక తమ వ్యవసాయ పనులపై దృష్టి నిలపాలని రైతునేత రాకేశ్‌ టికాయత్‌ పిలుపునిచ్చారు. శాంతియుతంగా ఉంటూ అందరూ తమ తమ పనుల్లో మునిగిపోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీతో నిరసన చేస్తున్న రైతులందరూ ఇంటిబాట పట్టారు. అందులో భాగంగా ఘాజీపూర్‌ సరిహద్దుల్లో శిబిరాలను ఏర్పర్చుకున్న రైతులు ఆ స్థలాన్ని ఖాళీచేసి […]

Read More
రావత్ ఎక్కడున్నా అభివృద్ధిని చూస్తారు

ఎక్కడున్నా అభివృద్ధిని చూస్తారు

ప్రధాని నరేంద్రమోడీ ప్రతిష్టాత్మక సరయూ ప్రాజెక్టు ప్రారంభం లక్నో: స్వర్గీయ సీడీఎస్​చీఫ్​జనరల్‌ బిపిన్‌ రావత్‌ ఎక్కడ ఉన్నా రాబోయే రోజుల్లో భారత్‌ ముందుకెళ్తున్న తీరు, అభివృద్ధిని గమనిస్తూ ఉంటారని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. రావత్‌ మరణం ప్రతి దేశభక్తుడికి నష్టమే అన్నారు. ఆయన అత్యంత ధైర్యసాహాసాలు కలిగిన వ్యక్తి అని, దేశసైన్యాన్ని స్వయంవృద్ధి చేసేందుకు ఎంతో కృషిచేశారని కొనియాడారు. ఆయన పనితీరును దేశం ప్రత్యక్షంగా చూసిందని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్‌లో ప్రతిష్టాత్మకమైన సరయూ నహర్‌ నేషనల్‌ ప్రాజెక్టును […]

Read More
రైతు ఉసురు ముట్టక తప్పదు

రైతు ఉసురు ముట్టక తప్పదు

టీఆర్‌ఎస్‌ సర్కార్‌ కూలిపోవడం ఖాయం రైతు రవి కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల, రఘునందర్ రావు సామాజికసారథి, మెదక్‌: రాష్ట్రంలోని రైతుల ఉసురు తగిలి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూలిపోతుందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. జిల్లాలోని హవేళి ఘనపూర్‌ మండలం బోగడ భూపతిపూర్‌ గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు రవి కుటుంబాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల, రఘునందన్‌రావు శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్​మాట్లాడుతూ.. రాష్ట్రంలో మోతబారి రైతునని చెప్పుకునే సీఎం కేసీఆర్‌ […]

Read More
వైఎస్ షర్మిల దీక్ష భగ్నం, అరెస్ట్‌

వైఎస్ ​షర్మిల దీక్షభగ్నం, అరెస్ట్‌

  • December 12, 2021
  • Comments Off on వైఎస్ ​షర్మిల దీక్షభగ్నం, అరెస్ట్‌

సామాజిక సారథి, మెదక్: ఆత్మహత్య చేసుకున్న రైతు రవి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్​చేస్తూ మెదక్​ జిల్లా హవేలి ఘనపూర్‌ మండలం బొగుడు భూపతిపూర్‌ గ్రామంలో వైఎస్సార్‌ టీపీ నాయకురాలు షర్మిల చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అనంతరం ఆమెను అరెస్ట్‌ చేశారు. షర్మిలతో పాటు పలువురు పార్టీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు  షర్మిల మాట్లాడుతూ.. రైతు రవి కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పరిహారం ఇచ్చేవరకూ దీక్ష […]

Read More
రైతుల ఆత్మహత్యలు కనిపించడం లేదా?

రైతుల ఆత్మహత్యలు కనిపించడం లేదా?

వానాకాలం పంటను ఎందుకు కొనడం లేదు సీఎం, మంత్రుల భాష మార్చుకోవాలి బీజేపీ చీఫ్​బండి సంజయ్​ఫైర్​ సామాజికసారథి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పనితీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మరోమారు ధ్వజమెత్తారు. వర్షాకాలం పంట కొనబోమని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ ఎక్కడా చెప్పలేదన్నారు. వానాకాలం పంటను కొంటామని టీఆర్ఎస్​పార్లమెంటరీ పక్షనేత నామా నాగేశ్వర్​రావు ఎదుటే గోయల్‌ చెప్పారని వివరించారు. వానాకాలం పంటను సీఎం కేసీఆర్‌ ఎందుకు కొనడం లేదని ప్రశ్నించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కనిపించడం […]

Read More
పాన్ షాపులో చోరీ

పాన్ షాపులో చోరీ

సామాజిక సారథి, మహబూబ్ నగర్, నవాబుపేట్: పాన్ షాపులో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడినట్లు బాధితుడు తెలిపారు. బాధితుడు తెలిపిన వివరాల్లోకి వెళితే మండల పరిధిలోగల కొల్లూరు గ్రామంలో గేటు దగ్గర పాన్ షాప్ లో శనివారం అర్ధరాత్రి దొంగతనం జరిగింది వివరాల్లోకి వెళితే మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట్ మండలం కొల్లూరు గ్రామానికి చెందిన వడ్ల నరేష్ గత ఏడాది నుంచి కొల్లూరు గేటుపై ఉన్న దాబాల దగ్గర పాన్ షాపు పెట్టుకొని జీవనోపాధి […]

Read More