Breaking News

అన్నదాతలు అధైర్యపడొద్దు

అన్నదాతలు అధైర్యపడొద్దు

సామాజిక సారథి, చేగుంట: అన్నదాతలు అధైర్యపడొద్దు ప్రతి గింజ కొంటామని ఎమ్మెల్సీ ఫరక్ హుస్సేన్ అన్నారు. మంగళవారం మెదక్ జిల్లా చేగుంట మండలంలోని పలు గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ యార్డులు, గ్రామీణ ప్రాంతాల్లో ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, రైతుల నుంచి ధాన్యాన్ని తీసుకుంటుందని చెప్పారు. సీఎం కేసీఆర్ రైతుల అభ్యున్నతి కోసం రూ. 2060 మద్దతు ధర కల్పిస్తున్నాడని తెలిపారు. రైతులు దళారులను నమ్మిమోసపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాసుల శ్రీనివాస్, జడ్పీటీసీ మదం శ్రీనివాస్, ఇబ్రహీంపూర్ సొసైటీ చైర్మన్ కొండల్ రెడ్డి, స్వామి, వైస్ చైర్మన్ పట్నం తనీషా, సర్పంచులు కుమ్మరి శ్రీనివాస్, రాములు, ఐకేపీ ఏపీఎం లక్ష్మీనర్సమ్మ, టీఆర్ఎస్ నాయకులు, నారాయణరెడ్డి, బండి విశ్వేశ్వర్, సురేష్ రెడ్డి, గౌస్, జానీ, హలీ, సత్ రెడ్డి, చిత్తారి, సొసైటీ డైరెక్టర్లు పాల్గొన్నారు.