Breaking News

RTC

ఆర్టీసీ బస్సు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి సూసైడ్

 ఆర్టీసీ బస్సు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి సూసైడ్​

సామాజిక సారథి, పటాన్‌చెరు: రన్నింగ్ ఆర్టీసీ బస్సు కింద పడి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రామచంద్రాపురం పోలీస్ స్టేషన్​ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం… లింగంపల్లి చౌరస్తా వద్ద ఓ వ్యక్తి ఒక్కసారిగా పటాన్​చెరు వైపు నుండి మెహదీపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెణక చక్రాల కింద పడుకున్నాడు. దీంతో ఆ వ్యక్తి చాతి, మెడపై నుండి బస్సు వెళ్లడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మరణించాడు. […]

Read More
ఆర్టీసీ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు తీపికబురు

ఆర్టీసీ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు తీపికబురు

సర్వీస్‌ క్రమబద్ధీకరిస్తామని ఎండీ సజ్జనార్​భరోసా సామాజికసారథి, హైదరాబాద్‌: కొత్త సంవత్సరం తొలి రోజున ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తీపికబురు అందించారు. ఎన్నో ఏళ్లుగా ఔట్‌ సోర్సింగ్‌లో పనిచేస్తున్న వారిని రానున్న రోజుల్లో పర్మినెంట్‌ ఉద్యోగులుగా పరిగణనలోకి తీసుకుంటామని భరోసాఇచ్చారు. ఈ మేరకు చర్యలు చేపడుతున్నామని సజ్జనార్‌ ప్రకటించారు. ‘సంస్థ అభివృద్ధి చెందితే.. మనందరం బాగుపడతాం. టీఎస్‌ఆర్టీసీ ఏ ఒక్కరిది కాదు.. మనందరిదీ. ఇందులో ఎవరూ శాశ్వతంగా ఉండరు. ఉన్నన్ని రోజులు సంస్థ అభివృద్ధి కోసం […]

Read More
ఆర్టీసీ బాదుడు

ఆర్టీసీ బాదుడు

ఇక పెరగనున్న బస్సుచార్జీలు ఆర్డినరీ బస్సుల్లో కి.మీ. 0.25 పైసలు ఇతర బస్సుల్లో 0.30 పైసలు ప్రభుత్వానికి యాజమాన్యం ప్రతిపాదనలు చార్జీల పెంపు అనివార్యమైంది: మంత్రి అజయ్​ మూడేళ్లలో ఆర్టీసీకి రూ.4,260 కోట్ల నష్టం నష్టాల తగ్గింపునకు మరోమార్గం లేదు: ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ సామాజిక సారథి, హైదరాబాద్‌: అందరూ ఊహించిన విధంగానే ఆర్టీసీ చార్జీలు పెరగనున్నాయి. ఆర్డినరీ బస్సుల్లో కిలోమీటర్‌కు 0.25 పైసలు, ఇతర బస్సుల్లో 0.30 పైసలు మేర చార్జీలు ప్రభుత్వం పెంచనుంది. […]

Read More
బస్సులో మహిళ వద్ద నుంచి

బస్సులో మహిళ వద్ద నుంచి

లక్ష రూపాయల నగదు, బంగారం చోరీ సామాజిక సారథి, సంగారెడ్డి: సదాశివపేటలో బస్సు ఎక్కిన మహిళ వద్ద నుంచి లక్ష రూపాయల నగదు, మూడు మాసాల బంగారం చోరి జరిగింది. బాధితురాలు, పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణానికి చెందిన విజయలక్ష్మీ తన భర్త ,కూతురుతో హైదరాబాద్ వెళ్లేందుకు సోమవారం ఉదయం 11 గంటలకు సంగారెడ్డి బస్సు ఎక్కారు. బస్సు నందికంది వద్దకు చేరుకోగానే విజయలక్ష్మి టిక్కెట్ తీసుకునేందుకు చిల్లర కోసం […]

Read More
బోల్తా పడిన ఆర్టీసీ బస్సు

బోల్తా పడిన ఆర్టీసీ బస్సు

సామాజిక సారథి‌, తల్లాడ: రోడ్డు మరమ్మతుల్లో భాగంగా ప్రమాద నివారణ చర్యలు లోపించి ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అంబేద్కర్ నగర్ వద్ద ఆదివారం తెల్లవారుజామున ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా పోలవరం నుంచి శనివారం రాత్రి మియాపూర్ కు బయల్దేరిన కొత్తగూడెం డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు మార్గమధ్యలో తల్లాడ మండలం అంబేద్కర్ నగర్ వద్ద గుంతలు […]

Read More

గ్రేటర్​లో రైట్​రైట్​!

సారథిన్యూస్​, హైదరాబాద్​: గ్రేటర్​ హైదరాబాద్​లో కొన్ని నిబంధనలతో 25 శాతం బస్సులు నడిపిందేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. నిబంధనలు అమలు చేస్తూ అన్ని రూట్లలో బస్సులు నడపనున్నట్టు సమాచారం. ఈ మేరకు గురువారం రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ వెల్లడించారు. కరోనా లాక్ డౌన్ అప్పటి నుంచి హైదరాబాద్​లో బస్సులు ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే శుక్రవారం నుంచి బస్సులు తిరిగి ప్రారంభం కానున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లో మొత్తం 29 డిపోలలో ఉన్న దాదాపు 2800 […]

Read More

కొత్త చిక్కుల్లో తెలంగాణ ఆర్టీసీ

సారథిన్యూస్​, హైదరాబాద్​: కరోనా ఆంక్షలతో ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న తెలంగాణ ఆర్టీసీకి కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. డీజిల్​ ధరలు అమాంతం పెరుగడంతో సంస్థ నష్టాల్లో కూరుకుపోతున్నది.దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న డీజిల్‌ ధరలు..సంస్థకు మోయలేని భారంగా మారాయి. ఓ వైపు ఆక్యుపెన్సీ లేక.. మరోవైపు పెట్రో భారం కలిసి పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోతోంది తెలంగాణ ఆర్టీసీ. కరోనా నిబంధనల వల్ల తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో సగం సీట్లలోనే ప్రయాణికుల్ని అనుమతిస్తున్నారు. వైరస్​ భయంతో ప్రజలు ‌ఆ సగం […]

Read More
సీఎం ఒంటెద్దు పోకడలు సరికాదు

సీఎం ఒంటెద్దు పోకడలు సరికాదు

ఆర్టీసీ మాజీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ సారథి న్యూస్​, పెద్దపల్లి: గోదావరి నీటి విషయంలో కరీంనగర్, పెద్దపెల్లి జిల్లాలకు అన్యాయం చేస్తే ఊరుకోబోమని ఆర్టీసీ మాజీ చైర్మన్, రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ హెచ్చరించారు. రెండు జిల్లాలకు మూడు పంటలకు నీళ్లు ఇచ్చిన తర్వాతే మిగతా నీటిని బయటకు తీసుకెళ్లాలని సూచించారు. మంగళవారం రామగుండంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గోదావరి జలాల గురించి సీఎం కేసీఆర్​ అవాస్తవాలు మాట్లాడుతున్నారని అన్నారు. కాళేశ్వరం నీటిని కరీంనగర్​, పెద్దపల్లి […]

Read More