Breaking News

ఆరోగ్య పరిరక్షణకు నడుం బిగించండి

ఆరోగ్య పరిరక్షణకు నడుం బిగించండి

– ఫార్మసీ విద్యార్థులకు ప్రిన్సిపాల్ ఉద్బోధ

సామాజిక సారథి, పటాన్‌చెరు: ఫార్మశీ విద్యార్థులు ఆరోగ్య పరిరక్షణలో తమకున్న జ్ఞానాన్ని సమాజానికి పంచి, ప్రజలను చైతన్య వంతులుగా చేయాలని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఎస్ కుమార్ పిలుపునిచ్చారు. గీతం ఫార్మసీ విద్యార్థుల సంఘాన్ని (జీపీఎస్ఏ) గురువారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య పరిరక్షణ, పరిశుభ్రత, ఔషధ వినియోగం, వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తలు వంటి విషయాలను ఫార్మసీ విద్యార్థులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. గీతం ప్రాంగణం చుట్టుపక్కలున్న పాఠశాలలు, గ్రామాలకు వెళ్లి అక్కడి విద్యార్థుల, గ్రామీణుల ఆరోగ్య స్థితిగతులను తెలుసుకోని, పలు వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియలన్నారు. అలాగే సమాజాన్ని పట్టి పీడిస్తూ, ప్రజల ఆర్థిక స్థితిని దిగజారుస్తున్న క్యాన్సర్ ప్రబలడానికి కారణాలు, నివారణా చర్యలపై ప్రజలకు అవగాహన కలిగించాలని చెప్పారు. కరోనా వ్యాక్సిన్లపై  ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాలని ఫార్మసీ విద్యార్థులకు సూచించారు.