Breaking News

జినేక్స్ సీడ్స్ కంపెనీ క్షేత్ర ప్రదర్శన

జినేక్స్ సీడ్స్ కంపెనీ క్షేత్ర ప్రదర్శన

సామాజిక సారథి, నిజాంపేట్: జినేక్స్ సీడ్స్ కంపెనీ క్షేత్ర ప్రదర్శన రీజినల్ మేనేజర్ కోటిరెడ్డి తెలిపారు. ఆదివారం మెదక్ జిల్లా కల్వకుంట గ్రామంలో జీనేక్స్ సీడ్స్ ఇండియా సౌజన్యంతో జీపీహెచ్ 699వరి రకంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారుమడి సిద్ధం చేసుకునే ముందు మేలిమి రకాలతో నారు మడిని చేసుకున్నట్లయితే మంచి దిగుబడుతో పాటు అధిక లాభాలు అర్జించవచ్చన్నారు. కల్వకుంట గ్రామానికి చెందిన సంగారెడ్డి అను రైతు తనకున్న 12ఎకరాల్లో జిపిహెచ్ 699వరిని సాగు చేయగా అధిక దిగుబడి వచ్చినట్లు తెలిపారు. జినేక్ సీడ్స్ మొక్కజొన్న, పత్తి, వివిధ రకాల విత్తనాలు లభిస్తాయని రైతులకు వివరించారు. ఈత కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తమన్న, కృష్ణవేణి మధుసూదన్ రెడ్డి, ఏరియా ఆఫీసర్ నవీన్ బాల్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, వివిధ గ్రామాల రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.