సామాజికసారథి, శివ్వంపేట: మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్రానికి చెందిన ముద్దగల్ల అంజయ్య కుమారుడు శ్రీకాంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలుసుకున్న జెడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా బుధవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. తనవంతు సహాయంగా తన సొంత డబ్బులు రూ.ఐదువేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. రోడ్డు ప్రమాదంలో శ్రీకాంత్ గాయపడటం బాధాకరమని, ఆయన కుటుంబానికి తామంతా అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ పద్మ వెంకటేశ్, గ్రామ కమిటీ అధ్యక్షుడు లక్ష్మీ నర్సయ్య, వార్డుసభ్యులు పోచగౌడ్, జ్యోతి సింహం, జ్యోతి బాలేశ్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు రవినాయక్, దొడ్లే అశోక్, ఖదీర్, సాయి, వెంకటేశ్ పాల్గొన్నారు.
- August 31, 2022
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- medak
- SHIVAMPET
- ZPTC
- జడ్పీటీసీ
- మెదక్
- శివ్వంపేట
- Comments Off on ఆర్థిక సహాయం అందజేత