Breaking News

SEEDS

జినేక్స్ సీడ్స్ కంపెనీ క్షేత్ర ప్రదర్శన

జినేక్స్ సీడ్స్ కంపెనీ క్షేత్ర ప్రదర్శన

సామాజిక సారథి, నిజాంపేట్: జినేక్స్ సీడ్స్ కంపెనీ క్షేత్ర ప్రదర్శన రీజినల్ మేనేజర్ కోటిరెడ్డి తెలిపారు. ఆదివారం మెదక్ జిల్లా కల్వకుంట గ్రామంలో జీనేక్స్ సీడ్స్ ఇండియా సౌజన్యంతో జీపీహెచ్ 699వరి రకంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారుమడి సిద్ధం చేసుకునే ముందు మేలిమి రకాలతో నారు మడిని చేసుకున్నట్లయితే మంచి దిగుబడుతో పాటు అధిక లాభాలు అర్జించవచ్చన్నారు. కల్వకుంట గ్రామానికి చెందిన సంగారెడ్డి అను రైతు తనకున్న 12ఎకరాల్లో జిపిహెచ్ […]

Read More
నకిలీ విత్తనాలు అమ్మితే కటకటాలే

నకిలీ విత్తనాలు అమ్మితే కటకటాలే

సారథి, పెద్దశంకరంపేట: ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే చట్టరీత్యా కఠినచర్యలు తీసుకుంటామని పెద్దశంకరంపేట ఎస్సై నరేందర్ హెచ్చరించారు. మంగళవారం మెదక్​ జిల్లా పెద్దశంకరంపేట మండలం కమలాపూర్ లో రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతులు తీసుకున్న విత్తనాలను పరిశీలించారు. రైతులు నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దని సూచించారు. ఎవరైనా నాసిరకం విత్తనాలను అంటగడితే తమకు సమాచార ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్​ల ఫోరం మండలాధ్యక్షుడు కుంట్ల రాములు, రైతులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Read More
నకిలీ సీడ్స్ అమ్మితే కఠినచర్యలు

నకిలీ సీడ్స్ అమ్మితే కఠిన చర్యలు

సారథి, రామాయంపేట: ఈ వానాకాలం సీజన్ లో రైతులకు నాణ్యమైన విత్తనాలను మాత్రమే విక్రయించాలని, ఎవరైనా సీడ్ షాప్ ఓనర్లు నకిలీ సీడ్స్ ను రైతులకు అంటగడితే చట్టరీత్యాచర్యలు తీసుకుంటామని నిజాంపేట అగ్రికల్చర్ ఆఫీసర్ సతీశ్ హెచ్చరించారు. బుధవారం ఆయన మండల కేంద్రంలోని పలు ఫర్టిలైజర్ షాపులను తనిఖీచేసి స్టాక్ రిజిస్టర్, ధరల పట్టిక, బిల్లు బుక్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించాలనే సంకల్పంతో వ్యవసాయశాఖ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో […]

Read More
నకిలీ సీడ్స్ అమ్మితే జైలుకే

నకిలీ సీడ్స్ అమ్మితే జైలుకే

సారథి, రామాయంపేట: నకిలీ సీడ్స్, ఫర్టిలైజర్ గానీ రైతులకు అమ్మితే పీడీ యాక్ట్ కింద కేసునమోదు చేసి జైలుకు పంపిస్తామని నిజాంపేట ఎస్సై ప్రకాష్ గౌడ్ ఫర్టిలైజర్ షాప్ దుకాణాల యజమానులకు వార్నింగ్ ఇచ్చారు. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని పలు విత్తన, ఫర్టిలైజర్ షాపులను ఆయన తన సిబ్బందితో కలసి మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నకిలీ సీడ్స్ గురించి ఎలాంటి సమాచారం రైతుల దగ్గర ఉన్నా పోలీస్ సిబ్బంది, […]

Read More
నకిలీ విత్తనాలు అంటగడితే చర్యలు

నకిలీ విత్తనాలు అంటగడితే చర్యలు

సారథి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల వేములవాడ నియోజకవర్గంలోని చందుర్తి మండల కేంద్రంలో గురువారం ఫర్టిలైజర్ దుకాణాలను వ్యవసాయశాఖ, పోలీసు అధికారులు తనిఖీ చేశారు. రైతులను ఎవరైనా నకిలీ విత్తనాలు, నాసిరకం పురుగుల మందులు విక్రయిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. అలాంటి వారిపై గ్రామాల్లో పోలీసుల నిఘా ఉంటుందని. ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. రైతులు లైసెన్సులు కలిగిన డీలర్ల వద్ద మాత్రమే కొనుగోలుచేసి రికార్డులు పొందాలన్నారు. తనిఖీల్లో వేములవాడ డీఎస్పీతో పాటు […]

Read More
నకిలీ విత్తనాల పట్టివేత

నకిలీ విత్తనాల పట్టివేత

సారథి, మల్దకల్: రైతులకు నకిలీ విత్తనాలు విక్రయించేవారిపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో అధికారులు రంగంలోకి దిగారు. విత్తనాలు విక్రయిస్తున్న వ్యాపారులపై దృష్టిపెట్టారు. ఆదివారం జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్ ఎస్సై శేఖర్ తన సిబ్బందితో పక్కా సమాచారంతో దాడులు చేసి 30 క్వింటాళ్ల నకిలీ విత్తనాలను పట్టుకున్నారు. రైతులకు ఎవరు నకిలీ ఎరువులు, విత్తనాలు విక్రయించినా చర్యలు తప్పవని హెచ్చరించారు..

Read More
నకిలీ సీడ్స్ అమ్మితే పీడీయాక్టు

నకిలీ సీడ్స్ అమ్మితే పీడీయాక్టు

సారథి ప్రతినిధి, నాగర్ కర్నూల్: జిల్లా రైతులు, ప్రజలకు నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మడం, సరఫరా చేయడం, తయారుచేయడం చేస్తే కఠినచర్యలు తప్పవని జిల్లా ఎస్పీ డాక్టర్ వై.సాయిశేఖర్ హెచ్చరించారు. వారిపై పీడీ యాక్టు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎవరైనా అనుమానిత వ్యక్తులు అలా చేస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. వ్యాపారం చేయుదలుచుకున్నవారు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడొద్దని సూచించారు. ప్రభుత్వం అనుమతి పొందిన కంపెనీకి చెందిన విత్తనాలను […]

Read More
5రోజులు విస్తారంగా వర్షాలు

5రోజులు విస్తారంగా వర్షాలు

సారథి న్యూస్​ : రుతుపవనాల ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే సాధారణం కంటే వర్షపాతం నమోదైంది. పలు చోట్ల వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా రాయలసీమలో ఈ సారి వర్షాల తీవ్రత అధికంగానే ఉంది. కాగా నేటి నుంచి అయిదు రోజుల పాటు తెలంగాణ, కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో ఈ రోజు, రేపు ఉరుముల‌తో కూడిన భారీ […]

Read More