Breaking News

Day: August 31, 2022

డీజేలకు అనుమతి వద్దు

గణేశ్​ మండపాల వద్ద డీజేలకు అనుమతి వద్దు

సామాజికసారథి, రామకృష్ణాపూర్: గణేశ్​ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన మండపాల వద్ద డీజే, సినిమా పాటలకు తావివ్వకుండా భక్తి పాటలతో ఉత్సవాలను నిర్వహించుకోవాలని టీడీపీ పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షుడు సంజయ్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని జీటీ హాస్టల్ బాలగణేష్ మండలి వద్ద ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భారతీయ, తెలంగాణ సంస్కృతిని తలపించేలా రామాయణం, మహాభారతం, సాంస్కృతి వేషధారణకు సంబంధించిన కార్యక్రమాలతో యువత, విద్యార్థులను చైతన్య పరిచేలా సెప్టెంబర్ 5న పట్టణంలోని జీటీ హాస్టల్ […]

Read More
ఆర్థిక సాయం అందజేత

ఆర్థిక సహాయం అందజేత

సామాజికసారథి, శివ్వంపేట: మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్రానికి చెందిన ముద్దగల్ల అంజయ్య కుమారుడు శ్రీకాంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలుసుకున్న జెడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా బుధవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. తనవంతు సహాయంగా తన సొంత డబ్బులు రూ.ఐదువేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. రోడ్డు ప్రమాదంలో శ్రీకాంత్ గాయపడటం బాధాకరమని, ఆయన కుటుంబానికి తామంతా అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ పద్మ వెంకటేశ్, గ్రామ కమిటీ […]

Read More
ఆపదలో అండగా సీఎం సహాయ నిధి

ఆపదలో అండగా సీఎం సహాయనిధి

సామాజికసారథి, తలకొండపల్లి: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చెన్నారం పంచాయతీలో బుధవారం బొడియ్యతండాకు చెందిన రాత్లావత్ బిందుకు చెన్నారం గ్రామానికి చెందిన హరిత కొండలచారి, ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సహకారంతో మంజూరైన రాత్లావత్ బిందుకు రూ.11వేలు, హరితకు రూ.14,500 వేలు సీఎంఆర్ఎఫ్ చెక్కును ఆమనగల్లు మార్కెట్ కమిటీ చైర్మన్ నాలాపురం శ్రీనివాస్ రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ స్వప్నభాస్కర్ రెడ్డి, చుక్కపూర్ ఎంపీటీసీ నాలాపురం వందన, రైతు గ్రామ కమిటీ అధ్యక్షుడు గుమకొండ […]

Read More
జై గణేశా.. జై జై గణశా!!

కొలువుదీరిన గణపయ్య

సామాజికసారథి, చిట్యాల: నల్గొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో గణనాథుడిని ప్రతిష్టించారు. జై గణేశా.. జై జై గణేశా!! అనే నామస్మరణ మార్మోగింది. యువజన సంఘాల సభ్యులు పూజలో పాల్గొన్నారు. అనంతరం ప్రసాదం అందజేశారు. ఆపదలు తొలగించే గణాధిపతి సామాజికసారథి, మందమర్రి (మంచిర్యాల): దేవుళ్లలో ప్రథముడు, జ్ఞానం పరిపూర్ణత అదృష్టానికి ప్రతీక విజ్ఞానం తొలగించే గణనాథుడి ఆశీస్సులు ప్రతిఒక్కరి జీవితంలోనూ ఉండాలని, సుఖసంతోషాలు శాంతి శ్రేయస్సుతో నిండిపోవాలని, ఆటంకాలను పోగొట్టి […]

Read More
ఘనంగా వీడ్కోలు సన్మాన సభ

ఘనంగా వీడ్కోలు సన్మాన సభ

సామాజికసారథి, మందమర్రి (మంచిర్యాల): మందమర్రి సింగరేణి పర్సనల్ విభాగంలో డిప్యూటీ సూపరింటెండెంట్ గ్రేడ్-ఏ విధులు నిర్వహించి బుధవారం పదవి విరమణ పొందిన సీఎస్ కనాన్ ను మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో ఇన్​చార్జ్​ జీఎం కృష్ణారావు బుధవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1983 లో సింగరేణి సంస్థలో జనరల్ మజ్దూర్ గా మందమర్రి ఏరియా వర్క్ షాపులో ఉద్యోగంలో చేరి అంచెలంచెలుగా ఎదుగుతూ డిప్యూటీ సూపరింటెండెంట్ స్థాయికి ఎదిగి క్రమశిక్షణతో, నిబద్ధతతో […]

Read More
కొలువుదీరిన గణనాథుడు

కొలువుతీరిన గణనాథుడు

సామాజికసారథి, సుల్తానాబాద్ : వినాయక చవితి నవరాత్రి వేడుకలను పురస్కరించుకుని బుధవారం సుల్తానాబాద్ మండల కేంద్రంలో ప్రధాన కూడళ్లలో భక్తులు ఏర్పాటు చేసిన మండపాల్లో బుధవారం గణనాథుడు కొలువుదీరాడు. వేదపండితులు సూచించిన శుభముహూర్తానికి భక్తులు ప్రత్యేక పూజలుచేసి గణనాథుడి మండపంలో ప్రతిష్టించారు. అంతకుముందు వినాయకులను కొనుగోలు చేసిన భక్తులు మండపాల వరకు శోభాయాత్ర నిర్వహించారు. దీంతో సుల్తానాబాద్ పట్టణంలోని ప్రధాన రహదారులపై సందడి నెలకొంది. దాదాపు అన్నివార్డుల్లో ఏర్పాటుచేసిన మండపాల వల్ల వార్డుల్లో పండగ వాతావరణం నెలకొంది.

Read More
వినాయకుడికి ఎమ్మెల్యే చిరుమర్తి పూజలు

వినాయకుడికి ఎమ్మెల్యే చిరుమర్తి పూజలు

సామాజిక సారథి, నకిరేకల్: నకిరేకల్ పట్టణంలోని పలు వార్డులలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని గణపతి మండపాల వద్ద విఘ్నేశ్వరుడికి బుధవారం మొదటిరోజు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రజలంతా శాంతి సౌభ్రాతృత్వాలు వెల్లివిరిసేలా ఆనందంతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా వాటిని వినాయకుని దీవెనలతో అధిగమిస్తూ, సకల జన సంక్షేమమే లక్ష్యంగా, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను […]

Read More