సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: 2023లో రాష్ట్ర ప్రజలతో పాటు నాగర్ కర్నూల్ నియోజకవర్గ ప్రజలకు అంతా మంచి జరగాలని ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి తనయుడు, డెంటల్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కూచకుళ్ల రాజేశ్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆయన జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది ప్రతి ఒక్కరికి కలిసి రావాలని కోరారు. రైతులకు పాడిపంటలు కలగాలని ఆకాంక్షించారు. […]
సామాజిక సారథి, చేగుంట: అన్నదాతలు అధైర్యపడొద్దు ప్రతి గింజ కొంటామని ఎమ్మెల్సీ ఫరక్ హుస్సేన్ అన్నారు. మంగళవారం మెదక్ జిల్లా చేగుంట మండలంలోని పలు గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ యార్డులు, గ్రామీణ ప్రాంతాల్లో ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, రైతుల నుంచి ధాన్యాన్ని తీసుకుంటుందని చెప్పారు. సీఎం కేసీఆర్ రైతుల అభ్యున్నతి కోసం రూ. 2060 మద్దతు ధర కల్పిస్తున్నాడని […]
సామాజిక సారథి, రంగారెడ్డి బ్యూరో: అభివృద్దికి పట్టం కట్టాలని ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం మునుగోడు నియోజకవర్గం నాంపల్లి మండలం రేవల్లి గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించి బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఆసరా పెన్షన్, ఉచిత కరెంట్, రైతుబంధు, ఇంటింటి నల్ల, రైతు భీమా, సీఎం రిలీఫ్ […]
టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి ఘన విజయం సామాజిక సారథి, నల్లగొండ ప్రతినిధి: ఎమ్మెల్సీ ఎన్నికలో రేసులో అంతా అనుకున్నట్లే కారే గెలిచింది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి ఘన విజయం సాధించారు. నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎన్నిక అనంతరం మహిళా సమాఖ్య భవన్ లో మంగళవారం కౌంటింగ్ ఉదయం నిర్వహించారు. ఏడుగురు అభ్యర్థు పోటీ పడిన ఈ ఎన్నికల్లో 1271 ఓట్లుకుగాను, 1233 ఓట్లు పోలయ్యాయి. కాగా, కౌంటింగ్ లో ఎంసీ కోటిరెడ్డికి […]
ఆర్వో, జిల్లా కలెక్టర్ పీజే పాటిల్ సిబ్బందికి అవగాహన సదస్సు ఈనెల 14 ఉదయం నుంచే లెక్కింపు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుంటేనే అనుమతి సామాజిక సారథి, నల్లగొండ ప్రతినిధి: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ను పారదర్శకంగానే జరుగుతుందని ఎన్నికల అధికారి, కలెక్టర్ పీజే పాటిల్ పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని జిల్లా మహిళా సమాఖ్య (డిఆర్డీఏ) భవనంలో కౌంటింగ్ కేంద్రంలో సిబ్బందికి శనివారం నిర్వహించిన శిక్షణా కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ఈనెల […]
సామాజిక సారథి ,మెదక్ ప్రతినిధి: ఎటువంటి చిన్న పొరపాటు, సంఘటన జరగకుండా మెదక్ స్థానిక సంస్థల నియోజక వర్గ శాసన మండలి ఎన్నిక ప్రశాంతంగా, సాఫీగా జరిగేలా చూడాలని ఎన్నికల పరిశీలకులు వీరబ్రహ్మయ్య పోలింగ్ అధికారులకు సూచించారు. ఈ నెల 10 న మెదక్ శాసన మండలికి జరగగున్న ఎన్నికల సందర్భంగా గురువారం స్థానిక బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కేంద్రంలో (9) పోలింగ్ కేంద్రాలకు సంబంధించి వచ్చిన పోలింగ్ అధికారులు, సెక్టోరల్ అధికారులు, […]
రిటర్నింగ్ అధికారి, నల్లగొండ కలెక్టర్ పీజే పాటిల్ నిబంధనలు ఉల్లంఘిస్తే రెండేళ్ల జైలు, జరిమానా సామాజిక సారథి, నల్లగొండ ప్రతినిధి: స్థానిక సంస్థల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికల పోలింగ్ ముగింపునకు 72 గంటల ముందు డిసెంబర్ 7సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎమ్మెల్సీ ప్రచారాన్ని నిలిపివేయాలని రిటర్నింగ్ అధికారి, నల్లగొండ కలెక్టర్ పీజే పాటిల్ ఆదేశించారు. కలెక్టరేట్ లో ఆయన మాట్లాడుతూ డిసెంబరు 10వ తేదీన పోలింగ్ ముగిసే వరకూ నిశబ్ధ కాలం (సైలెన్స్ పీరియడ్) […]
ఆత్మగౌరవం కోసమే ఎమ్మెల్సీగా పోటీ టీఆర్ఎస్ పార్టీకి చెమటలు పట్టిస్తున్నాం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి వంగూరి లక్ష్మయ్య సామాజిక సారథి, నల్లగొండ ప్రతినిధి: తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థలను నిర్వీర్యంచేసే కుట్ర చేస్తోందని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి, జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య ఆరోపించారు. నల్లగొండలోని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి స్థానిక సంస్థలకు […]